టోక్యో ఒలింపిక్స్: కుస్తీలో కాంస్య పతకం గెలిచిన బజ్‌రంగ్ పూనియా

బజ్‌రంగ్ పూనియా

ఫొటో సోర్స్, @himantabiswa

ఫొటో క్యాప్షన్, బజ్‌రంగ్ పూనియా

రెజ్లర్ బజ్‌రంగ్ పూనియా భారత్‌కు మరో కాంస్య పతకాన్ని తెచ్చిపెట్టారు.

65 కేజీల పురుషుల ఫ్రీ స్టైల్ విభాగంలో కజఖ్‌స్తాన్‌కు చెందిన నియాజ్‌బెకోవ్‌ను పూనియా ఓడించారు.

నియాజ్‌బెకోవ్‌పై 8-0 తేడాతో పూనియా విజయం సాధించారు. మ్యాచ్ మొత్తంపై పూనియా ఆధిపత్యం కొనసాగింది.

మహిళల గోల్ఫ్‌లో అదితి అశోక్‌‌కు నాలుగో స్థానం, చేజారిన పతకం

అదితి అశోక్

ఫొటో సోర్స్, KAZUHIRO NOGI/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, అదితి అశోక్

టోక్యో ఒలింపిక్స్‌ మహిళల గోల్ఫ్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చినప్పటికీ భారత ప్లేయర్ అదితి అశోక్ పతకం సాధించలేకపోయారు.

చివరి రౌండ్‌లో ఆమె నాలుగో స్థానంలో నిలిచారు. పతకం రేసులో అవుట్ అయ్యారు.

అదితి మొదటి నుంచీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతూ వచ్చారు. ఆమె పతకం సాధిస్తారని అందరూ ఆశించారు.

అయితే చివరికి వచ్చేసరికి ఆమె సంయుక్తంగా మూడు, తర్వాత నాలుగో స్థానానికి పడిపోయారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

నిశ్శబ్దంగా పతకానికి చేరువ

భారత అభిమానులందరూ మన హాకీ టీమ్స్, కుస్తీ క్రీడాకారులు పతకాలు తెస్తారో లేదో అనే ఆందోళనలో ఉన్న సమయంలో అదితి అశోక్ మాత్రం ఆ అంచనాలన్నింటికీ దూరంగా నిశ్శబ్దంగా పతకానికి చేరువయ్యారు.

టోక్యోలో శనివారం ఉదయం మహిళల వ్యక్తగత గోల్ఫ్ నాలుగో రౌండ్ ప్రారభమైంది. వర్షం వల్ల ఫైనల్ రౌండ్ కాసేపు ఆగింది. ఆట ఆగే సమయానికి భారత్‌కు చెందిన అదితి అశోక్ మూడో స్థానంలో సంయుక్తంగా కొనసాగుతున్నారు. కానీ, చివరి రౌండుకు వచ్చేసరికి ఆమెకు నిరాశ ఎదురైంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అదితి గోల్ఫ్‌లో పతకం సాధిస్తే అది బహుశా భారత ఒలింపిక్ టీమ్ అధికారులు కూడా ఊహించని విజయం అవుతుంది. భారత అభిమానులను ఆనందంలో ముంచెత్తుతుంది.

ఈ పోటీల్లో అమెరికాకు చెందిన గోల్ఫర్ నెల్లి కోర్డా మొదటి స్థానంలో ఉన్నారు.

అదితి అశోక్

ఫొటో సోర్స్, BRENDAN MORAN

అసాధారణ ప్రదర్శన

సోషల్ మీడియాలో చాలా మంది ఇప్పటికే అదితి అశోక్ అద్భుత ప్రదర్శనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆమెకు దేశమంతా అండగా నిలవాలని కూడా కోరుకుతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

"ఆమె మెల్లమెల్లగా ఉత్సాహం తీసుకొచ్చే ఒక అసాధారణ, ప్రశంసనీయమైన ప్లేయర్‌గా మారుతున్నారు. ప్రపంచంలో 179వ ర్యాంకింగ్‌లో ఉన్న అదితి అశోక్ ఒలింపిక్స్‌లో రెండో స్థానంలో ఉన్నారు" అని స్పోర్ట్స్ రైటర్ జొనాథన సెల్వరాజ్ అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

భారత మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ కూడా నాలుగో రౌండ్‌లో కూడా అదితి ఏం కోరుకుందో అదే జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

తమకు గోల్ఫ్ అర్థం కాదని, కానీ అదితి పతకం వైపు దూసుకుపోవడంపై సంతోషంగా ఉందని చాలా మంది నెటిజన్లు చెబుతున్నారు. ఆమె ఆట చూసి ఆనందపడిపోతున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

అదితి కచ్చితంగా భారత్‌కు మరో పతకం అందిస్తారని సోషల్ మీడియాలో చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

అదితి అశోక్

ఫొటో సోర్స్, ICON SPORTSWIRE

అదితి కెరియర్

అదితి అశోక్ 1998 మార్చి 29న బెంగళూరులో జన్మించారు. ఆమె ఐదేళ్ల వయసులోనే గోల్ఫ్ ఆడడం ప్రారంభించారు.

అప్పట్లో బెంగళూరులో మూడు గోల్ఫ్ కోర్సులు ఉండేవి. కానీ అదితి తండ్రి ఆమెకు అండగా నిలిచారు. గోల్ఫ్ ట్రైనింగ్ ఇప్పించడం ప్రారంభించారు.

అదితి 2016 ఒలింపిక్స్‌లో కూడా పాల్గొన్నారు. అప్పుడు ఆమెకు 18 ఏళ్లు కావడంతో ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులందరిలోకీ చిన్నవారుగా నిలిచారు. అయితే ఆ ఒలింపిక్స్‌లో ఆమె తన ప్రత్యేకత చూపించలేకపోయారు.

అది కాకుండా అదితి ఏషియన్ యూత్ గేమ్స్(2013), యూత్ ఒలింపిక్ గేమ్స్(2014)లో పాల్గొన్న మొదటి భారత మహిళా గోల్ఫర్‌ కూడా అయ్యారు.

ఆమె చిన్న వయసులోనే లల్లా ఐయిచా టూర్ స్కూల్ టైటిల్ కూడా గెలిచిన ఇండియన్‌గా రికార్డ్ కూడా సాధించారు.

ఆ విజయంతో ఆమెకు 2016 సీజన్ కోసం లేడీస్ యూరోపియన్ టూర్ కార్డ్ కోసం ఎంట్రీ లభించింది.

2017లో ఆమె మొట్టమొదటి మహిళా ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్(ఎల్పీజీఏ) ప్లేయర్ అయ్యారు.

Please wait...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)