విరాట్ కోహ్లీ: ‘ఆ బాధను ఎవరితోనూ పంచుకోలేక కుమిలిపోయా.. క్రికెట్‌ను వదిలేయాలన్న ఆలోచనలూ వచ్చాయి’

ఫొటో సోర్స్, Getty Images
ఆటగాడిగా విజయాలు సాధించడమే కాకుండా జట్టుకూ విజయాలు అందిస్తున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రికెట్‌ను వదిలేయాలనుకున్నాడంటే నమ్మగలరా?
కానీ, అది నిజం. అయితే, ఆయనెందుకు క్రికెట్‌ను వదిలేయాలనుకున్నాడు?
ఇండోర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌కు ముందు విలేకరుల సమావేశంలో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ తానెందుకు ఆటను వదిలేయాలనుకున్నాడో చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెక్ మాక్స్‌వెల్ మానసిక ఆరోగ్యం సరిగా లేదంటూ విరామం తీసుకోవడాన్ని విరాట్ ప్రశంసించాడు.
ఒక దశలో తానూ క్రికెట్‌ను వదిలేయాలని ఆలోచించానని చెప్పాడు. 2014 ఇంగ్లండ్ పర్యటన సమయంలో తాను క్లిష్ట దశను ఎదుర్కొన్నానని, ఆ బాధను ఎవరితోనూ పంచుకోలేక కుమిలిపోయానని, ఆటను వదిలేయాలన్న ఆలోచనలూ వచ్చాయని చెప్పుకొచ్చాడు.
''ఏం చేయాలో అప్పుడు నాకేమీ అర్థం కాలేదు. ఎలా మాట్లాడాలో కూడా తెలియలేదు.''
''మానసికంగా కుదురుగాలేనని, ఆటకు దూరంగా వెళ్లిపోవాలని అనుకుంటున్నానని చెప్పి ఉండాల్సింది. కానీ, దాన్నెలా స్వీకరిస్తారో తెలియదు కదా'' అన్నాడు కోహ్లీ.
''ఆటగాళ్లు ఇలా కొంత విరామం తీసుకుని రిఫ్రెష్ అయ్యాక మళ్లీ రావడం మంచిది'' అన్నాడు కోహ్లీ.

ఫొటో సోర్స్, REUTERS
మ్యాక్స్‌వెల్ మంచి పని చేశాడు
శ్రీలంకతో టీ20 సిరీస్‌కు ఎంపికైన ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ గత నెలలో జట్టు నుంచి తప్పుకున్నాడు.
''మ్యాక్స్‌వెల్ చేసిన పనిని అందరూ గుర్తించాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లకు ఇదో ఉదాహరణ'' అన్నాడు విరాట్.
మరో ఆస్ట్రేలియా ఆటగాడు విల్ పకోవ్స్కీ కూడా మ్యాక్స్‌వెల్ బాటలోనే నడిచాడు. పాకిస్తాన్‌తో సిరీస్‌కు తన పేరు పరిశీలించొద్దని ఆ దేశ క్రికెట్ బోర్డును కోరాడు. తాను తన మానసిక ఆరోగ్యంపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని చెప్పాడు.

ఫొటో సోర్స్, Getty Images
ఆట కోసం తాము తమ మానసిక ఆరోగ్య పరిస్థితులను ఎలా దాచిపెట్టామన్నది కొందరు ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా చెప్పారు.
2006-07లో ఆస్ట్రేలియాలో పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు తాను కుంగుబాటుకు లోనయినట్లు ఫ్లింటాప్ చెప్పాడు.
2013లో జొనాథన్ ట్రాట్ కూడా మానసికంగా ఒత్తిడికి గురవడంతో ఆస్ట్రేలియా పర్యటన నుంచి ఇంగ్లండ్‌కు తిరిగొచ్చేశాడు.
మహిళా క్రికెట్లో ప్రపంచంలోనే గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా గుర్తింపు ఉన్న ఇంగ్లండ్‌కు చెందిన సారా టేలర్ 'యాంగ్జయిటీ' సమస్యతో బాధపడుతూ సెప్టెంబరులో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: 10 ఏళ్ల తర్వాత స్వదేశంలో టెస్ట్ మ్యాచ్: శ్రీలంక జట్టుకు ఎందుకు కృతజ్ఞతలు చెబుతున్నారు?
- సౌరవ్ గంగూలీ.. నాయకుడిగా నడిపించగలడా.. రాజకీయాలను ఎదుర్కోగలడా
- భారత క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర - దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్
- ఒకప్పుడు కరడుగట్టిన నేరస్థుల కారాగారం... నేడు పర్యటకుల స్వర్గధామం
- ధోనీ మళ్లీ ఆడతాడా... భారత క్రికెట్‌కు అతడి అవసరం ఇంకా ఉందా?
- ఎంఎస్ ధోనీ క్రికెట్‌కు పూర్తిగా రిటైర్మెంట్ ప్రకటించనున్నాడా?
- అనుష్కతో హానీమూన్‌కు సంబంధించి కోహ్లీ బయటపెట్టిన ఆసక్తికర విషయం ఏమిటి?
- ఎవరీ క్రికెట్ బాహుబలి
- ఇతరుల పట్ల ప్రేమ, దయ చూపితే ఎక్కువ కాలం జీవిస్తారు ఎందుకు?
- వరల్డ్ వీగన్ డే: ఏ ప్రాణినీ ఇబ్బంది పెట్టని ఆహారం
- పంజాబ్, హరియాణా పొలాల పొగ దిల్లీని కమ్మేస్తుంటే ఏపీ రైతులు ఏం చేస్తున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








