నీరజ్ చోప్రా: ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించిన భారత క్రీడాకారుడు.. ఫైనల్స్ ఎలా సాగాయి?

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆండర్సన్ స్వర్ణ పతకాన్ని, నీరజ్ చోప్రా రజత పతకాన్ని, జాకబ్ వడ్లెక్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా భారత్‌కు మరోసారి పతకాన్ని అందించాడు. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల జావెలిన్ త్రోలో రజత పతకాన్ని గెలుచుకున్నాడు.

19 ఏళ్ల తరువాత మళ్లీ భారతీయుడికి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో పతకం లభించింది.

అంతకుముందు, 2003లో మహిళల లాంగ్ జంప్‌లో అంజు బాబీ జార్జ్ కాంస్య పతకాన్ని సాధించారు.

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గ్రెనడాకు చెందిన ఆండర్సన్ పీటర్స్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. తన చివరి త్రోలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ, జావెలిన్‌ను 90.54 మీటర్ల దూరంలో విసిరాడు.

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచి ఫైనల్‌కు..

అమెరికాలో ఒరెగాన్‌లోని యూజీన్‌లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రో విభాగంలో భారత్‌కు క్రీడాకారులు నీరజ్ చోప్రా, రోహిత్ యాదవ్ క్వాలిఫైయింగ్ రౌండ్ నుంచి ఫైనల్‌కు చేరుకున్నారు.

ఇరవై ఏళ్లుగా భారత్ ఎదురుచూసిన అవకాశం ఇప్పుడు మళ్లీ లభించింది. 2003లో లాంగ్ జంపర్ అంజు బాబీ జార్జ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు కాంస్య పతకాన్ని అందించారు. అప్పట్లో ఈ గేమ్స్ పారిస్‌లో జరిగాయి.

ఈసారి ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా స్వర్ణం సాధిస్తాడని అందరూ భావించారు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో 83.50 మీటర్ల జావెలిన్ త్రోతో ఫైనల్ రౌండ్‌కు చేరుకున్న నీరజ్ చోప్రా తొలి ప్రయత్నంలోనే 88.39 మీటర్ల త్రోతో అర్హత సాధించాడు. నీరజ్ లక్ష్యానికి 80.42 మీటర్ల దూరంలో జావెలిన్ విసిరినప్పటికీ, 11వ ర్యాంకింగ్‌తో ఫైనల్స్‌కు అర్హత సాధించాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా 87.58 మీటర్లు విసిరాడు. ఈసారి క్వాలిఫయింగ్ రౌండ్‌లో జావెలిన్‌ను 88.39 మీటర్లకు విసిరాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

రోహిత్ యాదవ్ వ్యక్తిగత అత్యుత్తమం 82.54 మీ. కాబట్టి, అమెరికాలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రోహిత్ యాదవ్ కంటే నీరజ్ చోప్రా పతకం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశారు.

అంతే కాకుండా, టోక్యో ఒలింపిక్స్ తరువాత నీరజ్ చోప్రా పావో నుర్మి గేమ్స్ (89.30 మీ), గ్వోర్టేన్ గేమ్స్ (86.69 మీ), డైమండ్ లీగ్ (89.94 మీ) పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు.

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌కు ముందు తన జాతీయ రికార్డులను తానే బద్దలు కొట్టాడు.

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

ఆట ఎలా సాగింది?

ఈ పోటీల్లో చివరి రౌండ్‌లో ఆటగాడికి 6 అవకాశాలు ఇస్తారు. మొదటి మూడు అవకాశాలు ముగిసే సమయానికి దిగువన ఉన్న నలుగురు ఆటగాళ్లు పోటీ నుంచి నిష్క్రమిస్తారు.

మొదటి మూడు రౌండ్ల తరువాత ఎనిమిది మంది ఆటగాళ్లు బరిలో ఉన్నారు. నీరజ్ సాధారణంగా మొదటి రెండు అవకాశాలలో తన సత్తా చాటుతాడు. కానీ ఈసారి మొదటి మూడు అవకాశాల్లో ఒకటి ఫౌల్ కాగా, తరువాతి రెండు వరుసగా 82.39 మీటర్లు, 86.37 మీటర్ల వద్ద విసిరాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మొదటి మూడు అవకాశాల తరువాత నీరజ్ పతకం చేజార్చుకున్నట్టే అనిపించింది.

మరో పక్క ఆండర్సన్ పీటర్స్ రెండో ప్రయత్నంలో 90.46 మీటర్ల దూరంలో విసిరి అగ్రస్థానంలో కొనసాగాడు.

నీరజ్ చోప్రా తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరంలో జావెలిన్ విసిరి మళ్లీ పతకంపై ఆశలు చిగురింపజేశాడు. అయిదవ అవకాశం కూడా ఫౌల్ అయింది. ఫౌల్స్ వల్ల స్వర్ణం సాధించే అవకాశం చేజార్చుకున్నాడు.

ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌

ఫొటో సోర్స్, Worldathletics.org

రోహిత్ యాదవ్ నిష్క్రమణ

మొదటి మూడు రౌండ్ల తరువాత, నీరజ్ చోప్రా నాల్గవ స్థానంలో, రోహిత్ యాదవ్ 10వ స్థానంలో ఉన్నారు.

నాలుగో రౌండ్ ముగిసేసరికి టాప్ 8లో ఆండర్సన్ పీటర్స్, నీరజ్ చోప్రా, జాకోబ్ వాట్లెడ్జ్, జూలియన్ వెబర్, అర్షద్ నదీమ్, లేజీ ఎడాల్డాలో, అడ్రియన్ మార్టర్, ఆలివర్ హెలాండర్ ఉన్నారు.

రోహిత్ యాదవ్ పోటీ నుంచి నిష్క్రమించాడు.

ఆండర్సన్ పీటర్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆండర్సన్ పీటర్స్

ఉత్కంఠగా సాగిన చివరి రౌండు

ఫైనల్స్ ప్రారంభంలో, నీరజ్ చోప్రా జావెలిన్‌ను 82.39 మీటర్లు విసిరాడు. మూడో రౌండ్‌లో అతను 86.37 మీటర్లకు విసిరాడు.

చివరి రౌండ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ ప్రారంభంలోనే 90.21 మీటర్ల జావెలిన్ త్రోతో ముందంజ వేశాడు. ఆండర్సన్ 2019 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్‌లో 86.69 మీటర్ల త్రోతో స్వర్ణం సాధించాడు. ఈ సీజన్‌లో అతను మూడుసార్లు 90 మీటర్లకు పైగా విసిరాడు.

మొదటి ఈవెంట్‌లో 85.52 మీటర్లతో ఆట ప్రారంభించిన చెక్ రిపబ్లికన్ జాకబ్ వడ్లెక్, మూడో ఈవెంట్‌కు వచ్చేసరికి నీరజ్ చోప్రా కంటే 88 మీటర్లకు పైగా ఆధిక్యంలో ఉన్నాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో రజత పతకంతో నీరజ్ పక్కన నిలబడిన వడ్లెక్ ఈ సీజన్‌లో జావెలిన్‌ను 90.88 మీటర్ల వరకు విసిరాడు. జర్మనీకి చెందిన జూలియన్ వీబర్ కూడా ప్రారంభంలో 86.86 మీటర్లకు జావెలిన్ విసిరాడు.

ఇలా తొలి మూడు అవకాశాల్లో నీరజ్ చోప్రాకు ఆండర్సన్, వెబర్, వడ్లెక్ పెద్ద సవాలు విసిరారు. అయితే నాలుగో ఇన్నింగ్స్‌లో ఆ సవాళ్లను అధిగమించిన నీరజ్ రజత పతకంపై ఆశలు చిగురింపజేశాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించేందుకు 87.58 మీటర్లు పరుగెత్తితే సరిపోతుంది. కానీ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ సిరీస్ దానికంటే చాలా కఠినమైనది.

అయిదవ రౌండ్‌లో నీరజ్ ఆట మళ్లీ ఫౌల్ అయింది. దాంతో, స్వర్ణం చేజార్చుకున్నాడు.

ఆరవ రౌండ్‌లో నీరజ్ చోప్రా 88.13 మీ. దూరం విసిరి రజత పతకం గెలుచుకున్నాడు.

ఆరు రౌండ్లు ముగిసేసరికి ఆండర్సన్ స్వర్ణ పతకాన్ని, నీరజ్ చోప్రా రజత పతకాన్ని, జాకబ్ వడ్లెక్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.

నీరజ్ చోప్రా దాదాపు 20 ఏళ్ల భారతీయుల ఆకాంక్షను తీర్చాడు.

నీరజ్ చోప్రా

ఫొటో సోర్స్, Getty Images

వరుసగా రెండేళ్లల్లో రెండు ప్రతిష్టాత్మక పతకాలు

భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకున్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో రజతం గెలుచుకుని అంతర్జాతీయ పతకాల పరంపర కొనసాగిస్తున్నాడు.

ఒక అథ్లెట్‌గా రాణించాలంటే శారీరక ధృఢత్వం చాలా అవసరం. అన్ని విధాలా ఫిట్‌గా ఉన్నవారు మాత్రమే అథ్లెట్‌గా విజయాలు సాధించగలరు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

పీటీ ఉష, అంజూ బాబీ జార్జ్, మిల్ఖా సింగ్ వంటి కొద్ది మంది భారతీయులు మాత్రమే అథ్లెటిక్స్‌లో ప్రపంచ స్థాయి విజయాలు సాధించారు. ఈ ముగ్గురూ కొద్ది పాటి తేడాతో ఒలింపిక్ పతకాలకు దూరమయ్యారు. ఆ వెలితిని నీరజ్ చోప్రా భర్తీ చేశాడు.

టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ జావెలిన్‌ను 87.58 మీటర్ల దూరం విసిరి స్వర్ణ పతకాన్ని గెల్చుకున్నాడు. ఈ పోటీల్లో మొదటి ప్రయత్నంలో నీరజ్ జావెలిన్‌ను 87.03 మీటర్లకు విసిరాడు. రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లకు విసిరాడు.

రెండో స్థానంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన వడ్లెక్ నిలిచాడు. వడ్లెక్ గరిష్ఠంగా 86.67 మీటర్లకు జావెలిన్‌ను విసిరాడు.

అంజూ బాబీ జార్జ్ తరువాత ప్రపంచ స్థాయి అథ్లెటిక్ పోటీల్లో స్వర్ణం గెలుచుకున్న భారతీయ అథ్లెట్ నీరజ్ ఒక్కడే.

ఇప్పుడు ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో కూడా అంజూ బాబీ జార్జ్ అడుగుల్లోనే నడుస్తూ నీరజ్ చోప్రా భారత్‌కు పతకం సాధించాడు.

వీడియో క్యాప్షన్, BBC ISWOTY: జీవన సాఫల్య పురస్కారానికి ఎంపికైన అంజు బాబి జార్జ్ ప్రస్థానమిదీ...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)