రెండు దేశాలు తప్ప ఏ దేశ జాతీయ జెండాలోనూ కనిపించని రంగు ఏంటి? అది ఎందుకు కనిపించదు?

ఫొటో సోర్స్, iStock
ప్రపంచంలోని ప్రతి దేశానికీ ఓ జెండా ఉంటుంది. ఆ జెండాలో ఎన్నో రంగులుంటాయి. కానీ రెండు దేశాల జెండాలు మినహా మరే దేశ జెండాలోనూ లేని రంగు ఒకటుంది. ఆ రంగే పర్పుల్ లేదా ఊదా రంగు (ఎరుపు, నీలం కలగలిసిన రంగు).
మరి మిగతా దేశాల జాతీయ జెండాల్లో ఈ రంగు ఎందుకు లేదు? ప్రజలకు పర్పుల్ కలర్ నచ్చదా?
అలా ఏమీ కాదు. చాలాకాలం పాటు పర్పుల్ రంగు అందరికీ అందుబాటులో లేదు. దాని ఖరీదు చాలా ఎక్కువ.
కార్ల ప్రపంచంలో రోల్స్ రాయిస్ కారుకు ఎంత ప్రాధాన్యం, ఖరీదు ఉంటుందో.. రంగుల ప్రపంచంలో పర్పుల్ కలర్ కూడా అంతే. సముద్రపు చిప్పల్లోని జిగురు లాంటి ప్రదార్థం నుంచి కొద్ది మొత్తంలో దీన్ని సేకరించేవారు. ఈ పర్పుల్ కలర్‌ను రోమన్లు తమ హోదాకు గుర్తుగా మార్చుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images

ఈ రంగును తక్కువ ఖర్చుతో తయారు చేయటాన్ని 1856లో ప్రారంభించారు. బ్రిటన్‌కు చెందిన కెమిస్ట్ విలియమ్ హెన్రీ పెర్కిన్ ఈ రంగు ఫార్ములాను కనిపెట్టారు. అప్పటి నుంచి పర్పుల్ రంగు అందరికీ అందుబాటులోకి వచ్చింది.
ఇంతకూ జాతీయ జెండాలో పర్పుల్ కలర్ కనిపించే ఆ రెండు దేశాలు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
కరీబియన్ దీవుల్లోని డొమినికా దేశ జాతీయ జెండాలో ఒక చిలుక బొమ్మ ఉంటుంది. ఆ చిలుక తల, శరీరం రంగు పర్పుల్ కలర్‌లో కనిపిస్తుంది.

ఫొటో సోర్స్, iStock
అలాగే పసిఫిక్ మహా సముద్రం, కరేబియన్ సముద్రం మధ్యలో ఉన్న సెంట్రల్ అమెరికన్ దేశం నికరాగువా జాతీయ జెండాలో కూడా కొంత పర్పుల్ రంగు కనిపిస్తుంది. ఒక్క చూపులోనే కనిపించకపోతే కొంచెం పరిశీలనగా చూడాల్సిందే. జెండాలోని ఇంద్రధనుస్సు రంగుల్లో ఒక రంగు పర్పుల్.. జాగ్రత్తగా చూడండి.
ఇవి కూడా చదవండి:
- పింగళి వెంకయ్య జెండాలోని ఎరుపును కాషాయంగా ఎందుకు మార్చారు
- కామన్వెల్త్ క్రీడలు: భారతీయ యువతి చేతిలో ఆస్ట్రేలియా జెండా ఎందుకుంది?
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- చరిత్ర: మొదటి ప్రపంచ యుద్ధానికి వందేళ్లు. ఆ యుద్ధంలో భారత సైనికుల త్యాగాలు తెలుసా
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: బహుశా.. ఈ తరానికి పెద్దగా తెలియని చరిత్ర ఇది
- రవీంద్రనాథ్ ఠాగూర్: ‘జాతీయవాదం ప్రమాదకారి. భారతదేశ సమస్యలకు అదే మూలం’
- ఇచట పౌరసత్వం, పాస్‌పోర్టులు అమ్మబడును
- రోజ్ గోల్డ్: ఫ్యాషన్ ప్రపంచాన్ని ఊపేస్తున్న కొత్త రంగు
- పాస్‌పోర్టు రంగు మార్చాలనుకోవడం వివక్ష అవుతుందా!
- #BBCSpecial : ఊసరవెల్లి రంగులు ఎందుకు.. ఎలా మారుస్తుందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









