అమేఠీలో రాహుల్ గాంధీ వెనుకంజ.. ఆధిక్యంలో స్మృతీ ఇరానీ

ఫొటో సోర్స్, AFP
గత యాభై రెండేళ్ల చరిత్రలో 1998-99 మధ్య దాదాపు ఏడాది సమయాన్ని మినహాయిస్తే, ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీ లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్ పార్టీదే ఏకఛత్రాధిపత్యమని చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి అది గాంధీ కుటుంబానికి పెట్టని కోటగా నిలిచింది.
సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ... ఇలా గాంధీ వంశంలోని రెండు తరాలకు చెందిన నలుగురు ప్రతినిధులు లోక్‌సభలో అమేఠీకి ప్రాతినిధ్యం వహించారు.
అయితే తాజా ఓట్ల లెక్కింపు లెక్కల ప్రకారం రాహుల్ గాంధీ అమేఠీ స్థానంలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీకన్నా దాదాపు 9 వేల ఓట్లతో వెనుకబడి ఉన్నారు.
2004 నుంచి రాహుల్ గాంధీ వరుసగా ఇక్కడి నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో ఈ స్థానం నుంచి ఆయనపై స్మృతి ఇరానీని అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా బీజేపీ ఈ పోటీని ఆసక్తికరంగా మార్చింది.
అప్పుడు రాహుల్ ఆమెను 1,07,903 ఓట్ల భారీ తేడాతో ఓడించారు. అయితే బీజేపీ ఈసారి ఎన్నికల్లోనూ స్మృతినే అభ్యర్థిగా బరిలోకి దించింది.

ఫొటో సోర్స్, FB/Rahul Gandhi
ఈ స్థానాన్ని ఎలాగైనా కాంగ్రెస్ చేతుల్లోంచి, ముఖ్యంగా గాంధీ కుటుంబం పట్టులోంచి తప్పించాలనే వ్యూహంతో బీజేపీ పావులు కదిపింది. ఎన్నికల ప్రకటన వెలువడడానికి ముందు వరాల జల్లులు కురిపించింది.
ఏకే-203 రకం అసాల్ట్ రైఫిళ్లు తయారు చేసే కర్మాగారానికి ప్రధాని మోదీ మార్చి నెలలో పునాది రాయి వేశారు. ఇవన్నీ అమేఠీని తమ పట్టులోకి తెచ్చుకునేందుకు బీజేపీ పన్నిన వ్యూహంలో భాగమని చెప్పొచ్చు.
మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీల మహాకూటమి ఈ స్థానం నుంచి ఎవరినీ పోటీలో దించకపోవడం ద్వారా కాంగ్రెస్‌కు పరోక్షంగా మద్దతు ప్రకటించింది.
ఎన్నికలు మరో నాలుగు నెలలున్నాయనగా, జనవరి 23న ప్రియాంక గాంధీని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ, ఆమెకు పశ్చిమ ఉత్తరప్రదేశ్ బాధ్యతలు అప్పగించారు. ఆమెను తెర ముందుకు తేవడం ద్వారా 80 స్థానాలున్న యూపీలో కాంగ్రెస్ తన పరిస్థితిని మెరుగుపర్చుకోగలుగుతుందని ఆశించారు.
అయితే, స్మృతి ఇరానీ ఈ ఆధిక్యాన్ని ఇలాగే నిలబెట్టుకొంటూ విజయ కేతనం ఎగరేస్తారా? లేదా లెక్కింపు పూర్తయ్యే లోగా రాహుల్ గెలుపు కోసం కావాల్సిన ఓట్లు సాధించగలుగుతారా? అనేది చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి:
- LIVE: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు: 295 స్థానాల్లో బీజేపీ, 52 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజ
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: చంద్రబాబు, జగన్, పవన్.... గెలిచేదెవరు?
- LIVE: ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు: ఏ నియోజకవర్గంలో ఎవరు ఆధిక్యంలో ఉన్నారు?
- LIVE: జగన్కు కేసీఆర్ అభినందనలు... రెండు రాష్ట్రాల సంబంధాలు మెరుగవుతాయని ఆకాంక్ష
- LIVE: నిజామాబాద్లో 65వేల ఓట్ల ఆధిక్యంలో బీజేపీ, ఏపీలో 23 చోట్ల వైసీపీ ముందంజ : ఏపీ, తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలు
- ‘పవర్’ స్టార్ ఆశలు గల్లంతు.. ఇంతకీ పవన్ కల్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారా లేదా?
- ‘జగన్కు ఉన్న ప్రజాదరణ అప్పట్లో ఎన్టీఆర్కు మాత్రమే ఉండేది’
- నారా చంద్రబాబు నాయుడు: రాజకీయ చాతుర్యం, పరిపాలనా దక్షత వయసు రీత్యా బలహీనపడ్డాయా?
- వైఎస్ జగన్మోహన్ రెడ్డి: ఎవరినైనా ఎదిరించి నిలబడే తత్వం, కొత్తతరం నాయకుల ప్రతినిధి
- ఆంధ్రప్రదేశ్ మంత్రుల్లో ఓడిపోతున్నదెవరు.. గెలిచేదెవరు?
- వైసీపీ జోరు.. టీడీపీలో లోకేశ్ సహా మంత్రులు సైతం వెనుకంజ.. పవన్ సహా జనసేన అభ్యర్థులు డీలా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








