ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్నికల ఫలితాలు: మీ నియోజకవర్గ కొత్త ఎంపీ ఎవరో తెలుసుకోండి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ఏపీలో టీడీపీ 15 స్థానాల నుంచి మూడు స్థానాలకు పడిపోయింది.
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 17 స్థానాల్లో పోటీ చేసి 11 చోట్ల గెలుపొందింది. బీజేపీ ఒక్క సికింద్రాబాద్ స్థానం నుంచే విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం హైదరాబాద్ స్థానంలో గెలుపొందింది.
గతంతో పోల్చితే ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ రెండు స్థానాలను కోల్పోయింది. బీజేపీ అనూహ్యంగా పుంజుకొని నాలుగు చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో గెలుపొందింది. ఎంఐఎం తన హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంది.
టీఆర్ఎస్ పార్టీ 41.29 శాతం ఓట్లను సాధిస్తే బీజేపీ 19.45 శాతం ఓట్లను, కాంగ్రెస్ 29.48 శాతం ఓట్లను సాధించింది.
ఆంధ్రప్రదేశ్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి 2014లో టీడీపీ 15 చోట్ల విజయం సాధించగా, వైసీపీ 8 చోట్ల గెలుపొందింది. ఈసారి ఎన్నికల్లో 22 స్థానాల్లో వైసీపీ విజయం సాధించగా, టీడీపీ మూడు స్థానలతో సరిపెట్టుకుంది.
తెలంగాణలో పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు...
ఏపీలో పార్లమెంట్ స్థానాల్లో గెలిచిన అభ్యర్థులు
మధ్యాహ్నం 3.17
నిజామాబాద్‌లో 6వ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 53 వేల ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. వరంగల్ పార్లమెంట్‌లో 12వ రౌండ్ పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 2,27,617 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఫొటో సోర్స్, TWITTER/KAVITHA KALVAKUNTLA
మధ్యాహ్నం 1.32
మహబూబాబాద్‌లో 13 రౌండ్లు ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి మాలోతు కవిత 1 లక్ష 18 వేల ఆధిక్యంలో ఉన్నారు. నాగర్‌కర్నూల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి పి.రాములు 15,4397 ఓట్లు ఆధిక్యంంలో కొనసాగుతున్నారు.
ఖమ్మం పార్లమెంట్ 19వ రౌండు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు 1,07,343 ఓట్లు పైగా ఆధిక్యంలో ఉన్నారు.
మెదక్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి 3,01834 ఓట్ల ఆధిక్యంతో ముందంజలో ఉన్నారు.
మధ్యాహ్నం 12.30
మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి 34143 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో బీజేపి అభ్యర్థి డికె అరుణ ఉన్నారు. నిజామాబాద్‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి సంజయ్ 43 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానంలో 10వ రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి పోతుగంటి రాములు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఖమ్మంలో 14వ రౌండు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు 69,444 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
నిజామాబాద్‌లో రెండో రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ 35634 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఏపీలో 23 చోట్ల వైసీపీ, 2 చోట్ల టీడీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
మధ్యాహ్నం 12.16
ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్ స్థానాల్లో 23 చోట్ల వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. విజయవాడ పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి మళ్లీ ఆధిక్యంలోకి వచ్చారు. శ్రీకాకుళంలో కింజరాపు రామ్మోహన్ నాయుడు 415 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
12వ రౌండు పూర్తయ్యేసరికి ఖమ్మంలో టిఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు 62,050 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 9వ రౌండ్ ముగిసేసరికి 55228 ఓట్ల మెజారిటీతో కరీంగనర్‌లో ముందంజలో బీజేపీ అభ్యర్థి సంజయ్, చేవెళ్ల లో 7500 ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కొనసాగుతున్నారు.
ఉదయం 11.50
ఆంధ్రప్రదేశ్‌లో 25 పార్లమెంట్ స్థానాల్లో 25 చోట్లా వైసీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్ల ముందంజలో ఉన్నారు. విజయవాడలో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని మొదట ఆధిక్యంలో ఉండగా ఇప్పుడు అక్కడా వైసీపీ ముందంజ వేసింది. ఆ పార్టీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) 227 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఫొటో సోర్స్, uttam/fb
ఉదయం 11.47
తెలంగాణలో 4 స్థానాల్లో బీజేపీ ముందంజ... ఆంధ్రప్రదేశ్‌లో ప్రభావం చూపని జనసేన
తెలంగాణలో నాలుగు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్‌లో ఆ పార్టీ ప్రభావం చూపిస్తోంది.
ఆదిలాబాద్‌లో బీజపీ అభ్యర్థి సోయం బాబురావు 32354 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం నగేశ్ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. నిజమాబాద్‌లో సిట్టింగ్ ఎంపీ, టీఆర్ఎస్ అభ్యర్థి కవిత వెనుకంజలో ఉన్నారు. ఇక్కడ బీజేపీ నుంచి తొలిసారి పోటీ చేస్తున్న ధర్మపురి అరవింద్ 12314 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
సికింద్రబాద్‌లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి 29746 ఓట్ల ఆధిక్యంతో, కరీంగనర్‌లో బండి సంజయ్ 47228 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
గత లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఒకే ఒక లోక్ సభ స్థానాన్ని బీజేపీ దక్కించుకుంది. సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన బండారు దత్తాత్రేయ ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు.
ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా బరిలోకి దిగిన జనసేన పార్టీ 25 పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడా ఆధిక్యంలో కనిపించడం లేదు. ఈ పార్టీ తరఫున విశాఖపట్నం నుంచి పోటీ చేసిన మాజీ సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ, నర్సాపురం నుంచి పోటీ చేసిన పవన్ సోదరుడు నాగబాబు వెనుకంజలో ఉన్నారు.
ఎనిమిదో రౌండ్ ముగిసేసరికి నల్గొండ పార్లమెంట్ పరిధిలో 12,969 ఓట్ల ఆధిక్యంతో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముందంజలో ఉన్నారు. కరీంగనర్‌లో బీజేపీ అభ్యథి సంజయ్ 51992 ఆధిక్యంలో ఉన్నారు. సికింద్రాబాద్ లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి 27008 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఉదయం 11.05
నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 12,221 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఉదయం 11.02
భువనగిరిలో టీఆర్‌ఎస్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ 1,382 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.
ఉదయం 10.57
కాకినాడ పార్లమెంటు స్థానం: వైసీపీ అభ్యర్థి వంగా గీత 15,401 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఉదయం 10.51
సికింద్రాబాద్‌లో బీజేపీ అభ్యర్థి జి.కిషన్ రెడ్డి 17,772 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
వచ్చిన ఓట్లు:
- అంజన్ కుమార్ యాదవ్ (కాంగ్రెస్) 17,741
- కిషన్ రెడ్డి (బీజేపీ) 50,979
- సాయి యాదవ్ (టీఆర్ఎస్) 33,207

ఫొటో సోర్స్, Revanth reddy/fb
ఉదయం 10.26
నిజామాబాద్‌లో తొలి రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ముందజంలో కొనసాగుతున్నారు. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత తర్వాత స్థానంలో ఉన్నారు. బీజేపీకి 18,280 ఓట్ల ఆధిక్యం ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 24 చోట్ల వైసీపీ ముందంజలో ఉంది. కేవలం ఒకే ఒక స్థానం (విజయవాడ)లో టీడీపీ ముందంజలో ఉంది.
విజయవాడ పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి కేశినేని నాని ముందంజలో ఉన్నారు. తర్వాత స్థానంలో వైసీపీ అభ్యర్థి పొట్టూరి వరప్రసాద్ ఉన్నారు. కేశినేని నాని 530 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఇక జనసేన నుంచి విశాఖ పార్లమెంట్‌కు పోటీ చేసిన లక్ష్మీనారాయణ వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి భరత్‌పై 1699 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగాబాబు నర్సాపురం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు ముందంజలో ఉన్నారు. ఆయన 1922 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఉదయం 10.03
తెలంగాణలోని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ కవిత వెనుకంజలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి ముందజంలో ఉన్నారు.
కరీంనగర్‌లోనూ బీజేపీ ఆధిక్యతలో ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 22260 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ - పొన్నం ప్రభాకర్ - 23776, టిఆర్ఎస్ - వినోద్ కుమార్ - 51104,బిజెపి- బండి సంజయ్ - 73364 ఓట్లు సాధించారు.
ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి సోయం బాబు రావు ముందంజలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 3వ రౌండ్ ముగిసేసరికి బీజేపీకి 35,713 ఓట్లు, టీఆర్ఎస్‌కు 22562 , కాంగ్రెస్‌కు 17559 ఓట్లు పడ్డాయి. బీజేపీ 13151 ఆధిక్యతతో ఉంది.
ఉదయం 9.50
విశాఖపట్నం: జనసేన అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ 416 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

ఉదయం 9.38
ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం: మొదటి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు.
పోలైన ఓట్లు
- టీఆర్ఎస్- 4,918
- బీజేపీ- 4818
- కాంగ్రెస్- 4247
ఉదయం 9.28
ఆంధ్రప్రదేశ్: వైసీపీ 9 స్థానాల్లో, టీడీపీ 4 స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
ఉదయం 9.23
తెలంగాణ: టీఆర్‌ఎస్ 11, బీజేపీ 3, కాంగ్రెస్ 1, ఎంఐఎం 1 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి.
కరీంనగర్, ఆదిలాబాద్‌లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.
ఉదయం 9.22
ఆంధ్రప్రదేశ్: వైసీపీ 6 స్థానాల్లో, టీడీపీ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది.
ఉదయం 9.20
విశాఖ పార్లమెంట్ స్థానంలో టీడీపీ అభ్యర్థి భరత్ 2015 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఉదయం 9.15
కరీంనగర్: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బీజేపీ ముందంజలో నిలిచింది. బీజేపీకి 3,062 ఓట్లు, టీఆర్‌ఎస్‌కు 2,939, కాంగ్రెస్2కు 2,881 ఓట్లు వచ్చాయి.
ఉదయం 9.13
వైసీపీ 4 స్థానాల్లో, టీడీపీ ఒక స్థానంలో ముందజలో ఉన్నాయి.
ఉదయం 9.10
టీఆర్‌ఎస్ 9 స్థానాల్లో ముందంజలో ఉంది. ఎంఐఎం ఒక స్థానంలో, కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.
ఉదయం 9.05
మచిలీపట్నం:599 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి.
ఉదయం 9.00
జహీరాబాద్, మెదక్ ఎంపీ స్థానాల్లో పోస్టల్, సర్వీస్ ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థుల ముందంజ.
అనంతపురం:
పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య ముందంజ. వైసీపీకి 341 ఓట్లు, టీడీపీకి 168 ఓట్లు.
ఉదయం 8.50
ఖమ్మం:
తొలి రౌండ్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర రావు 3,159 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
నామా నాగేశ్వరావుకు (టీఆర్ఎస్) - 5,606 ఓట్లు, రేణుకా చౌదరికి (కాంగ్రెస్) - 2,447 ఓట్లు.
ఉదయం 8.47
విశాఖ:
పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపులో టీడీపీ అభ్యర్థి భరత్ ఆధిక్యంలో నిలిచారు.
ఉదయం 8.45
సికింద్రాబాద్:
పోస్టల్ బ్యాలెట్స్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ యాదవ్ 1,086 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
ఉదయం 8.30
వరంగల్‌లో టీఆర్‌ఎస్ ఆధిక్యం:
వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంమైంది. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఆధిక్యంలో ఉన్నారు.
ఉదయం 8.00
ఆంధ్రప్రదేశ్‌లోని 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ స్థానాలకు, తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు తొలి దశ (ఏప్రిల్ 11) లో ఎన్నికలు జరిగాయి.
తెలంగాణలో 62.53 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 79.88 శాతం పోలింగ్ నమోదైంది.
ఈసారి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నియోజకవర్గాల్లో తెలంగాణలోని నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఒకటి. ఈ నియోజవర్గం నుంచి 185 మంది బరిలో నిలిచారు. దీంతో దేశవ్యాప్తంగా అత్యధికమంది అభ్యర్థులు పోటీ పడిన నియోజకవర్గంగా నిజామాబాద్ నిలిచింది.
ఈ నియోజకవర్గ ఫలితం రాత్రి 10.30 గంటల తర్వాత వెలువడొచ్చని అధికారులు చెబుతున్నారు.
ఏ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు? దీనికి సంబంధించిన తాజా సమాచారం ఈ పేజీలో అప్‌డేట్ అవుతుంది గమనించగలరు.
ఆంధ్రప్రదేశ్‌లో పార్లమెంట్‌కు పోటీ చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణలోని పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసిన ప్రధాన పార్టీ అభ్యర్థులు వీరే...
ఇవి కూడా చదవండి
- LIVE: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: కౌంటింగ్ ప్రారంభం.. చంద్రబాబు, జగన్, పవన్.... గెలిచేదెవరు?
- గాంధీ హత్యకు పది రోజుల ముందు గాడ్సే, ఆప్టే ఏం చేశారు...
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
- స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలకు భద్రత ఎంత...
- 'పదో తరగతిలో 60 శాతం మార్కులు... మా బాబు బంగారం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








