Omicron: యూరోపియన్ దేశాల్లో పెరుగుతున్న ఒమిక్రాన్ భయం.. నెదర్లాండ్స్‌లో కఠిన లాక్ డౌన్

వైద్యులు, వైద్య సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల్లో కరోనావైరస్ ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించే అవకాశం ఉండటంతో ఆదివారం నుంచి కఠినమైన లాక్ డౌన్ ఆంక్షలకు సిద్ధమైంది నెదర్లాండ్స్.

నిత్యావసర దుకాణాలను మినహాయించి బార్లు, వ్యాయామశాలలు, క్షౌరశాలలు సహా ప్రజలు గుమికూడే ప్రాంతాలన్నింటినీ జనవరి రెండో వారం వరకు మూసివేయనున్నారు. సెలవుల్లో ప్రతి ఇంటికి కేవలం ఇద్దరు అతిథులకు మాత్రమే ప్రభుత్వం అనుమతిచ్చింది.

శనివారం మీడియాతో మాట్లాడిన నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రూట్.. ఆదివారం నుంచి 'దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధిస్తున్నాం' అంటూ ఒక్క మాటలో చెప్పాల్సిన విషయాన్ని చెప్పేశారు. ఈ ప్రకటన చేయడం తనకు బాధ కలిగిస్తున్నప్పటికీ మరో మార్గం లేకనే ఈ పని చేయాల్సి వస్తోందని అన్నారు.

లాక్ డౌన్ విధించడానికి ముందు షాపింగ్ కోసం బయటకు వెళ్లిన ప్రజలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, లాక్ డౌన్ విధించడానికి ముందు షాపింగ్ కోసం బయటకు వెళ్లిన ప్రజలు

లాక్ డౌన్ ఆంక్షలు ఇవే:

  • ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలి.
  • క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలకు కేవలం నలుగురు అతిథులకు మాత్రమే అనుమతి
  • జనవరి 9 వరకు పాఠశాలలకు సెలవులు
  • రెస్టారెంట్లలో టేక్ అవే సర్వీసులకు మాత్రమే అనుమతి
  • జనవరి 14 వరకు లాక్ డౌన్ నిబంధనలు

ఇప్పటి వరకు నెదర్లాండ్స్ 85శాతం వయోజనులు వ్యాక్సీన్ తీసుకున్నారు. 9 శాతం మంది మాత్రమే బూస్టర్ డోస్ వేసుకున్నారు. జనవరి 7న బూస్టర్ డోస్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నెదర్లాండ్స్ ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీడియో క్యాప్షన్, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాక్సీన్లకు లొంగదా

కఠిమైన ఆంక్షల దిశగా యూరోపియన్ దేశాలు

ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఫ్రాన్స్, రిపబ్లిక్ ఆఫ్ ఐర్లాండ్, జర్మనీ దేశాలు కూడా కఠినమైన నిబంధనల్ని అమలు చేయడం ప్రారంభించాయి.

వచ్చే ఏడాదిలో ఒమిక్రాన్ వేరియంట్ యూరోప్ దేశాల్లో శర వేగంగా వ్యాపించనుందని ఫ్రాన్స్ ప్రధాని జీన్ క్యాస్టెక్స్ హెచ్చరించారు.

బ్రిటన్లో శనివారం నాటికి 25 వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు నమోదవడంతో అక్కడ నుంచి తమ దేశంలో అడుగు పెట్టే వారిపై కఠినమైన ఆంక్షల్ని విధిస్తోంది ఫ్రాన్స్.

Netherlands.

ఫొటో సోర్స్, Getty Images

జర్మనీలోనూ ఆంక్షలు కఠినం

మరోవైపు బ్రిటన్ నుంచి వచ్చే వారిపై ఆంక్షలు విధించే దేశాల్లో తాజాగా జర్మనీ కూడా చేరింది. అయితే యూకే నుంచి వస్తున్న తమ దేశస్థుల్ని ప్రస్తుతానికి అనుమతిస్తున్నప్పటికీ వాళ్లు కచ్చితంగా నెగిటివ్ రిపోర్ట్ చూపించాలి. అలాగే వ్యాక్సీన్ వేయించుకున్నప్పటికీ రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండాలి. సోమ వారం నుంచి ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయి. డెన్మార్క్, ఫ్రాన్స్, నార్వే, లెబనాన్ దేశాలను కూడా హై రిస్క్ జాబితాలో చేర్చింది జర్మనీ.

వీడియో క్యాప్షన్, వీడియో: కరోనావైరస్: మీ చేతుల్ని 20 సెకండ్లలో కడుక్కోవడం ఎలా?

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)