పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్‌‌కు వచ్చిన వ్యాధి ఏంటి, దానికి కావల్సిన మెడిసిన్ పాక్‌లో దొరకదా?

పర్వేజ్ ముషర్రఫ్

ఫొటో సోర్స్, APML

పాకిస్తాన్‌లో రాజకీయ నాయకులు, సైనికాధికారులు, న్యాయమూర్తులు, పరిపాలనాధికారులకు ఏదైనా అనారోగ్యం తలెత్తినప్పుడు విదేశాల్లో చికిత్స తీసుకోవడానికి ప్రాధాన్యం ఇస్తారని చాలా సాధారణంగా భావిస్తారు. పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ పదవీ కాలంలో దేశంలో వైద్య వ్యవస్థ మెరుగుదల కోసం కృషి చేశారని చాలా మంది అంటారు. అయితే, వైద్య వ్యవస్థను మెరుగుపరచడంలో ఆయన పూర్తిగా విజయం సాధించలేదు.

ఇటీవల పాకిస్తాన్‌లోని సోషల్ మీడియా, వార్తా చానళ్లలో పర్వేజ్ ముషర్రఫ్ దేశానికి తిరిగి వస్తారనే వార్తలు బాగా వినిపించాయి. ఈ మేరకు పాక్ సైన్యం చేసిన ప్రకటనల తర్వాత పర్వేజ్ ముషర్రఫ్ కుటుంబం కూడా ట్విటర్ వేదికగా ఒక ప్రకటనను విడుదల చేసింది.

పర్వేజ్ ముషర్రఫ్ దేశానికి తిరిగి రావాలంటే ఆయన చికిత్సకు అవసరమైన ఔషధాల సరఫరాతో పాటు ఇతర చట్టపరమైన, భద్రతాపరమైన సవాళ్ళను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని ఆయన కుటుంబం ట్వీట్ చేసింది.

పర్వేజ్ ముషర్రఫ్ ఆరోగ్యం విషమంగా ఉందని గత వారంలో పాకిస్తాన్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ అన్నారు.

పర్వేజ్ ముషర్రఫ్ ప్రస్తుతం దుబాయ్‌లో ఉన్నారు.

ఆయన పాకిస్తాన్‌కు తిరిగి రావాలని పాక్ సైన్యం భావిస్తోంది. ఇందుకోసం ఆయన కుటుంబాన్ని కూడా సంప్రదించారు.

ప్రస్తుతం లండన్‌లో చికిత్స తీసుకుంటున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా ఆయనకు పర్వేజ్ ముషర్రఫ్ తో వ్యక్తిగత వైరం లేదని ట్విటర్ వేదికగా ప్రకటించారు. వారు పాకిస్తాన్ తిరిగి రావాలనుకుంటూనే ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అన్నారు.

పర్వేజ్ ముషర్రఫ్ పాక్ కు తిరిగి రావాలని పాకిస్తాన్ పార్లమెంట్‌లో కూడా చర్చకు వచ్చింది. ఆయనను వెనక్కి తీసుకొచ్చేందుకు ఎయిర్ ఆంబులెన్స్‌ను కూడా సిద్ధం చేస్తున్నట్లు వార్తలొచ్చాయి.

అయితే, పర్వేజ్ ముషర్రఫ్ రాక పై వచ్చిన పుకార్లు ఆయన కుటుంబం చేసిన ప్రకటనతో ఆగిపోయాయి. కానీ, పాకిస్తాన్‌లో ఆయన చికిత్సకు అందుబాటులో లేని ఒక ఔషధం గురించి కొత్త చర్చ మొదలయింది.

పర్వేజ్ ముషర్రఫ్

ఫొటో సోర్స్, Spencer Platt

పర్వేజ్ ముషర్రఫ్‌కు ఉన్న జబ్బేమిటి?

పర్వేజ్ ముషర్రఫ్ ప్రస్తుతం దుబాయ్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నెలలో ఆయన మరణించినట్లు కూడా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు కనిపించాయి. అయితే, ఆయన కుటుంబం ఈ పుకార్లను ఖండించింది. ముషర్రఫ్ అములాయ్‌డోసిస్ అనే జబ్బుతో బాధపడుతున్నట్లు ఆయన కుటుంబం చెప్పింది. ఈ రోగంలో శరీరంలోని వివిధ భాగాలు అచేతనంగా మారుతూ ఉంటాయి.

శరీరంలో అమీలాయిడ్ అనే ప్రోటీన్ శాతం పెరగడం వల్ల అములాయ్‌డోసిస్ ఏర్పడుతుందని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.

శరీరంలో ఈ ప్రోటీన్ అవసరానికి మించి ఉత్పత్తి కావడం మానవ శరీరానికి హానికరం అని నిపుణులు చెబుతున్నారు.

పర్వేజ్ ముషర్రఫ్‌కు కావల్సిన ఔషధం ఏంటి. ఇది పాకిస్తాన్ లో ఎందుకు దొరకటం లేదు? ఈ ఔషధాన్ని తెప్పించడం సులభమా? కష్టమా?

డార్జాలెక్స్

ఫొటో సోర్స్, THESOCIALMEDWORK

ఫొటో క్యాప్షన్, డార్జాలెక్స్

డరటుముమాబ్‌ను ఎలా వాడతారు?

డార్ట్ మాబ్‌ను డార్జాలెక్స్ అని కూడా అంటారు. దీనిని ఒక రకమైన లుకేమియాలో చికిత్సకు వాడతారు.

ఇది కెమోథెరపీ కాదు. ఇది మల్టిపుల్ మైలోమా శరీరంలో వృద్ధి కాకుండా, లేదా పెరగకుండా చూస్తుంది. ఈ ప్రక్రియలో డార్జాలెక్స్ రోగి శరీరంలో ఉన్న అన్ని మైలోమా కణాలకు అతుక్కుంటుంది.

అసంఖ్యాకంగా పెరిగిపోయిన మైలోమా కణాల పై అత్యధికంగా ఉత్పత్తి అయిన హానికారక ప్రోటీన్‌కు ఈ డార్జాలెక్స్ అతుక్కుంటుంది. దీంతో పాటు ఇది శరీరంలోని ఇతర ఎర్ర రక్త కణాలకు కూడా అతుక్కుంటుంది. ఈ విధంగా రోగి రోగ నిరోధక శక్తిని తగ్గించే మైలోమా కణాల వ్యాప్తిని అరికట్టడం కానీ, వాటిని అంతం చేయడం కానీ చేస్తుంది. డార్జాలెక్స్ ప్రోటీన్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది.

డరటుముమాబ్‌

ఫొటో సోర్స్, DARZALEXHCP.COM

ఈ ఔషధం పాకిస్తాన్‌లో అందుబాటులో ఎందుకు లేదు?

ఈ ఔషధాన్ని మొదట డానిష్ బయో టెక్ సంస్ధ జెన్‌మాబ్ తయారు చేసింది. కానీ, ప్రస్తుతం దీనిని జెన్‌మాబ్, జాన్ సన్ బయో టెక్ సంయుక్తంగా తయారు చేస్తున్నాయి. జాన్సన్ బయో టెక్ జాన్సన్ & జాన్సన్ అనుబంధ సంస్థ. ఈ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా ఈ ఔషధాన్ని ఉత్పత్తి చేసే హక్కులను జెన్‌మాబ్ నుంచి కొనుగోలు చేసింది.

పాకిస్తాన్‌లో రిజిస్టర్ చేయని ఔషధాలు, పాకిస్తాన్‌లో ప్రవేశపెట్టని ఔషధాలు, కొరతలో ఉన్నవి, లేదా కొంత మంది రోగులకు మాత్రమే అవసరమయ్యే ఔషధాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చని పాకిస్తాన్ డ్రగ్ రెగ్యులేటరీ అథారిటీ (డిఆర్ఏపి) డిప్యూటీ డైరెక్టర్ అఖ్తర్ అబ్బాస్ చెప్పారు.

ఒక వేళ రోగికి అవసరమైన ఔషధాలు పాకిస్తాన్‌లో అందుబాటులో లేకపోతే, ఆ ఔషధాలను దిగుమతి చేసుకునేందుకు ఎటువంటి అభ్యంతరం ఉండదని చెప్పారు.

డిఆర్‌ఏపి వెబ్‌సైటు పై దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేస్తామని తెలిపారు.

అరుదైన రోగాల చికిత్సలో వాడే ఔషధాలను దిగుమతి చేసుకోవడం వల్ల ఔషధ పంపిణీదారులకు ప్రయోజనాలు ఉండవని అఖ్తర్ అబ్బాస్ అన్నారు. కొన్ని ఔషధాలను నిల్వ చేసేందుకు ప్రత్యేక ఉష్ణోగ్రతలు ఉండాలని అన్నారు.

ఈ ఔషధాల నిల్వ కోసం తగిన కేంద్రాలకు కూడా 24 గంటల్లో నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తామని తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి, ఈ బియ్యం తింటే ఆరోగ్యానికి మంచిదా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)