బ్రిటన్: ఇప్పటి వరకు 27 మంది మంత్రులు, సహాయకులు రాజీనామా

ఫొటో సోర్స్, PA Media
బ్రిటన్ ప్రభుత్వంలో మంత్రుల రాజీనామా పరంపర కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 27 మంది మంత్రులు, వారి సహాయకులు రాజీనామాలు చేశారు. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి అల్లుడు, బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌తోపాటు ఆరోగ్య మంత్రి సాజిద్ జావిద్‌ల రాజీనామాలతో ఇది మొదలైంది.
ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నాయకత్వంపై తాము నమ్మకం కోల్పోయామని రిషి సునాక్ అన్నారు. బోరిస్ జాన్సన్ వెంటనే రాజీనామా చేయాలని పలువురు మంత్రులు డిమాండ్ చేస్తున్నారు.
అయితే తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. మాజీ డిప్యూటీ చీఫ్ విప్ క్రిస్ పించర్ మీద వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను డీల్ చేయడంలో బోరిస్ తీరుపై ఎంపీలు కోపంగా ఉన్నారు.
ప్రభుత్వం సక్రమంగా, సమర్థంగా పని చేయాలని ప్రజలు ఆశించారని, కానీ అది జరగలేదని సునాక్ అన్నారు. ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పని చేయడం లేదని జావిద్ ఆరోపించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
చాన్స్‌లర్ రిషి రాజీనామా చేసిన పది నిమిషాలకే జావిద్ మంత్రివర్గం నుంచి వైదొలిగారు. దీంతో, బోరిస్ 'పని అయిపోయింది' అని రాజకీయ విమర్శకులు వ్యాఖ్యానించారు. బోరిస్ నాయకత్వంలోని పార్టీ అవినీతిమయంగా మారిందనే విమర్శలు వినిపించాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
కానీ, బోరిస్ జాన్సన్ మాత్రం తన ప్రభుత్వాన్ని కొనసాగించే ప్రణాళికతో ఉన్నానని అన్నారు. తాజా పరిణామాలతో ఆయన వెంటనే తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించే పనిలో పడ్డారు.
అధికారిక బాధ్యతలను ఎంపీ క్రిస్ పించర్‌కు ఇచ్చినందుకు బోరిస్ జాన్సన్ క్షమాపణలు తెలిపారు. ప్రస్తుతం బ్రిటన్ విద్యా మంత్రి నదీమ్ ఝావీకి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించారు. అలాగే, సాజిద్ జావిద్ స్థానంలో స్టీవ్ బార్స్‌లే బాధ్యతలు నిర్వర్తిస్తారు. దీనికితోడు, ఉన్నత విద్యాశాఖ మంత్రి మిచెల్లె డోనెలాన్‌కు విద్యామంత్రిగా పదోన్నతి కల్పించారు.

ఫొటో సోర్స్, Getty Images
బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్సన్ మాట్లాడుతూ పొరపాటు జరిగిందని అన్నారు. తన నిర్ణయంతో నష్టపోయిన వారికి క్షమాపణలు తెలియజేస్తున్నానని చెప్పారు.
బోరిస్ జాన్సన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని విపక్షాలతో పాటు ఆయన సొంత పార్టీ నేతలు కూడా విమర్శిస్తున్నారు.
రిషి సునాక్, జావిద్‌లతో పాటు కన్జర్వేటివ్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి బిమ్ అఫోలామీ, ట్రేడ్ అంబాసిడర్ పదవికి ఆండ్రూ మోరిసన్‌లు రాజీనామా చేశారు.
వారి మంత్రిత్వ సహచరులు జొనాథన్ గులిస్, సకీబ్ భటి కూడా తమ పదవులు వదులుకున్నారు. అయితే, బీబీసీకి అందిన సమాచారం ప్రకారం విదేశాంగ మంత్రి లిజ్ ట్రస్, మంత్రి మైఖేల్ గావ్‌తో పాటు ఇతర క్యాబినెట్ మంత్రులు బోరిస్ జాన్సన్‌కు మద్దతు ఇచ్చారు.
ప్రధానికి విధేయులుగా పరిగణిస్తోన్నసాంస్కృతిక శాఖ మంత్రి నైడిన్ డారిస్, బ్రెగ్జిట్ మంత్రి జాకబ్ రీస్ మోగ్ బహిరంగంగా బోరిస్ జాన్సన్‌కు మద్దతు ప్రకటించారు.
ఇద్దరు సీనియర్ మంత్రుల రాజీనామాతో బోరిస్ జాన్సన్ నాయకత్వంపై మళ్లీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవలే ఆయన అవిశ్వాస తీర్మానంలో విజయం సాధించారు. కాబట్టి పార్టీ నిబంధనల ప్రకారం, వచ్చే ఏడాది జూన్ వరకు బోరిస్ జాన్సన్‌కు ఎలాంటి ప్రమాదం ఉండదు.

ఫొటో సోర్స్, Reuters
ఎన్నికలకు సిద్ధమైన విపక్షాలు
బోరిస్ జాన్సన్ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మంత్రుల రాజీనామా గురించి ప్రతిపక్ష లేబర్ పార్టీ నేత కీర్ స్టర్మర్ మాట్లాడుతూ దేశంలో ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం ఉన్నందున ఎన్నికలను స్వాగతిస్తానని అన్నారు.
''ప్రభుత్వం కూలిపోతుందని ఈ వైఫల్యాలతో స్పష్టంగా తెలుస్తోంది'' అని వ్యాఖ్యానించారు.
తదుపరి ఎన్నికలు 2024లో జరగనున్నాయి. బోరిస్ జాన్సన్ కోరుకుంటే ముందుగానే ఎన్నికలు జరుగవచ్చు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఈ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని లిబరల్ డెమొక్రటిక్ నేత సర్ ఎడ్ డేవే అన్నారు. బోరిస్ జాన్సన్, ప్రధాని పదవి నుంచి దిగిపోవాలని వ్యాఖ్యానించారు. ఎస్‌ఎన్‌పీ నేత నికోలా స్టర్జన్ మాట్లాడుతూ బోరిస్ జాన్సన్ బహిరంగంగా అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.
రిషి సునక్, సాజిద్ జావిద్ ఎందుకు రాజీనామా చేశారు?
లైంగిక దుష్ప్రవర్తనకు సంబంధించి కన్జర్వేటివ్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు క్రిస్ పించర్‌ను గత వారం సస్పెండ్ చేశారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలను పించర్ ఖండించారు. ఈ ఆరోపణలపై 2019లో పించర్‌ను బీబీసీ సంప్రదించింది. కానీ, ఆయన దీనిపై స్పందించలేదు.
పించర్‌పై ఉన్న ఆరోపణల గురించి తెలిసి కూడా బోరిస్ జాన్సన్ ఆయనను ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ విప్‌గా నియమించారు.
ఈ నియామకాన్నే విపక్షాలతో పాటు బోరిస్ జాన్సన్ పార్టీ ఎంపీలు కూడా విమర్శిస్తున్నారు.
బహుశా ఇదే తనకు చివరి మంత్రి పదవి కావొచ్చని రాజీనామాలో రిషి సునక్ పేర్కొన్నారు. జరిగిన దానికి వ్యతిరేకంగా ఇది అవసరమని, అందుకే రాజీనామా చేస్తున్నానని చెప్పారు.
ప్రధానిగా బోరిస్ జాన్సన్ విశ్వాసాన్ని పోగొట్టుకున్నాని సాజిద్ జావిద్ అన్నారు.
రిషి సునక్ భారత సంతతికి చెందిన వాడు కాగా, సాజిద్ జావిద్ కుటుంబం పాకిస్తాన్‌కు చెందినది.

బోరిస్ జాన్సన్, బీబీసీ పొలిటికల్ ఎడిటర్ క్రిస్ మైసన్‌తో మాట్లాడుతూ, 2019లో పించర్‌పై వచ్చిన ఆరోపణల గురించి తనకు తెలుసు అని అన్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైన ఆరోపణలు పరిష్కృతమయ్యామని చెప్పారు. కానీ, ఈ ఏడాది ఫిబ్రవరిలో పించర్‌ను డిప్యూటీ చీఫ్ విప్‌గా నియమించడం ఒక పొరపాటు నిర్ణయం అని అన్నారు.
''నా గురించి వస్తోన్న విషయాలతో నేను విసిగిపోయాను. ఇక నుంచి నేను స్పష్టంగా, సూటిగా వ్యవహరించాలి అనుకుంటున్నా.
అధికారాన్ని దుర్వినియోగం చేసే వ్యక్తులకు ఈ ప్రభుత్వంలో చోటు లేదు. ఇది నన్ను చాలా బాధించింది. ఈ నియామకంలో జోక్యం చేసుకోనందుకు చింతిస్తున్నా'' అని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- బ్రహ్మచర్యం ఎలా ప్రారంభమైంది? దీని పుట్టుకకు అసలు కారణాలు ఇవేనా..?
- భారత్‌లో మత స్వేచ్ఛపై అమెరికా రిపోర్ట్ లో ఏముంది, ఇండియా ఎలా స్పందించింది?
- పుండీ సారు: ఝార్ఖండ్‌కు చెందిన ఈ గిరిజన తెగ అమ్మాయి అమెరికాలో ఎలా అడుగు పెట్టింది
- హైదరాబాద్: 'డబుల్ ఇంజిన్ సర్కార్ కోసం తెలంగాణ ప్రజలు పట్టాలు వేస్తున్నారు' - మోదీ ప్రసంగంలోని 10 ముఖ్యాంశాలివే...
- ముస్లిం అమ్మాయిలు, ముఖ్యంగా హిజాబ్ ధరించే వారికి ఉద్యోగాలు ఇవ్వరా... ఎందుకీ వివక్ష?
- ప్లాస్టిక్ నిషేధం చుట్టూ రాజకీయ కాలుష్యం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








