విరాట్ కోహ్లీ: నిషేధానికి అడుగు దూరంలో టీంఇండియా సారథి

ఫొటో సోర్స్, Reuters
భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ మందలింపునకు గురయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్ బ్యూరన్ హెండ్రిక్స్‌ను భుజంతో ఢీకొట్టినందుకు ఐసీసీ ప్రవర్తనా నియమావళిని అనుసరించి రిఫరీ రిచీ రిచర్డ్సన్ అతనికి ఒక డీమెరిట్ (అయోగ్యత) పాయింట్ ఇచ్చారు.
ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ట్వంటీ20 మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. కోహ్లీ పరుగులు చేస్తున్న సమయంలో బౌలర్ బ్యూరన్ హెండ్రిక్స్‌ను ఢీ కొట్టాడు.
దీంతో ఇంటర్నేషన్ క్రికెట్ కౌన్సిల్ అతనికి ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చింది. దీంతో కోహ్లీ ఖాతాలో మూడు డీమెరిట్ పాయింట్లు చేరినట్లు అయింది.
2020 జనవరి 15 లోపు కోహ్లీ ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ చేరితే అతడు కొన్ని మ్యాచ్‌లు ఆడకుండా నిషేధానికి గురికావాల్సి వస్తుంది.
ఏ ఆటగాడైనా రెండేళ్ల కాలంలో నాలుగు డీమెరిట్ పాయింట్లు పొందితే కొన్ని మ్యాచ్‌లు ఆడకుండా అతడిపై నిషేధం విధించవచ్చు.
2018 జనవరి 15న కోహ్లీకి మొదటిసారి డీమెరిట్ పాయింట్ వచ్చింది.
ఇవి కూడా చదవండి:
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
- ఈ కుర్ర 'షేన్ వార్న్' నేపాలీ క్రికెట్ దశను మార్చేస్తాడా?
- కొడితే సిక్స్ కొట్టాలి.. ఆడితే క్రికెట్ ఆడాలి
- రూసీ కరంజియా: భారత మీడియాకు కొత్త నడక నేర్పిన జర్నలిస్ట్
- ఐన్‌స్టీన్ దృష్టిలో అద్భుతమైన గణిత మేధావి ఎవరో తెలుసా?
- 'మా అమ్మను, తోబుట్టువులను నా ముందే చంపేశారు.. చనిపోయినట్లు నటించి నేను బయటపడ్డా'
- ‘క్యాన్సర్ చికిత్సతో గుండెపోటు వచ్చినా బతికి బయటపడ్డాను’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




