చరిత్ర: హానీమూన్ ఎప్పుడు, ఎందుకు మొదలైంది? దానికి ఆ పేరు ఎలా వచ్చింది?

ఫొటో సోర్స్, Dinodia Photos/Getty Images
కొత్తగా పెళ్ళైన వారు హానీమూన్‌కు వెళ్లే అలవాటు ఎప్పటి నుంచి మొదలయింది?
1800లో పర్యటక రంగం అభివృద్ధి చెందుతున్న తొలినాళ్లలో సంపన్నవర్గాల్లో పెళ్లి తర్వాత నవదంపతులు చేసే యాత్రలు ప్రాముఖ్యం పొందినట్లు ప్రముఖ చరిత్రకారులు ఎమిలీ బ్రాండ్ వివరించారు.
ఎమిలీ బ్రాండ్ 18వ శతాబ్దపు చరిత్ర గురించి అధ్యయనం చేసి రచనలు చేశారు.
కొత్తగా పెళ్ళైన దంపతులు తమ కోసం కొంత ఏకాంత సమయాన్ని కోరుకోవడం సహజం. వివాహ తంతులు ముగిసిన వెంటనే చిన్న చిన్న ట్రిప్‌లకు వెళ్లే అలవాటు ఎప్పటి నుంచో కొనసాగుతోంది.
ఆధునిక యుగం ప్రారంభంలో సంపన్న వర్గాలకు చెందిన కొంత మంది జంటలు స్నేహితులు, కుటుంబాలను కలిసేందుకు పర్యటనలు చేసేవారు. మరి కొంత మంది అందరికీ దూరంగా గడుపుతూ ఒకరినొకరు తెలుసుకునేందుకు ఆ సమయాన్ని ఉపయోగించుకునేవారు.
8వ హెన్రీ పెళ్ళైన వెంటనే భార్య ఆన్ బోలీన్‌తో కలిసి గ్లౌసెస్టర్‌షైర్‌లో ఉన్న థోర్న్‌బరీ కోటలో వారం రోజులకు పైగా గడిపారు.
రెండవ చార్లెస్ నవవధువుతో గడిపేందుకు హ్యాంప్‌టన్ కోర్టు ప్యాలస్‌కు వెళ్లారు.
దంపతులు ఏకాంతాన్ని కోరుకోవడానికి చాలా కారణాలున్నాయి.
ఒక మిలిటరీ అధికారి ఆయన భార్యతో కలిసి పెళ్ళైన వెంటనే తొలిరాత్రి జరుపుకోవడానికి నార్విచ్ వెళ్లినట్లు 18వ శతాబ్దానికి చెందిన వార్తా పత్రిక సాహసోపేతంగా ప్రచురించింది.
19వ శతాబ్దంలో రైలు ప్రయాణం అందుబాటులోకి రావడంతో, కార్మిక వర్గానికి చెందిన కొత్త జంటలు కూడా సముద్ర తీరాలకు గాని, నగరాలకు గాని పర్యటనలకు వెళ్లేందుకు వీలు కుదిరింది.
సంపన్న వర్గాల జంటలు బ్రైడల్ టూర్ల కోసం ఖండాలు దాటి కూడా వెళ్లేవారు.
ఈ సమయాన్ని "ఒక నెల రోజుల పాటు బలవంతంగా అందరి నుంచీ దూరం చేసి ఒంటరి చేయడం" అని విక్టోరియన్ విమర్శకులు అంటారు.
వేసవిలో వివాహం జరిగితే కనీసం చుట్టుపక్కల ప్రాంతాలను సందర్శించేందుకు వెళ్లేవారు. శీతాకాలంలో వివాహం జరిగితే, ఇంటికే పరిమితమై ఉండిపోయేవారు.

ఫొటో సోర్స్, Hindustan Times/Getty Images
పెళ్ళైన వెంటనే చేసే పర్యటనను హానీమూన్ అని ఎందుకు పిలుస్తారు?
1800 చివరివరకూ, హానీమూన్ అనే పదం వాడుకలోకి రాలేదు. వివాహం తర్వాత వెళ్లే పర్యటనలకు హానీమూన్ అనే పేరు లేదు.
అప్పట్లో ఆ సమయాన్నిపెళ్ళైన తొలి నెల అని మాత్రమే పిలిచేవారు.
కానీ, 1552కు చెందిన ఒక పుస్తకం హానీ మోన్ అనే పదానికున్న అర్ధాన్ని వివరించింది.
18వ శతాబ్ధం మధ్యలో శామ్యూల్ జాన్‌సన్ రాసిన డిక్షనరీలో "వివాహం జరిగిన మొదటి నెలలో సున్నితత్వం, సంతోషం తప్ప మరేదీ ఉండదు".
కానీ, చంద్రుడు క్షీణించిన తరహాలోనే వారిరువురి మధ్యా ఉండే ఆప్యాయతలు కూడా తగ్గుతూ వస్తాయనే అర్ధంతో ఈ పేరు పెట్టి ఉండవచ్చు. విక్టోరియన్లు 30 రోజుల పాటు తేనెతో తయారు చేసిన ఒక మత్తు పదార్ధాన్ని సేవించే పురాతన ఆచారంతో హానీమూన్‌ను ముడిపెట్టి ఉంటారని భావిస్తారు.
19వ శతాబ్దపు చివర్లో, వివాహ యాత్రలకు హానీమూన్ అనే పదాన్ని వాడటం విరివిగా జరిగింది. కొత్త జంటలు సమాజానికి దూరంగా వెళ్లి గడపాల్సిన అవసరం లేదని 1881లో ఒక ఫ్యాషన్ మ్యాగజైన్ ప్రకటించింది.
అప్పటికే తక్కువ నిడివితో కూడుకున్న హానీమూన్‌లు ప్రాచుర్యం పొందాయి.
కొంత మంది వధువులు కేవలం 3 రోజుల హానీమూన్‌తోనే సంతృప్తి పడినట్లు ఆ పత్రిక రాసింది. నెల రోజుల పాటు హానీ మూన్ కు వెళ్లడం పాత ఫ్యాషన్ అని ఆ పత్రిక తీర్మానించింది.
వేగంగా పరుగుపెడుతున్న ఆధునిక యుగంలో జీవిత గమనం అద్భుతంగా ఉందని అంది.
ఈ శతాబ్దం చివరి నాటికి, సంప్రదాయ తరహాలో వివాహాలను చేసుకునేందుకు సమయం కూడా సరిపోదని అంటూ, పెళ్లి తర్వాత గడిపే సెలవులు ఖర్చుతో కూడుకున్న పని అని వర్ణించింది.
1900 శతాబ్ధం మొదట్లో చోటు చేసుకున్న హానీమూన్లు బెలూన్లు, కేరవాన్ లు, సబ్ మెరైన్‌లు, పర్వతారోహణలు, దక్షిణ ధ్రువ పర్యటనలతో కూడుకుని ఉన్నట్లు విలేఖరులు వర్ణించారు.
హానీమూన్‌లో ఫ్యాషన్లు వచ్చి పోతూ ఉంటాయి. పెరిగిపోతున్న ఆధునిక వివాహాల ఖర్చుతో, చాలా జంటలు తక్కువ ఖర్చుతో కూడుకున్న మినీ మూన్ లకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు.
పూర్వీకుల తరహాలో ఆడంబరం లేని పర్యటనలు చేయాలని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- పళ్లు ఎంతసేపు తోముకోవాలి? రెండు నిమిషాలు బ్రష్ చేస్తే చాలా? సైన్స్ ఏం చెబుతోంది?
- 175 ఏళ్ల కిందట అనెస్థీషియా ఎలా పుట్టింది? పూర్వకాలంలో మత్తు మందు లేకుండా ఆపరేషన్లు ఎలా చేసేవాళ్లు? తొలినాళ్లలో వాడిన 4 మత్తు మందులు, వాటి సైడ్ ఎఫెక్ట్స్
- Mental Health: వర్చువల్ రియాలిటీతో మానసిక అనారోగ్యానికి చికిత్స -డిజిహబ్
- సెక్స్: మీ భార్య/భర్తను ఎలా ఆకట్టుకోవాలో మీకు తెలుసా?
- "నా కూతురిని మెంటల్ ఆసుపత్రిలో వదిలి వస్తుంటే ఆత్మహత్య చేసుకోవాలనిపించింది"
- సెక్స్‌లో ఎంతసేపు పాల్గొన్నా భావప్రాప్తి కలగకపోవడానికి కారణమేంటి? ఇది వ్యాధి లక్షణమా?
- ఆండ్రోపాజ్: మగవాళ్లలో సెక్స్ కోరికలు తగ్గడానికి కారణం ఇదేనా?
- ఈ నాన్-స్టిక్ పాత్రలు ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో మీకు తెలుసా?
- మద్యం తాగితే మనిషి శరీరంలో ఏం జరుగుతుంది... హ్యాంగోవర్ దిగడానికి పారాసెటమాల్ మంచిదేనా?
- ‘ఆయన నాపైన చేయి కూడా వేయడం లేదు, దగ్గరకు వెళ్లినా అటు తిరిగి పడుకుంటున్నారు’
- ఈ సుఖ వ్యాధి ఎందుకొస్తుంది, ఎలా వస్తుంది
- వైట్ మ్యారేజ్: ఈ ధోరణి ఏమిటి.. ఇలాంటి జంటలకు పుట్టే పిల్లలను అధికారికంగా గుర్తించరా
- హైదరాబాద్: మూడు గంటలపాటు ఆపరేషన్, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














