ఇండియా vs వెస్టిండిస్: ఎవరీ క్రికెట్ బాహుబలి.. ప్రపంచ క్రికెట్‌లో ఇతనే అత్యంత భారీకాయుడా

ఫొటో సోర్స్, Getty Images
ఇండియా vs వెస్టిండిస్ రెండో టెస్ట్ మ్యాచ్ తొలిరోజు ఐదు వికెట్ల నష్టానికి భారత్ 264 పరుగులు చేసింది.
భారత్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీలు కొట్టారు. మరోవైపు వెస్టిండీస్ సారథి జేసన్ హోల్డర్ మూడు వికెట్లు తీశాడు.
అయితే, తొలిరోజు ఆట ముగిసేనాటికి మ్యాచ్‌కు సంబంధించి సోషల్ మీడియాలో మరో క్రికెటర్‌పై వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అతడే రహ్‌కీమ్ కార్న్‌వాల్.
వెస్టిండీస్ టీమ్‌లోకి కార్న్‌వాల్ కొత్తగా అడుగుపెట్టాడు. అతడి ఎత్తు, బరువు గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు.
26 ఏళ్ల కార్న్‌వాల్‌కు ఇది తొలి టెస్ట్‌మ్యాచ్. అతడి బరువు 140 కేజీలని, ప్రపంచంలో అత్యంత బరువైన టెస్ట్ క్రికెటర్ అతడేనని మీడియాలో వార్తలు వచ్చాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఐసీసీ వీటిని ధ్రువీకరించలేదు. క్రికెట్ గణాంకాల నిపుణుడు రజనీశ్ గుప్తా మాత్రం ఈ విషయంపై స్పందించారు.
ఆస్ట్రేలియాకు చెందిన వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ (133-139 కేజీలు) కంటే కార్న్‌వాల్ బరువే ఎక్కువని ట్వీట్ చేశారు. 140 కేజీల బరువుండే కార్న్‌వాల్ ప్రపంచంలో అత్యంత బరువైన టెస్ట్ క్రికెటర్ అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, AFP/gettyimages
కార్న్‌వాల్ ఎత్తు 6.5 అడుగులు. రైట్‌హ్యాండ్ బ్యాట్స్‌మన్ అయిన అతడు ఆఫ్‌బ్రేక్ బౌలర్.
తొలి మ్యాచ్‌లోనే కీలకమైన ఛటేశ్వర్ పుజారా వికెట్‌ను కార్న్‌వాల్ పడగొట్టాడు. దీంతో 'టెస్ట్‌మ్యాచ్‌ల చరిత్రలోనే ఇది అత్యంత బరువైన వికెట్'అని మరో క్రికెట్ గణాంకాల నిపుణుడు మోహన్‌దాస్ మేనన్ చమత్కరించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
వెస్టిండీస్‌లో కార్న్‌వాల్‌కు మంచి పేరుంది. సిక్సర్‌లను అతడు ఇట్టే బాదేయగలడు. ఎత్తుగా ఉండటంతో అతడు వేసే స్పిన్ చక్కగా బౌన్స్ అవుతుంది. వెస్టిండీస్ చాంపియన్‌షిప్(2018-19)లో 17.68 సగటుతో అతడు 54 వికెట్లు తీశాడు.
క్రికెట్ వెబ్‌సైట్ ఈఎస్‌పీఎన్ క్రికెఇన్ఫో సమాచారం ప్రకారం 55 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో అతడు 2224 పరుగులు చేశాడు. 24 సగటుతో 260 వికెట్లు పడగొట్టాడు. టీ-20 మ్యాచ్‌లలో ఆయన స్ట్రైక్‌రేట్ 131 పైనే ఉంది.
బాగా ఆడుతున్నప్పటికీ అతి బరువు వల్ల ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అతడి తెరంగేట్రం ఆలస్యమైంది. బరువు తగ్గించుకోవడంలో కార్న్‌వాల్‌కు సహకరిస్తున్నట్లు గత ఏడాది వెస్టిండీస్ చీఫ్ సెలెక్టర్ కోర్ట్నీ బ్రౌన్ తెలిపారు.
దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ జాక్వెస్ కలిస్‌ను తన రోల్ మోడల్‌గా కార్న్‌వాల్ చెబుతుంటాడు.

ఫొటో సోర్స్, Getty Images
మ్యాచ్ పరిస్థితి ఇదీ..
రెండో టెస్ట్ తొలిరోజు భారత్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీలు కొట్టారు. కేఎల్ రాహుల్, చటేశ్వర్ పుజారా నిరాశతో పెవీలియన్ బాట పట్టారు.
కోహ్లీ వికెట్ అనంతరం భారత్ జట్టు కాస్త ఇబ్బందుల్లో పడినట్టు అనిపించింది. యువ క్రికెటర్లు హనుమ విహారీ, రిషబ్ పంత్ నిలదొక్కుకోగలిగారు. విహారీ 42, పంత్ 27 స్కోర్‌తో ఆడుతున్నారు.
కింగ్‌స్టన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు రాహుల్, మయాంక్ అగర్వాల్ తొలి ఆరు ఓవర్లకు సగటున 5.33 స్కోర్ కొట్టారు.
జట్టు 32 పరుగులు చేసిన అనంతరం రాహుల్ మొదట అవుట్ అయ్యాడు. తర్వాత ఆరు పరుగులు తీసి పుజారా కూడా వెనుదిరిగాడు. మయాంక్ అగర్వాల్, కెప్టెన్ కోహ్లీ కలిసి స్కోర్‌ను వంద వరకు తీసుకెళ్లారు.
మయాంక్ అగర్వాల్ అనంతరం క్రీజ్‌లో అడుగుపెట్టిన రహానే 24 పరుగులకే ఔట్ అయ్యాడు.
ఇవి కూడా చదవండి:
- కడుపులోని పసికందునూ కబళిస్తోన్న కాలుష్యం
- ‘మా నాన్న ఒక గ్యాంగ్‌స్టర్... నా మూలాలు దాచేందుకు నా ముక్కునే మార్చేశాడు’
- పెరూలో బయటపడ్డ 500 ఏళ్లనాటి మృతదేహాలు.. ‘దేవతలను సంతృప్తి’ పరచడానికి 227 మంది పిల్లల సామూహిక బలి
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత అమిత్ షా టార్గెట్ మావోయిస్టులేనా...
- ఆర్ఎఫ్ఐడీ: రోజువారీ జీవితాల్లో భాగమైపోయిన ప్రచ్ఛన్న యుద్ధ కాలపు స్పై టెక్నాలజీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








