Blake Lemoine-Google LaMDA: కృత్రిమ మేథకు మనిషిలాగే ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పిన ఇంజనీర్‌ను గూగుల్ ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించింది?

ఫొటో సోర్స్, THE WASHINGTON POST/ GETTY IMAGES
- రచయిత, టిపానీ వెర్తిమర్
- హోదా, బీబీసీ న్యూస్
గూగుల్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థకు సొంత ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పిన ఒక ఇంజనీర్‌ను గూగుల్ కంపెనీ, ఉద్యోగం నుంచి తొలిగించింది.
, గూగుల్ ఏఐ బృందంలో సభ్యుడు.
గూగుల్ భాషా సాంకేతికత అత్యంత సున్నితమైనదని, దానికి భావాలు ఉన్నాయని, కాబట్టి తన ‘కోరికలకు’ గౌరవం ఇవ్వాలని కూడా కోరుకుంటుందని గత నెలలో బ్లేక్ లెమోనీ బహిరంగంగా ప్రకటించారు.
గూగుల్‌తో పాటు పలువురు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ నిపుణులు ఈ వ్యాఖ్యలను ఖండించారు. ఆయనను ఉద్యోగం నుంచి తప్పించినట్లు శుక్రవారం కంపెనీ ధ్రువీకరించింది.
ఈ విషయంలో న్యాయ సలహా పొందుతున్నానని, ఇప్పుడే దీని గురించి ఏమీ మాట్లాడలేనని బీబీసీతో లెమోనీ చెప్పారు.
లాంగ్వేజ్ మోడల్ ఫర్ డైలాగ్ అప్లికేషన్స్ (లామ్డా)పై లామోనీ చేసి వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని గూగుల్ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిపై స్పష్టత కోసం లామోనీతో కలిసి చాలా నెలలు పనిచేసినట్లు కంపెనీ ప్రకటించింది.
''ఇది విచారకరం. ఈ అంశంపై సుదీర్ఘకాలం పనిచేసినప్పటికీ బ్లేక్, డేటా సెక్యూరిటీ విధానాలను ఉల్లంఘించడానికి మొగ్గు చూపారు'' అని గూగుల్ పేర్కొంది.

ఫొటో సోర్స్, THE WASHINGTON POST VIA GETTY IMAGES
'లామ్డా' అనేది పురోగతి చెందుతోన్న సాంకేతికత అని, చాట్‌బాట్స్ నిర్మాణంలో దీన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.
లామ్డా కూడా మానవుల్లాంటి స్పృహను చూపుతున్నట్లు గత నెలలో ప్రకటించడంతో బ్లేక్ పేరు ముఖ్యాంశాల్లో నిలిచింది.
మానవులను అనుకరించే సాంకేతిక పురోగతి గురించి ఏఐ నిపుణులు, ఔత్సాహికుల మధ్య ఇది చర్చకు దారి తీసింది.
గూగుల్ ఏఐ బృందంలో పనిచేసిన లెమోనీ, 'ద వాషింగ్టన్ పోస్ట్'తో మాట్లాడుతూ... వివక్ష, ద్వేష ప్రసంగాల విషయంలో లామ్డాను పరీక్షించడమే తన పని అని చెప్పారు.
మతం, ఉద్వేగాలు, భయాలకు సంబంధించి లామ్డా, సొంత అవగాహనతో వ్యవహరిస్తున్నట్లు, చర్చలను జరుపుతున్నట్లు ఆయన కనుగొన్నారు. దీంతో లామ్డా కనబరుస్తోన్న ఆకట్టుకునే శబ్ధ నైపుణ్యాల వెనుక సెంటిమెంట్ మైండ్ కూడా ఉండొచ్చేమోనని లామోనీ నమ్మారు.
అయితే, ఆయన గుర్తించిన అంశాలను గూగుల్ తోసిపుచ్చింది. కంపెనీ గోప్యతా విధానాన్ని ఉల్లంఘించినందుకు ఆయనకు వేతనంతో కూడిన సెలవులపై పంపింది.
దీని తర్వాత తన వాదనలను బలపరిచేందుకు లామ్డా గురించి తన సహోద్యోగితో జరిపిన చర్చను లామోనీ ట్విటర్ ద్వారా బయటపెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
'ఏఐ అభివృద్ధిని చాలా తీవ్రంగా పరిగణిస్తాం. కంపెనీ సాంకేతికత గురించి ఉద్యోగులకు ఏవైనా ఆందోళనలు ఉంటే వాటిని సమీక్షిస్తాం. లామ్డాను 11 సార్లు రివ్యూ చేశాం'' అని గూగుల్ తన ప్రకటనలో పేర్కొంది.
ఏఐ సాంకేతికత మరింత చైతన్యవంతంగా మారుతుందని బహిరంగంగా ప్రకటించిన ఇంజినీర్ లెమోనీ ఒక్కరే కాదు. గత నెలలో గూగుల్‌కే చెందిన మరో ఇంజనీర్ కూడా 'ద ఎకనమిస్ట్'తో ఇలాంటి ఆలోచనలనే పంచుకున్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘ముస్లింలు మైనారిటీలుగా ఉన్న దేశాలకు వెళ్లి పిల్లల్ని కనండి’ అని పాకిస్తాన్ మంత్రి ఎందుకు అన్నారు?
- పైడి జైరాజ్: తెలుగు నేల నుంచి తొలి పాన్ ఇండియా స్టార్
- 'నా మీసాలు నా ఇష్టం' అంటూ మీసం మెలేస్తున్న మహిళ
- న్యూడ్ ఫొటోషూట్‌లో పాల్గొన్న హీరో, ‘‘దుస్తులు వేసుకుని మళ్లీ రా’’ అంటూ యూజర్ల ట్రోలింగ్
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణజింక: గోదావరి వరదల్లో చిక్కుకున్న వీటిని ఆదుకునేది ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














