IND Vs SA క్రికెట్: భారత జట్టు సరికొత్త చరిత్ర - దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో చివరిదైన మూడో మ్యాచ్‌లోనూ భారత జట్టు అద్భుత విజయం సాధించటం ద్వారా.. సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది.
రాంచీ టెస్టులో ఇన్నింగ్స్ 202 పరుగుల తేడాతో భారత జట్టు విజయ దుందుభి మోగించింది.
అంతకుముందు.. పుణెలో జరిగిన రెండో టెస్టులోనూ దక్షిణాఫ్రికా మీద కోహ్లీ సేన ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో గెలిచింది. దానికిముందు విశాఖపట్నంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో 203 పరుగుల తేడాతో విజయం సొంతం చేసుకుంది.
భారత పర్యటనలో ఉన్న దక్షిణాఫ్రికాపై మూడు టెస్టు మ్యాచ్‌లలోనూ గెలిచి టెస్ట్ సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేయటం ఇదే తొలిసారి.
నిజానికి దక్షిణాఫ్రికా వరుసగా రెండు లేదా అంతకన్నా ఎక్కువ టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో ఓడిపోవటం ఎనిమిది దశాబ్దాల తర్వాత ఇదే మొదలు. 1935-36లో ఆస్ట్రేలియా చేతుల్లో వరుసగా మూడు టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో దక్షిణాఫ్రికా ఓడిపోయింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రెండు ఓవర్లు - ఒక్క పరుగు - రెండు వికెట్లు...
మూడో టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ అద్భుతమైన డబుల్ సెంచరీతో పటిష్టమైన పునాది వేయటంతో భారత జట్టు భారీ స్కోరు నమోదు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 497 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకు కుప్పకూలి ఫాలో-ఆన్ ఆడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ 133 పరుగులకే ఆలౌట్ అయింది.
మ్యాచ్‌లో చివరి రెండు రోజులూ భారత పేసర్లు విధ్వంసం సృష్టించారు. మహ్మద్ షమీ, ఉమేష్ యాదవ్‌లు అత్యుత్తమ ప్రదర్శన చూపారు. కొత్తగా జట్టులోకి వచ్చిన షాబాజ్ నదీమ్ కూడా బంతితో పాటు ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
దక్షిణాఫ్రికా జట్టు 132 పరుగుల (8 వికెట్లకు) ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజు మంగళవారం ఉదయం ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండు ఓవర్లు ఆడి కేవలం ఒక్క పరుగు సాధించి చివరి రెండు వికెట్లనూ కోల్పోయింది. ఈ రెండు వికెట్లూ నదీమ్ తీశాడు.
భారత జట్టు సమష్టిగా రాణించి ఇన్నింగ్స్ 202 పరుగులతో విజయబావుటా ఎగురవేసింది.
భారత బ్యాట్స్‌మన్‌లో రోహిత్ శర్మ (212) డబుల్ సెంచరీ, రహానే (115) సెంచరీలతో పాటు రవీంద్ర జడేజా (51) అర్థ సెంచరీ సాధించి ఆధిపత్యం ప్రదర్శించారు.
దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌లో తొలి ఇన్నింగ్స్‌లో అర్థ శతకం సాధించిన జుబేర్ హమ్జా మినహా ఎవరూ రాణించలేదు.
భారత జట్టులో బౌలర్లు మహ్మద్ షమీ మూడు వికెట్లు, ఉమేశ్ యాదవ్, షాబాజ్ నదీమ్‌లు రెండేసి వికెట్లు తీయగా.. జడేజా, అశ్విన్‌లు చెరొక వికెట్ పడగొట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
రోహిత్ శర్మ: మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్
రాంచీ టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యారు. ఇది టెస్ట్ కెరీర్‌లో రోహిత్ శర్మకు తొలి డబుల్ సెంచరీ.
అంతేకాదు.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు సాధించిన ఈ హిట్‌మ్యాన్‌ను.. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ కూడా వరించింది.
దక్షిణాఫ్రికాతో ఒక టెస్ట్ సిరీస్‌లో 500 పైగా పరుగుల సాధించిన తొలి భారత క్రికెటర్‌గా కూడా రోహిత్ రికార్డు నెలకొల్పాడు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
సొంతగడ్డపై వరుసగా 11 టెస్ట్ సిరీస్ విజయాలు...
దక్షిణాఫ్రికాపై ఈ గెలుపుతో సొంతగడ్డపై వరుసగా 11 టెస్ట్ సిరీస్ విజయాలు అందుకున్న క్రికెట్ జట్టుగా కోహ్లీ సేన సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.
2013 ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకూ భారత్ స్వదేశంలో ఆడిన అన్ని టెస్ట్ సిరీస్‌లనూ గెలుచుకుంటూ వస్తోంది.
ఇంతకుముందు ఆస్ట్రేలియా రెండు సార్లు స్వదేశంలో ఆడిన పది టెస్టు సిరీస్‌ల్లో వరుసగా విజయం సాధించింది.
240 పాయింట్లతో శిఖరాగ్రానికి...
ఐదు టెస్టుల్లో 240 పాయింట్లు సాధించిన భారత జట్టు ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో మిగతా జట్లకు అందనంత ఎత్తులో అగ్రస్థానంలో నిలిచింది.
రెండో స్థానంలోని న్యూజీలాండ్, మూడో స్థానంలోని శ్రీలంక జట్లకు కేవలం 60 పాయింట్ల చొప్పున మాత్రమే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
- 'దాదాగిరీ' సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుందా?
- విరాట్ కోహ్లీ: బ్రాడ్‌మన్, సచిన్, సెహ్వాగ్‌ల రికార్డ్ బ్రేక్
- ధోనీ మళ్లీ ఆడతాడా... భారత క్రికెట్‌కు అతడి అవసరం ఇంకా ఉందా?
- అమెరికాలో 15 రాష్ట్రాలను వణికిస్తున్న చేప
- కడప జిల్లాలోని కొన్ని గ్రామాల్లో భూమి కుంగుతోంది.. కారణమేంటి?
- ఆర్టీసీ బస్ నంబర్ ప్లేట్ మీద Z ఎందుకుంటుందో తెలుసా?
- #100WOMEN: పోర్న్‌హబ్‌తో కలిసి పనిచేస్తానని హాలీవుడ్ నటి బెల్లా థోర్న్ ఎందుకన్నారు...
- ఎరిత్రియా: ఇక్కడ సిమ్ కార్డులు బంగారంతో సమానం... ఏటీఎంల గురించి వారికి తెలియదు
- ఆక్స్ఫర్డ్ ఇంగ్లిష్ డిక్షనరీలో 'టాలీవుడ్'
- శాన్ జోస్ యుద్ధ నౌక: సాగర గర్భంలోని నౌకలో లక్షల కోట్ల సంపద... దక్కేది ఎవరికి?
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)