అమెరికా: అబార్షన్‌‌లపై నిషేధం - ఏయే రాష్ట్రాలలో ఎలా ఉంది

గురువారం నాడు సుప్రీం కోర్టు ఎదుట ధర్నా చేస్తున్న అబార్షన్ హక్కుల కార్యకర్తలు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, గురువారం నాడు సుప్రీం కోర్టు ఎదుట ధర్నా చేస్తున్న అబార్షన్ హక్కుల కార్యకర్తలు

అమెరికాలో లక్షలాది మంది మహిళలు చట్టబద్ధంగా అబార్షన్ చేయించుకునే హక్కును కోల్పోతున్నారు. దాదాపు 50 ఏళ్ళ కిందట అబార్షన్‌ను దేశవ్యాప్తంగా చట్టబద్ధం చేస్తూ వెలువడిన తీర్పును అమెరికా సుప్రీం కోర్టు కొట్టి వేసింది.

రో వర్సెస్ వేడ్ కేసులో మహిళలకు అబార్షన్ హక్కును అనుమతిస్తూ వెలువడిన చరిత్రాత్మక తీర్పును తాజాగా సుప్రీం కోర్టు కొట్టివేసింది. దీనికి సంబంధించిన ఒక అధికార పత్రం లీక్ అయిన కొన్ని వారాల తరువాత ఈ నిర్ణయం వెలుగు చూసింది.

ఈ తీర్పు అమెరికాలో అబార్షన్ హక్కులను పూర్తిగా మార్చేస్తుంది. ఈ తీర్పుతో అమెరికాలోని రాష్ట్రాలు తమ పరిధిలో అబార్షన్ పద్ధతులను నిషేధించగలుగుతాయి.

సగానికి పైగా రాష్ట్రాలు త్వరలోనే అబార్షన్‌ అనుమతులను కఠినతరం చేయడమో, నిషేధించడమో చేసే అవకాశం ఉంది.

బీబీసీ

ఇప్పటికే 13 రాష్ట్రాలు సుప్రీం కోర్టు తీర్పునకు ప్రతిస్పందనంగా అబార్షన్‌ను రద్దు చేసే చట్టాలను అమల్లోకి తెచ్చేందుకు నిర్ణయించాయి. మరికొన్ని రాష్ట్రాలు కూడా త్వరలోనే అబార్షన్‌లకు ప్రతికూలంగా నిర్ణయాలు ప్రకటించే అవకాశాలున్నాయి.

మొత్తం 36 మిలియన్ల మహిళలు ఈ నిర్ణయంతో ప్రభావితం అవుతారని ప్లాన్డ్ పేరేంట్‌హుడ్ అనే సంస్థ పరిశోధనలో వెల్లడించింది.

15 వారాల గర్భం తర్వాత అబార్షన్‌‌పై మిసిసిపి విధించిన నిషేధాన్ని సవాలు చేసిన డాబ్స్ వర్సెస్ జాక్సన్ వుమెన్స్ హెల్త్ ఆర్గనైజేషన్ కేసును సుప్రీం కోర్టు పరిశీలిస్తోంది.

''గర్భస్రావం చేసే హక్కును రాజ్యాంగం ఇవ్వలేదని మేం భావిస్తున్నాం. కాబట్టి అబార్షన్లను నియంత్రించే అధికారం ప్రజలకు, వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను తిరిగి అప్పగించాలి'' అని తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించారు.

అరుదైన ఈ తీర్పు దేశాన్ని విభజించే రాజకీయ పోరాటాలకు అవకాశం కల్పించవచ్చు.

వీడియో క్యాప్షన్, పోలండ్: అబార్షన్ చేయించుకునేందుకు మరో దేశానికి వెళ్తున్న యువతులు

పెన్సిల్వేనియా, మిచిగన్, విస్కాన్సిన్ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ చట్టబద్ధత ఎన్నికలపై ఆధారపడి ఉంటుంది. మిగిలిన రాష్ట్రాల్లో.... అబార్షన్ల కోసం వేరే రాష్ట్రాలకు వెళ్లవచ్చా? మెయిళ్ల ద్వారా అబార్షన్ మందులను ఆర్డర్ చేయవచ్చా అనే అంశాల్లో కొత్త చట్టపరమైన పోరాటాలకు దారి తీయవచ్చు.

ఒకవేళ రో వర్సెస్ వేడ్ కేసు రద్దు అయితే, రాజ్యాంగంలో అబార్షన్ హక్కును పొందుపరచాలని కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, విచిగన్ రాష్ట్రాల గవర్నర్లు ఇప్పటికే ప్రణాళికలు రచించారు.

అబార్షన్ హక్కులను ఎలా కాపాడుకోవాలి అనే అంశంపై చర్చించడానికి అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గురువారం ఏడు రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్‌ను కలిసినట్లు వార్తా ఏజెన్సీ రాయిటర్స్ తెలిపింది.

అబార్షన్ల సగటు

సుప్రీంకోర్టు తీర్పును మిసిసిపి గవర్నర్ తటె రీవ్స్ స్వాగతించారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద అన్యాయాన్ని ఎదురించే అంశంలో దేశాన్ని తమ రాష్ట్రం ముందుండి నడిపించందని రీవ్స్ అన్నారు.

''ఇది ఎంత భయంకరమైన క్షణం'' అని అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్ (ఏసీఎల్‌యూ) ట్వీట్ చేసింది.

''కోర్టులు ఏం చెప్పినప్పటికీ, ఇష్టం లేకుండా గర్భాన్ని కొనసాగించాలని ఎవరినీ బలవంతపెట్టకూడదు. అబార్షన్ మా హక్కు. దీనికోసం మేం పోరాటం ఆపం'' అని ట్వీట్‌లో పేర్కొంది.

వీడియో క్యాప్షన్, ఇండియాలో అబార్షన్ చేయించుకోవడానికి నిబంధనలేమిటి

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)