టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ - Newsreel

ఫొటో సోర్స్, Getty Images
భారత క్రికెట్ జట్టు కోచ్‌గా మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ నియమితులయ్యారు.
రాహుల్ ద్రవిడ్‌ను భారత సీనియర్ పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు బుధవారం క్రికెట్ అడ్వయిజరీ కమిటీ ప్రకటించింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌తో రవిశాస్త్రి పదవీ కాలం ముగియనుంది.
స్వదేశంలో న్యూజీలాండ్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్ నుంచి రవిశాస్త్రి స్థానంలో ద్రవిడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
టీమిండియా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు స్వాగతం పలుకుతున్నాం అని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు.
''క్రికెటర్‌గా రాహుల్‌కు ఘనమైన చరిత్ర ఉంది. క్రికెట్‌లోని గొప్ప ఆటగాళ్లలో ఆయన ఒకరు. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా కూడా ఆయన భారత క్రికెట్‌కు సేవలందించారు''
''ఎన్‌సీఏలో రాహుల్ చేసిన కృషి కారణంగానే అనేక మంది యువ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించగలిగారు. ఇప్పుడు హెడ్ కోచ్‌గా భారత క్రికెట్‌ను ఆయన మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారని నేను గట్టిగా నమ్ముతున్నా'' అని గంగూలీ పేర్కొన్నారు.
'ఈ పదవికి రాహుల్ కన్నా యోగ్యుడు మరొకరు లేరు. ఆయనను టీమిండియా కోచ్‌గా చూడటం చాలా ఆనందంగా ఉందని' బీసీసీఐ కార్యదర్శి జై షా అన్నారు.
''రాబోయే రెండేళ్లలో రెండు ప్రపంచకప్ టోర్నీలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ ఈ పదవికి సరైన వ్యక్తి. ఎన్‌సీఏలో ఆయన పనితీరు, భారత అండర్-19, ఎ జట్లకు దిశానిర్దేశం చేస్తూ ఆయన సహజ పద్ధతిలో ఒక గొప్ప కోచ్‌గా పరివర్తన చెందారు. ఆయన పర్యవేక్షణలో భారత జట్టు అన్ని ఫార్మాట్లలోనూ ఆధిపత్యం ప్రదర్శిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. బోర్డు త్వరలోనే ఇతర సహాయక సిబ్బంది నియామకాన్ని చేపడుతుంది'' అని జై షా వివరించారు.
భారత క్రికెట్ జట్టుకు కోచ్ అవ్వడం తనకు దక్కిన అతిపెద్ద గౌరవమని భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అన్నారు. ఈ పాత్రలో బాధ్యతలు నిర్వర్తించడం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు ఆయన చెప్పారు.
'శాస్త్రి పర్యవేక్షణలో భారత జట్టు చాలా అద్భుతంగా ఆడింది. అలాంటి జట్టుతో కలసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా. ఈ జట్టులోని చాలా మంది యువ క్రికెటర్లతో అండర్ 19, భారత్ 'ఎ' స్థాయిలో ఉన్నప్పుడు పనిచేశా. వారంతా క్రికెట్‌ను ఎంతగా ఇష్టపడతారో నాకు తెలుసు. రాబోయే రెండేళ్లలో చాలా ముఖ్యమైన టోర్నమెంట్‌లు జరగనున్నాయి. వాటిల్లో మెరుగ్గా రాణించేందుకు నా బృందంతో కలిసి పనిచేస్తా'' అని ద్రవిడ్ చెప్పుకొచ్చారు.
కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి

ఫొటో సోర్స్, Getty Images
భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదం తెలిపింది.
ఈ మేరకు డబ్ల్యూహెచ్‌ఓ ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
భారత్‌లో తయారవుతున్న కోవాగ్జిన్ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ ఆమోదం కోసం గత కొన్ని నెలలుగా సంప్రదింపులు కొనసాగుతున్నాయి.
ఈ టీకాపై తమకు కావాల్సిన సమాచారాన్ని డబ్ల్యూహెచ్‌ఓ భారత్ బయోటెక్ నుంచి ఎప్పటికప్పుడూ తీసుకుంటూ వచ్చింది.
తాజాగా ఈ టీకాను అత్యవసర వినియోగ జాబితా (ఈయూఎల్)లో చేర్చింది.
కోవాగ్జిన్ వ్యాక్సీన్‌కు అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వడంపై డబ్ల్యూహెచ్‌ఓకు కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి మాన్‌సుఖ్ మాండవీయ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
COP26: చైనా, రష్యా అధ్యక్షులు సదస్సుకు రాకపోవడంపై విమర్శలు గుప్పించిన బైడెన్

ఫొటో సోర్స్, Reuters
గ్లాస్గోలో జరుగుతున్న కాప్ 26 సదస్సుకు చైనా, రష్యా నాయకులు హాజరు కాకపోవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విమర్శలు గుప్పించారు.
"వాతావరణల మార్పులు అనేది చాలా పెద్ద సమస్య. చైనా దూరంగానే ఉండిపోయింది. అలాగే రష్యా కూడా " అంటూ మంగళవారం రాత్రి బైడెన్ తన ప్రసంగంలో విమర్శించారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ సదస్సుకు గైర్హాజరు అయ్యారు. కానీ, ఇరు దేశాలూ తమ ప్రతినిధుల బృందాలను పంపాయి.
ప్రపంచంలో అత్యధిక కర్బన ఉద్గార దేశం చైనా. తరువాతి స్థానాల్లో అమెరికా, యూరోపియన్ యూనియన్, భారతదేశం ఉన్నాయి. అయిదవ స్థానంలో రష్యా ఉంది.
గ్లాస్గోలో జరుగుతున్న కాప్ 26 సదస్సులో 120 మందికి పైగా దేశాధినేతలు పాల్గొంటున్నారు. నవంబర్ 1న మొదలైన ఈ సదస్సు నవంబర్ 14 వరకు జరుగుతుంది.
2030 నాటికి వాతావరణంలో మీథేన్ స్థాయిలను తగ్గించడం లేదా అంతం చేయడం, అడవులను పెంచడంతో సహా అనేక ఇతర కార్యక్రమాలు చేపడతామని ఇప్పటికే పలు దేశాలు వాగ్దానాలు చేశాయి.
అటవీ నిర్మూలకు స్వస్తి పలికే ప్రతిజ్ఞపై చైనా, రష్యా సంతకం చేశాయి.
మంగళవారం బైడెన్ ప్రసంగానికి ముందు, కాప్ 26 సదస్సులో అటవీ నిర్వహణపై జరిగిన సమావేశంలో పుతిన్ వర్చువల్‌గా ప్రసంగించారు.
క్రెమ్లిన్ పత్రికా ప్రకటన ప్రకారం, "అడవులను సంరక్షించడానికి రష్యా ధృడమైన, శక్తిమంతమైన చర్యలు తీసుకుంటుందని" పుతిన్ వెల్లడించారు.
అయితే, స్వయంగా చైనా, రష్యా అధ్యక్షులు సదస్సుకు హాజరు కాకపోవడాన్ని బైడెన్ తప్పుబట్టారు.
ఇప్పటివరకు జరిగిన చర్చల్లో చైనా, రష్యా, సౌదీ అరేబియా సహా ఇతర దేశాలు పోషించిన పాత్ర గురించి అడిగినప్పుడు బైడెన్ ఆ వ్యాఖ్యలు చేశారు.
"ప్రపంచానికి నాయకత్వం వహించేందుకు చైనా ఉవ్విళ్లూరుతోంది. అలాంటప్పుడు ఈ సదస్సుకు షీ జిన్‌పింగ్ హాజరు కాకపోవడం చాలా పెద్ద తప్పు" అని బైడెన్ అన్నారు.
రష్యాలో అడవులు తగులబడిపోతున్నాయి కానీ వారి అధ్యక్షుడు "మౌనంగా ఉన్నారు" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, వాతావరణ మార్పుల సమస్యకు రష్యా "ప్రాధాన్యం" ఇస్తుందని పుతిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. కానీ, పుతిన్ సదస్సుకు ఎందుకు రాలేదో కారణాలు చెప్పలేదు.
చైనా నాయకుడు షీ జిన్‌పింగ్ కూడా కాప్ 26 సదస్సుకు హాజరు కాలేకపోవచ్చని అక్టోబర్‌లోనే ఆ దేశ అధికారులు వెల్లడించారు. 2020 ప్రారంభం నుంచి షీ జిన్‌పింగ్ చైనా విడిచి బయటకు వెళ్లలేదని సమాచారం.

ఫొటో సోర్స్, Reuters
కాబుల్ మిలటరీ ఆస్పత్రిపై ఐఎస్ దాడి, 20 మందికి పైగా మృతి
అఫ్గానిస్తాన్ రాజధాని కాబుల్‌లోని ఒక మిలటరీ ఆస్పత్రిపై జరిగిన బాంబుల దాడి, తుపాకీ కాల్పుల్లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 16 మందికి పైగా గాయపడ్డారు.
400 పడకల సర్దార్ దావూద్ ఖాన్ ఆస్పత్రి వెలుపల రెండు భారీ పేలుళ్లతో దాడి ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
అనంతరం, సాయుధులు ఆసుపత్రిలోకి చొరబడ్డారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు.
ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ ఐఎస్-కే ఈ దాడికి పాల్పడినట్లు ఆ తరువాత ప్రకటించింది.
దాడి సమయంలో తనను ఒక గదిలో దాక్కోమన్నారని, అక్కడి నుంచి తుపాకీ శబ్దాలు వినిపిస్తూనే ఉన్నాయని ఒక డాక్టర్, ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీకి చెప్పారు.
పేలుళ్లలో ఒకటి ఆత్మాహుతి దాడి అని సయ్యద్ అహద్ ఈవీఎన్ మీడియాకు చెప్పారు.
"ఓ ఆఫ్గాన్ పౌరుడిగా ఈ యుద్ధం, ఆత్మాహుతి దాడులు, పేలుళ్లతో నిజంగా విసిగిపోయాను. ఇంకా ఎన్నాళ్లు ఈ బాధలు భరించాలి?" అంటూ ఆయన వాపోయారు.
ఐఎస్-కే సాయుధులు ఆస్పత్రి గేటు దగ్గర ఒక బాంబు పేల్చిన తరువాత లోపలికి ప్రవేశించారని తాలిబాన్ ప్రతినిధి బిలాల్ కరీమి బీబీసీకి తెలిపారు.

తాలిబాన్ మిలిటెంట్లు జరిపిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఐఎస్-కే సాయుధులు ప్రాణాలు కోల్పోయారని, ఒకరిని సజీవంగా పట్టుకున్నారని కరీమి వెల్లడించారు.
హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రి ప్రాంగణంలోకి దిగిన తాలిబాన్ ప్రత్యేక బలగాలు దుండగులను లోనికి ప్రవేశించకుండా నిరోధించాయని తాలిబాన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ రాయిటర్స్ వార్తా సంస్థకు వెల్లడించారు. గేటు దగ్గర, ఆవరణలో తమ బలగాలు ఎదురు కాల్పులు జరిపాయని, దుండగులంతా 15 నిమిషాల్లో హతమయ్యారని ఆయన చెప్పారు.
పశ్చిమ దేశాల మద్దతు ఉన్న మునుపటి అఫ్గాన్ ప్రభుత్వం నుంచి స్వాధీనం చేసుకున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ను తాలిబాన్లు ఉపయోగించడం ఇదే మొదటిసారి అని ఆ వార్తాసంస్థ తెలిపింది.
ఆగస్టులో తాలిబాన్లు అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తరువాత జరిగిన తాజా దాడి ఇది.
ఐఎస్-కే అంటే ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్. అఫ్గాన్ పౌరులు, తాలిబాన్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని అనేక దాడులకు పాల్పడ్డామని ఐఎస్-కే ఇప్పటికే ప్రకటించింది.
ఆగస్టులో కాబూల్ విమానాశ్రయంపై ఈ గ్రూపు జరిపిన బాంబు దాడిలో 150కి పైగా పౌరులు, 13 మంది అమెరికా సైనికులు మరణించారు.
సర్దార్ దావూద్ ఖాన్ ఆసుపత్రిపై గతంలోనూ ఓ దాడి జరిగింది. 2017లో సాయుధులు డాక్టర్లుగా వేషం కట్టి భవనంలోనికి ప్రవేశించారు. ఈ దాడిలో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మంది గాయపడ్డారు. ఈ దాడికు కూడా తామే పాల్పడినట్లు ఇస్లామిక్ స్టేట్ గ్రూపు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- సెక్స్ ట్రేడ్ కోసం యూరప్‌కు మహిళల అక్రమ రవాణా... తప్పించుకున్న ఓ బాధితురాలి కథ
- ‘ఎన్ని పంటలు వేసినా రాని డబ్బులు గంజాయి సాగుతో వస్తున్నాయి.. మరో దారి లేకే గంజాయి పండిస్తున్నాం..’
- 'మృతదేహాల అవశేషాలపై ఇళ్లు కట్టుకుని నివసించడం మాకు అలవాటైపోయింది'
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- ఉత్తర కొరియాలో డ్రగ్స్, తీవ్రవాదం, ఆయుధ విక్రయాల గుట్టు విప్పిన ఒక సీక్రెట్ ఏజెంట్
- కోవిడ్-19: మా అమ్మను డాక్టర్లు గినియా పిగ్లా భావించి ప్రయోగాలు చేశారు
- నీళ్లపైనే నగరాలు.. భవిష్యత్తు ఇదేనా? యూరప్ దేశాల్లో ఈ ప్రయోగాలు ఎందుకు జరుగుతున్నాయి?
- కశ్మీర్లో భయాందోళనల్లో హిందువులు.. శాంతి, భద్రతలపై ప్రభుత్వానివి ఉత్తి మాటలేనా?
- లిపులేఖ్ రోడ్డు విషయంలో భారత్ తీరుపై నేపాల్‌లో ఆగ్రహం ఎందుకు
- కాలాపానీ: నేపాల్ సరిహద్దులోని 35 చ.కి.మీ భూమి సమస్యను వాజ్‌పేయి నుంచి మోదీ వరకు ఎవ్వరూ ఎందుకు పరిష్కరించలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








