లావోస్: ఆసియా ఖండంలోనే ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో డ్రగ్స్ స్వాధీనం

ఫొటో సోర్స్, PHOTO SUPPLIED
'లావోస్' పోలీసులు ఒకేసారి పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఆసియా ఖండంలో ఇదే తొలిసారని ఐరాస తెలిపింది.
5.5 కోట్ల మెథాంఫెటామైన్ టాబ్లెట్లు, 1.5 టన్నుల క్రిస్టల్ మెథ్‌ను తరలిస్తున్న ట్రక్‌ను పోలీసులు పట్టుకున్నారని ఐరాస వెల్లడించింది.
థాయిలాండ్, మియన్మార్ సరిహద్దుల్లో ఉన్న లావోస్ దేశ పట్టణం బొకియోలో బీర్ క్రేట్లతో వెళ్తున్న ట్రక్‌ను పోలీసులు ఆపడంతో ఈ డ్రగ్స్ వ్యవహారం బయటపడింది.
గోల్డెన్ ట్రయాంగిల్‌గా పిలిచే ఈ ప్రాంతం చాలాకాలంగా మాదక ద్రవ్యాల ఉత్పత్తికి పేరుమోసింది.
యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్(యూఎన్‌ఓడీసీ) ఆగ్నేయాసియా ప్రాంత ప్రతినిధి జెరెమీ డగ్లస్ దీనిపై 'బీబీసీ'తో మాట్లాడుతూ.. తూర్పు, ఆగ్నేయాసియాలో ఒకేసారి ఇంత భారీమొత్తంలో డ్రగ్స్ పట్టుకోవడం ఇదే తొలిసారన్నారు.
దీనికి వారం రోజుల ముందు కూడా ఇదే ప్రాంతంలో రెండు వేర్వేరుసార్లు పోలీసులు జరిపిన దాడుల్లో 1.6 కోట్ల యాంఫెటామైన్ టాబ్లెట్లు దొరికాయి.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటన్‌లో యాంఫెటామైన్ టాబ్లెట్‌లను 'క్లాస్ బీ', క్రిస్టల్ మెథాంఫెటామైన్‌ను 'క్లాస్ బీ' రకంగా పరిగణిస్తారు.
మియన్మార్‌లోని షాన్ రాష్ట్రంలో అశాంతి ఏర్పడిన తరువాత గత కొద్ది నెలలుగా గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలో డ్రగ్స్ ఉత్పత్తి, సరఫరా మరింత పెరిగింది.
చైనా, లావోస్, థాయిలాండ్‌లతో షాన్ రాష్ట్రానికి సరిహద్దు ఉంది.
షాన్ రాష్ట్రం నుంచి పొరుగు దేశాల్లోకి పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలు వస్తున్నాయని, షాన్ రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలకు దీనికి సంబంధం ఉందేమోనని అనుమానంగా ఉందని జెరెమీ డగ్లస్ అన్నారు.
కోవిడ్, భద్రత కారణాలతో చైనాలోని యునాన్ సరిహద్దు ప్రాంతంలో కట్టుదిట్టమైన కాపలా ఉండడంతో చైనాలోకి సరఫరా చేయలేక, ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి తూర్పున ఉన్న లావోస్, దక్షిణాన థాయిలాండ్‌లో పెద్దమొత్తంలో డ్రగ్స్ పంపిస్తున్నారని డగ్లస్ అన్నారు.
మాకేం సంబంధం లేదు: లావోస్ బ్రూవరీస్
లావో బ్రూవరీ బీర్ క్రేట్లలో మాదక ద్రవ్యాలను నింపి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.
అయితే, ఈ డ్రగ్స్‌కు తమకు సంబంధం లేదని లావోస్ బ్రూవరీ కంపెనీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
తమ సంస్థకు చెందిన క్రేట్లను అక్రమ కార్యకలాపాల కోసం దుర్వినియోగం చేయడం నిరాశపరిచిందని... తమ సామగ్రిని దుర్వినియోగం చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లావోస్ బ్రూవరీస్ కంపెనీ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- పునీత్ రాజ్‌కుమార్ మృతి... మాస్ సినిమాలతో ‘శాండల్‌వుడ్ ‘పవర్ స్టార్’గా ఎదిగిన కన్నడ నటుడు
- హుజూరాబాద్ ఎన్నిక రేపే... 306 పోలింగ్ కేంద్రాలు రెడీ
- పాకిస్తాన్‌కు సహాయం చేస్తే సౌదీ అరేబియాకు ఏంటి లాభం?
- ''మోదీ లేకున్నా బీజేపీ దశాబ్దాలపాటు ఉంటుంది. రాహుల్‌కు ఇది అర్ధం కావడం లేదు'' అని ప్రశాంత్ కిశోర్ ఎందుకన్నారు?
- పెగాసస్ వివాదం: ‘జాతీయ భద్రత అని కేంద్రం చెప్పినంత మాత్రాన మేం చూస్తూ కూర్చోం’ - సుప్రీం కోర్టు
- టీ20 వరల్డ్ కప్: భారత్‌పై పాకిస్తాన్ గెలుపు ఇస్లాం విజయం ఎలా అవుతుంది?
- చంబల్ లోయలో 400 మంది బందిపోట్లను సుబ్బారావు ఎలా లొంగదీశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








