Natural World Photography Awards 2022: ఫైనల్‌కు చేరుకున్నవారు, విజేతలు

నేచురల్ వరల్డ్ ఫొటోగ్రఫీ 2022 అవార్డుల పోటీలో ప్రపంచం నలుమూలల నుంచి ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. భూమిపై జీవం మనుగడ, ఎదుర్కొంటున్న ముప్పుకు సంబంధించిన ఫొటోలను ఈ పోటీకి పంపించాలి. విజేతల వివరాలను అమెరికాలో సాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా అకాడమీ ఆఫ్ సైన్సెస్‌లో పెడతారు. ఫైనల్ రౌండ్‌కు వచ్చినవారు, విజేతలు తీసిన కొన్ని ఫొటోలు.. తేనెటీగలు, ఎగురుతున్న గబ్బిలాలు.. చూసేయండి మరి!

Ball of bees

ఫొటో సోర్స్, Karine Aigner

ఫొటో క్యాప్షన్, పోటీలో బహుమతి గెలుచుకున్న ఫొటో ఇది. కాక్టస్ తేనెటీగలు ఒకదానికొకటి చుట్టుకుని, బంతిలా ఉన్న ఈ దృశ్యం చాలా అరుదైనది. ఇవి ఇలా ఒక 20 సెకండ్లు మాత్రమే ఉన్నాయి. తరువాత విడిపోయి ఎగిరిపోయాయి. ఈలోపే ఫోటోగ్రాఫర్ కరీన్ ఐగ్నర్ ఈ ఫొటో తీయగలిగారు. అమెరికాకు చెందిన ఈ తేనెటీగలు ఒంటరి జతి అని భావిస్తున్నారు.
Stoat

ఫొటో సోర్స్, Jose Grandio

ఫొటో క్యాప్షన్, ఈ స్టోట్‌ని చూడండి. ఇది ఒక రకమైన అడవి పిల్లి. ఇవి శీతల ప్రదేశాల్లో నివసిస్తాయి. ఫ్రెంచ్ ఆల్ప్స్‌లో ఈ స్టోట్ పైకి ఎగురుతుండగా ఫొటోగ్రాఫర్ జోస్ గ్రాండియో క్లిక్కుమనిపించారు. ఈ ఫొటో తీయడానికి జోస్ కొంతసేపు ఓపికగా వేచి చూశారు. అప్పుడే తాజాగా పడిన మంచులో ఆడుకుంటూ పైకి ఎగిరింది ఈ పిల్లి.
a fruit bat

ఫొటో సోర్స్, Sitaram Raul

ఫొటో క్యాప్షన్, ఆకుల మధ్యలో ఎగురుతున్న గబ్బిలం.. భలే ఉంది కదా! ఇది పండు గబ్బిలం. సీతాఫలం చెట్టు మీద పండు కొరకడానికి ఎగిరింది. ఈ ఫొటో తీయడానికి చాలా సమయం పట్టింది. ఫోటోగ్రాఫర్ సీతారామ్ రౌల్ మూడు వారాలుగా ఈ గబ్బిలాల కదలికలను గమనించారు. ఇలా ఆకుల మధ్యలోకి రాగానే ఫొటోలో బంధించారు.
snow leopard

ఫొటో సోర్స్, Sandesh Kadur

ఫొటో క్యాప్షన్, ఈ చిత్రం వన్యప్రాణుల విభాగంలో ఫైనల్స్‌కు వచ్చింది. ఫోటోగ్రాఫర్ సందేశ్ కడూర్ ఈ మంచు చిరుతపులి ఫొటో తీశారు. ఈ ఫొటోను 'ఘోస్ట్ ఆఫ్ ది మౌంటైన్స్' అని పిలుస్తారు. ఇది మంచు చిరుతపులికి మారుపేరు. ఎందుకంటే, మభ్యపెట్టడంలో వాటికవే సాటి. ఈ చిరుతపులుల ఫొటోలు తీయడం ఏమంత సులువు కాదు.
Atlantic goliath grouper

ఫొటో సోర్స్, ‍Tom Shlesinger

ఫొటో క్యాప్షన్, ఈ చేపను చూడండి.. అట్లాంటిక్ గోలియత్ గ్రూపర్‌కు చెందిన మగ చేప. చిన్న చేపల సమూహం మధ్య నుంచి ఈదుకుంటూ వస్తోంది. గోలియత్ గ్రూపర్, అట్లాంటిక్ సముద్రంలోని అతిపెద్ద చేపలలో ఒకటి. 2.5 మీటర్ల పొడవు, 360 కిలోల వరకు బరువు ఉంటుంది.
Underwater caves in Mexico

ఫొటో సోర్స్, Tom St. George

ఫొటో క్యాప్షన్, 'మన పాదాల అడుగున దాక్కున్న అందం' (హిడెన్ బ్యూటీ బినీత్ అవర్ ఫీట్)..ఇదీ ఈ ఫొటోకు శీర్షిక. మెక్సికోలో సముద్రం అడుగున ఉన్న గుహలివి. ఫోటోగ్రాఫర్ టామ్ సెయింట్ జార్జ్ ఈ గుహలలో కనిపించే సహజ సౌందర్యాన్ని చూపించాలనుకున్నారు. అంతే కాకుండా, టూరిజం కారణంగా వాటికి ఎంత ముప్పు పొంచి ఉందో తెలపాలనుకున్నారు.

All images are subject to copyright

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)