క‌రోనావైర‌స్ విజృంభిస్తున్న వేళ ప్రజలు సామాన్య జీవితం గడపడానికి ఎలా ప్రయత్నిస్తున్నారు

కార్టూన్

ఫొటో సోర్స్, Priyakurian

భార‌త్‌లో మార్చి 25న లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డానికి ముందే మాస్క్‌లు నిత్య జీవితంలో ఎలా భాగ‌మ‌య్యాయో వివ‌రిస్తూ కార్టూనిస్ట్ ప్రియా కురియ‌న్ వ‌రుస కార్టూన్లు వేశారు.

త‌న స్నేహితురాలిని క‌లుసుకోవ‌డానికి బెంగ‌ళూరు నుంచి కోల్‌క‌తా.. విమానంలో వెళ్లిన‌ప్పుడు ఎదురైన అనుభ‌వాల‌తోపాటు త‌న ఇరుగు పొరుగునున్న‌వారిని చూసి ఈ కార్టూన్లు గీసిన‌ట్లు ఆమె తెలిపారు.

ఇది విమానాలు ఇంకా తిరుగుతున్న‌ప్పుడు, మాస్క్‌లు త‌ప్ప‌నిస‌రి కాన‌ప్పుడు జ‌రిగింది. అయితే కోవిడ్‌-19 వ్యాప్తి అప్ప‌టికే మొద‌లు కావ‌డంతో కొంద‌రు మాస్క్‌లు వేసుకోవ‌డం మొద‌లుపెట్టారు.

"ఆ స‌మ‌యంలో.. రాబోయే రోజులు ఎలా ఉండ‌బోతున్నాయో మాకు ఎలాంటి అవ‌గాహ‌నా లేదు."అని ఆమె వివ‌రించారు.

క‌రోనావైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో ప్ర‌జ‌లు సామాన్య జీవితాన్ని గ‌డిపేందుకు ఎలా ప్ర‌య‌త్నిస్తున్నారో కార్టూన్ల ద్వారా కురియ‌న్ చూపించారు. దీనిలో మొద‌టిది హ‌నీమూన్‌కు వెళ్తున్న జంట కార్టూన్‌‌. వారు హనీమూన్‌ను శుభ‌ప్ర‌దంగా చేసుకోవాల‌ని నిశ్చ‌యించుకున్న‌ట్లు క‌నిపించారని కురియ‌న్ వ్యాఖ్యానించారు.

రెండోది కోల్‌క‌తా ఎయిర్‌పోర్ట్‌లో విమానం దిగిన‌ బ్యాట్‌మ్యాన్ కార్టూన్‌. అప్పుడు కరోనావైర‌స్ మూలాల్లో గ‌బ్బిలాల పాత్ర గురించి అంద‌రూ లోతుగా మాట్లాడుకునేవార‌ని కురియ‌న్ తెలిపారు.

కార్టూన్

ఫొటో సోర్స్, Priyakurian

"అప్పుడే గ‌బ్బిలాల గురించి వార్త‌లు కూడా చ‌క్క‌ర్లు కొట్టాయి."

ఆ త‌ర్వాత కార్టూన్.. బెంగ‌ళూరు విమానాశ్ర‌యంలో క‌నిపించిన దృశ్యాల‌కు సంబంధించినది అని కురియ‌న్ చెప్పారు.

కార్టూన్

ఫొటో సోర్స్, Priyakurian

బ్యాగేజీ తీసుకునే చోట‌.. ఆఫీస్ ట్రిప్ నుంచి వ‌స్తున్న సేల్స్ గ‌ర్ల్స్ ఒకేలాంటి బ‌ట్ట‌లు, మాస్క్‌లు వేసుకొని క‌నిపించారు.

"ఏదో వైర‌ల్ అయిన‌ట్టు అనిపించింది"అని కురియ‌న్ అన్నారు.

అయితే, మాస్క్‌లు కేవ‌లం విమానాశ్ర‌యాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. బ‌ట‌య‌కు వెళ్తున్న ప్ర‌తిసారీ ప్ర‌జ‌లు మాస్క్‌లు వేసుకుంటున్నారు.

కార్టూన్

ఫొటో సోర్స్, Priyakurian

"బెంగ‌ళూరులోని మా ఇంటి ద‌గ్గ‌ర నేను 15 రోజుల‌కు ఒక‌సారి స‌ర‌కుల కోసం బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు ఇరుగుపొరుగు మాత్ర‌మే క‌నిపించేవారు. అంద‌రూ మాస్క్‌లు పెట్టుకొనేవారు. కొంద‌రైతే ఇంట్లో త‌యారుచేసిన మాస్క్‌లు వాడేవారు." అని కురియ‌న్ వివ‌రించారు.

అయితే కొంద‌రిలో సృజ‌నాత్మ‌క‌త కూడా క‌నిపించింది.

కోల్‌క‌తాలో కొంద‌రు యువ‌కులు మాత్రం జ‌ర‌గ‌బోతున్న ప‌రిణామాల‌ను ముందే ఊహించుకొని.. త‌గిన ఏర్పాట్లు చేసుకున్నారు.

కార్టూన్

ఫొటో సోర్స్, Priyakurian

మాస్క్‌లు ఉన్నా.. లేక‌పోయినా.. కొన్ని అల‌వాట్లు మాత్రం ఎప్ప‌టికీ పోవు.

ఉదాహ‌ర‌ణ‌కు విమానాశ్ర‌యంలో కొంద‌రు న‌వ్వుతూ "ఎయిర్‌పోర్ట్ సెల్ఫీ" తీసుకుంటూ క‌నిపించారు.

కార్టూన్

ఫొటో సోర్స్, Priyakurian

సామాజిక దూరం అనేది చాలా మంది భార‌తీయుల‌కు మింగుడు ప‌డ‌ని అంశ‌మ‌ని కురియ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. చాలాచోట్ల సామాజిక దూరం నిబంధ‌న‌లు విఫ‌లం కావ‌డాన్ని తాను చూశాన‌ని అన్నారు.

"ఐసోలేష‌న్‌లో ఉన్న‌ప్పుడు వంట గ‌ది కిటికీలో నుంచి ఖాళీ వీధుల్లోకి చూస్తే.. సామాజిక దూరం విధానాలు విఫ‌ల‌మ‌య్యాయ‌ని చెప్పే కొన్ని దృశ్యాలు క‌నిపించాయి. ఒకే స్కూట‌ర్ మీద ముగ్గురు, న‌లుగురు కూర్చొనే చోట సామాజిక దూరాన్ని అమ‌లు చేయ‌డ‌మంటే కాస్త వింత‌గానే అనిపించింది." అని ఆమె వ్యాఖ్యానించారు.

కార్టూన్

ఫొటో సోర్స్, Priyakurian

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)