టీ20 ప్రపంచకప్ AUS vs WI: క్రిస్ గేల్ వెస్టిండీస్ తరఫున చివరి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడేశాడా?

ఫొటో సోర్స్, Getty Images
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆడిన మ్యాచే వెస్టిండీస్ దిగ్గజం, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్‌కు చివరి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కానుందా?
తాజా పరిస్థితులు చూస్తే మాత్రం అది నిజమేనని అనిపిస్తోంది. ఈ అనుమానాన్ని బలపరిచేలా ఆస్ట్రేలియాతో మ్యాచ్ ముగిశాక క్రిస్ గేల్‌కు 'గార్డ్ ఆఫ్ ఆనర్' గౌరవం కూడా లభించింది.
శనివారం గ్రూప్ 1లో భాగంగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన సూపర్ 12 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో మొదట వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 157 పరుగులు చేయగా... ఆస్ట్రేలియా 16.2 ఓవర్లలో 2 వికెట్లకు 161 పరుగులు చేసి గెలుపొందింది. గేల్ 9 బంతుల్లో 2 సిక్సర్ల సహాయంతో 15 పరుగులు చేశాడు. బ్రావో 10 పరుగులు సాధించాడు.
మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా ప్లేయర్లు... క్రిస్ గేల్‌తో పాటు అంతర్జాతీయ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మరో వెస్టిండీస్ ప్లేయర్ డ్వేన్ బ్రావోకు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చారు.
తన రిటైర్మెంట్‌పై బ్రావో ప్రకటన ఇచ్చినప్పటికీ, 42 ఏళ్ల గేల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ మ్యాచ్‌లో చాలా సంఘటనలు గేల్ రిటైర్మెంట్ దిశగా సాగుతున్నట్లు సంకేతాలను ఇచ్చాయి.
మ్యాచ్‌లో బ్రావోతో పాటు గేల్ అవుటయ్యాక ప్రేక్షకులు అందరూ చప్పట్లు కొడుతూ నిల్చున్నారు. మ్యాచ్ అనంతరం ఆస్ట్రేలియా ప్లేయర్లు అద్భుత రీతిలో వీరిద్దరిని గార్డ్ ఆఫ్ ఆనర్‌తో గౌరవించారు. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అయితే బ్రావో చాంపియన్ డ్యాన్స్‌తో అలరించాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
పొడవాటి జుట్టు, విచిత్రమైన కళ్లద్దాలు, రకరకాల టోపీలు ధరిస్తూ ఆహార్యంతో కూడా ప్రేక్షకులను అలరించే గేల్ ఈ మ్యాచ్‌లో కూడా టోపీ, సన్‌గ్లాసెస్ ధరించి బౌలింగ్ చేసి సందడి చేశాడు.
ఈ మ్యాచ్‌లో ఒకే ఓవర్ బౌలింగ్ చేసిన గేల్... చివరి బంతికి మిచెల్ మార్ష్ (32 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)ను అవుట్ చేశాడు. ఆ తర్వాత మార్ష్ భుజంపైకి ఎక్కి సంబరాలు చేసుకున్నాడు. మార్ష్ కూడా అంతే సంబరంగా గేల్‌ను అభినందించాడు. ఈ దృశ్యం ప్రేక్షకులకు కనువిందు చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఒకవేళ ఇదే అతని చివరి మ్యాచ్ అయితే గనక చివరి బంతికి వికెట్ తీసిన ఘనత కూడా గేల్ ఖాతాలో చేరుతుంది.
'గేల్ కొనసాగుతాడు, బ్రావో రిటైర్మెంట్ ప్రకటించాడు' అని కెప్టెన్ పోలార్డ్ చెప్పినప్పటికీ... మ్యాచ్ వ్యాఖ్యాతలు ఇయాన్ బిషప్, డారెన్ స్యామీ సైతం గేల్‌కు ఇదే చివరి మ్యాచ్ అయ్యే సంకేతాలు చాలా కనిపిస్తున్నాయని తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
'గొప్ప టీ20 క్రికెటర్ అయిన గేల్‌కు లభిస్తోన్న గౌరవం, నివాళులు చూస్తుంటే... వెస్టిండీస్ జెర్సీలో గేల్‌ను చూడటం ఇదే చివరిసారి అని అనిపిస్తోంది. మైదానంలో జరిగే సంఘటనలన్నీ దాన్నే ప్రతిబింబిస్తున్నాయి'' బిషప్ ఆన్ ఎయిర్‌లో వ్యాఖ్యానించారు.
టీ20 ఫార్మాట్ రారాజు
ఈ మధ్య అతని బ్యాటింగ్‌లో వాడి తగ్గింది నిజమే అయినప్పటికీ మైదానంలో ఆకాశమంత ఎత్తున్న అతని కీర్తిని తాజా ప్రదర్శనలు మసకబార్చలేవు.
విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన గేల్... మైదానంలో బ్యాట్‌తో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు.
2006 ఫిబ్రవరి 16న న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో గేల్ టీ20ల్లో అరంగేట్రం చేశాడు.
ఈ ఫార్మాట్‌లో అతని బ్యాటింగ్ తిరుగులేకుండా సాగింది. టీ20ల్లో అతను 22 సెంచరీలు బాదినట్లు క్రిక్ ఇన్ఫో పేర్కొంది. అతని తర్వాత రెండో స్థానంలో ఉన్న క్రికెటర్ చేసిన సెంచరీల సంఖ్య కేవలం 8 మాత్రమేనని క్రిక్ ఇన్ఫో తెలిపింది.
ఈ ఫార్మాట్‌లో 1045 సిక్సర్లు, 1108 ఫోర్లు బాదిన గేల్ మొత్తం 14321 పరుగులు చేశాడు.
ఇందులో అంతర్జాతీయ టీ20ల్లో 79 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 14 అర్ధసెంచరీలతో 1899 పరుగులు చేశాడు. 124 సిక్సర్లు బాదాడు.
ఇవి కూడా చదవండి:
- టీ20, వన్డే, టెస్టు ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్లలో ఎవరు బెస్ట్?
- టీ20 వరల్డ్ కప్: ‘అఫ్గానిస్తాన్‌పై గెలిచినా భారత్ సెమీస్ చేరడం అంత సులభం కాదు’
- టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్
- టీ20 వరల్డ్ కప్: అఫ్గాన్‌పై భారత్ ఘన విజయం
- విరాట్ కోహ్లీ: స్థాయి లేనోడా? భయం లేనోడా? ఈ సంజ్ఞపై ఎందుకింత చర్చ?
- టీఆర్పీలు, ఆదాయం కోసం ఐసీసీ వేసిన ప్లాన్ భారత్ కొంపముంచిందా?
- టీ20 వరల్డ్‌కప్ : ఐపీఎల్ ప్రభావం టీమ్ ఇండియాపై పడిందా?
- టీ20 వరల్డ్ కప్: వరుసగా నాలుగో విజయంతో సెమీ ఫైనల్ చేరిన పాకిస్తాన్
- టీమిండియా సెమీఫైనల్‌కు చేరాలంటే అఫ్గానిస్తాన్‌పై ఆధారపడాల్సిందేనా
- విరాట్ కోహ్లీ: ‘ఆ బాధను ఎవరితోనూ పంచుకోలేక కుమిలిపోయా.. క్రికెట్‌ను వదిలేయాలన్న ఆలోచనలూ వచ్చాయి’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








