Swiss watches: రష్యాపై స్విట్జర్లాండ్ ఆంక్షలు, 'కోట్ల విలువైన స్విస్ వాచీలను జప్తు చేసిన రష్యా'

ఫొటో సోర్స్, Getty Images
కోట్లు విలువ చేసే ఆడెమర్స్ పిగెట్ వాచీలను రష్యా అధికారులు జప్తు చేసినట్లు స్విస్ మీడియా చెబుతోంది.
మంగళవారం నాడు రష్యా సెక్యూరిటీ సర్వీస్ ఏజెంట్లు ఈ స్విస్ వాచీలను మాస్కోలోని ఒక దుకాణం నుంచి స్వాధీనం చేసుకున్నారని స్విస్ మీడియా తెలిపింది.
కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించినందుకే వీటిని సీజ్ చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
స్విట్జర్లాండ్ తన తటస్థ వైఖరిని విడిచిపెట్టి రష్యాపై ఆంక్షలు విధించిన కొద్దిరోజులకే ఈ సంఘటన జరిగింది.
అయితే, దీనిపై స్విస్ నుంచి ఎలాంటి నిర్ధరణ రాలేదు.
లగ్జరీ వస్తువుల ఎగుమతిపై విధించిన నిషేధం కొన్ని వ్యాపారాలకు "అనిశ్చితి" కలిగిస్తోందని స్విట్జర్లాండ్ ప్రభుత్వం పేర్కొంది.
ఒక్కో ఆడెమర్స్ పిగెట్ వాచీ ధర సుమారు రూ.7 కోట్లు ఉంటుంది.
జరిగిన సంఘటనపై, బీబీసీ ఈ సంస్థను సంప్రదించింది కానీ, వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.
రష్యా ఎఫ్ఎస్‌బీ సెక్యూరిటీ సర్వీస్ కోసం పనిచేసే ఏజెంట్లు ఆడెమర్స్ పిగెట్ మాస్కో బ్రాంచీ నుంచి వాచీలను స్వాధీనం చేసుకున్నారని స్విట్జర్లాండ్ వార్తాపత్రిక ఎన్‌జెడ్‌జెడ్ ఏఎం సోంటాగ్ తెలిపింది.
ఈ వాచీలను రష్యాకు దిగుమతి చేస్తున్నప్పుడు స్థానిక కస్టమ్స్ నిబంధనలను ఉల్లంఘించారని ఏజెంట్లు అంటున్నారు.
యుక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైన తరువాత, ఈ సంస్థ రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.
స్విట్జర్లాండ్ గత ఏడాది రష్యాకు రూ.2,126 కోట్ల విలువైన గడియారాలను ఎగుమతి చేసిందని పరిశ్రమ అధికారులు చెబుతున్నారు. కానీ, రష్యాలో లగ్జరీ వస్తువులకున్న డిమాండ్ బట్టి చూస్తే, వీటి మార్కెట్ విలువ అంతకన్నా చాలా ఎక్కువ ఉండవచ్చు.
రష్యాలో తమ కార్యకలాపాలను తగ్గించుకుంటున్న విదేశీ సంస్థల ఆస్తులను సీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు రష్యన్ అధికారులు. గత కొన్ని వారాల్లో ఈ చర్యలు మరింతగా పెరిగాయి.
ఇటీవల, సుమారు రూ.75,949 కోట్లు విలువ చేసే లీజుకు తీసుకున్న విదేశీ జెట్లను రష్యా నిలిపివేసింది. ఈ విమానాలను వెనక్కు తిరిగి ఇవ్వమని యజమానులు చేసిన అభ్యర్థనలను తోసిపుచ్చింది.
రష్యా నుంచి వైదొలగుతున్న పాశ్చాత్య కంపెనీల ఆస్తులను జాతీయం చేయడానికి కొత్త చట్టాన్ని తీసుకొచ్చే అవకాశం ఉందని రష్యా మాజీ అధ్యక్షుడు డిమిత్రి మెద్వెదేవ్ ఈ నెల ప్రారంభంలో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ‘వ్యభిచారంలోకి దింపడానికి వాళ్లు అందమైన అమ్మాయిల కోసం వెతుకుతున్నారు’
- బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డు విజేత మీరాబాయి చాను
- Zero Mile: సున్నా మైలు రాయి ఎక్కడ ఉంది? భారతదేశానికి భౌగోళిక కేంద్ర బిందువు ఏది?
- లైంగికంగా వేధించే భర్త నుంచి భార్యకు ఇకపై న్యాయం లభిస్తుందా... కర్ణాటక హైకోర్టు తీర్పు ఏం చెబుతోంది?
- RRR చుట్టూ ఇంత సందడి ఎందుకు? ఎవరి నోటా విన్నా ఆ సినిమా మాటే వినిపించేలా ఎలా చేస్తారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













