ఓషన్ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్ ది ఇయర్‌ 2021: పైన ఆకలితో పక్షులు, అలలపై బిక్కుబిక్కు మంటూ తేలే తాబేలు పిల్ల

ఓషనోగ్రాఫిక్ మాగజైన్ ఈ పోటీని సముద్రంలో ఉండే అందాలతోపాటూ, అది ఎదుర్కుంటున్న ప్రమాదాలను కూడా ప్రజల కళ్లకు కట్టాలనే లక్ష్యంతో నిర్వహిస్తోంది.

చుట్టుముట్టిన గ్లాస్ ఫిష్ మధ్యలో గ్రీన్ సీ తాబేలు

ఫొటో సోర్స్, AIMEE JAN / OCEAN PHOTOGRAPHY AWARDS

ఫొటో క్యాప్షన్, ఎయిమీ జాన్ 'ఓషన్ ఫొటోగ్రాఫర్‌ ఆఫ్ ది ఇయర్‌ 2021'గా నిలిచారు. గ్లాస్ ఫిష్ చుట్టుముట్టిన ఒక గ్రీన్ సీ తాబేలు ఫొటో ఆమెకు ఈ అవార్డ్ తెచ్చిపెట్టింది. ఎయిమీ ఈ ఫొటోను పశ్చిమ ఆస్ట్రేలియాలో తీశారు.
స్కాట్‌లాండ్, షెట్లాండ్ దీవుల్లో సముద్రంలో డైవ్ చేస్తున్న గన్నెట్స్

ఫొటో సోర్స్, HENLEY SPIERS / OCEAN PHOTOGRAPHY AWARDS

ఫొటో క్యాప్షన్, చేపల వేటకు సముద్రంలో ఈదుతున్న గన్నెట్స్ పక్షుల ఫొటో తీసిన హెనెలీ స్పియర్స్ ఈ పోటీలో రెండో స్థానంలో నిలిచారు. ఆయన ఈ ఫొటోను స్కాట్‌లాండ్‌లోని షెట్‌లాండ్ దీవుల్లో తీశారు.
తొలిసారి సముద్రంలో ఈదుతున్న హాక్స్‌బిల్ తాబేలు పిల్ల

ఫొటో సోర్స్, MATTY SMITH / OCEAN PHOTOGRAPHY AWARDS

ఫొటో క్యాప్షన్, గుడ్డు నుంచి అప్పుడే బయటికొచ్చి మొదటిసారి సముద్రంలో దిగిన హాక్స్‌బిల్ తాబేలు పిల్ల ఫొటో తీసిన మాటీ స్మిత్ ఓషన్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2021 పోటీలో మూడో స్థానంలో నిలిచారు.
సూర్యాస్తమయం సమయంలో బ్లాక్ టిప్ రీఫ్ షార్క్

ఫొటో సోర్స్, RENEE CAPOZZOLA / OCEAN PHOTOGRAPHY AWARDS

ఫొటో క్యాప్షన్, ఓషన్ ఫొటోగ్రఫీలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళా ఫొటోగ్రాఫర్ల కోసం 'ఫిమేల్ ఫిఫ్టీ ఫాంటమ్స్ అవార్డ్' అనే కేటగిరీని కూడా డిజైన్ చేశారు. లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఫొటోగ్రాఫర్, బయాలజీ టీచర్ రెనీ కాపోజ్జోలా ఈ రంగంలో చేస్తున్న కృషికి ఆమెకు ఈ కొత్త కేటగిరీ అవార్డును అందించారు. ఆమె తీసిన ఫొటోల్లో ఒక బ్లాక్ టిప్ రీఫ్ షార్క్ ఫిన్ మీదుగా సూర్యాస్తమయం కనిపిస్తున్నట్లు తీసిన ఫొటో కూడా ఉంది.
ఆస్ట్రేలియా హెరాన్ దీవుల్లో గ్రీన్ సీ తాబేలు పిల్ల

ఫొటో సోర్స్, HANNAH LE LEU / OCEAN PHOTOGRAPHY AWARDS

ఫొటో క్యాప్షన్, ఈ ఏడాది యంగ్ ఓషన్ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ హన్నా లె లూ గెలుచుకున్నారు. ఆకాశం నిండా ఆకలితో ఉన్న పక్షులున్న సమయంలో ఒక గ్రీన్ సీ టర్టిల్ గాలి కోసం పైకి వచ్చిన ఫొటోకు ఈ అవార్డు వచ్చింది. లెలూ ఈ ఫొటోను ఆస్ట్రేలియాలోని హెరాన్ దీవిలో కెమెరాలో బంధించారు.