పునీత్ రాజ్‌కుమార్ మృతి... మాస్ సినిమాలతో ‘శాండల్‌వుడ్ ‘పవర్ స్టార్’గా ఎదిగిన కన్నడ నటుడు

పునీత్ రాజ్‌కుమార్

ఫొటో సోర్స్, facebook/puneethRajkumar

ఫొటో క్యాప్షన్, పునీత్ రాజ్‌కుమార్

కన్నడ సినీరంగంలో పవర్ స్టార్‌గా పిలిచే పునీత్ రాజ్‌కుమార్ మరణించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఈ మేరకు వెల్లడించారు.

కన్నడ ప్రజలు అమితంగా ప్రేమించే సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఇక మన మధ్య లేరన్న విషయం తీవ్రంగా కలచివేస్తోంది అంటూ ఆయన ట్వీట్ చేశారు.

రాజ్ కుమార్ కుటుంబం, పునీత్ అభిమానులు ధైర్యంగా ఉండాలని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు. పునీత్ మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని బసవరాజ బొమ్మై అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

శుక్రవారం ఉదయం 11.30కి పునీత్‌కు తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేర్చారు.

46 ఏళ్ల పునీత్ ఇంట్లో జిమ్ చేస్తుండగా ఛాతీ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేర్చారు. అయితే, అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా మారిందని వైద్యులు చెప్పారు.

వీడియో క్యాప్షన్, కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం

''పునీత్‌ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఏమీ చెప్పలేం. ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఐసీయూలో చికిత్స అందిస్తున్నాం'' అని విక్రమ్ హాస్పిటల్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రంగనాథ్ నాయక్ చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ఆసుపత్రికి చేరుకుని ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.

పునీత్ సోదరుడు శివరాజ్ కుమార్ కూడా ఆసుపత్రిలోనే ఉన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

ఆసుపత్రికి చేరుకున్న అభిమానులు

తమ అభిమాన హీరో పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు విక్రమ్ ఆసుపత్రికి చేరుకున్నారు.

బెంగళూరులోని ఆ ఆసుపత్రి బయట రోడ్లన్నీ అభిమానులతో నిండిపోయాయి.

పవర్ స్టార్, అప్పూ అని అభిమానులు ఆయన్ను పిలుస్తారు. అప్పూ చనిపోయారంటే నమ్మలేకపోతున్నామనంటూ రోదిస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

సినీ,రాజకీయ, క్రీడా ప్రముఖుల సంతాపం

సినీరంగంతో పాటు ఇతర రంగాలకు చెందిన అనేక మంది సంతాపం తెలుపుతూ ట్వీట్‌లు చేస్తున్నారు.

భారతీయ చిత్ర పరిశ్రమలకు చెందిన వారు పునీత్ మరణం బాధాకరమంటూ ట్వీట్‌లు చేస్తున్నారు. ఆయనతో ఉన్న ఫొటోలను షేర్ చేస్తున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

''పునీత్ చిన్న వయసులోనే అందరినీ వీడి వెళ్లడం బాధాకరం'' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.

'పునీత్ మరణించారంటే నమ్మలేకపోతున్నాను.. ఇది నిజం కాకపోతే బాగుణ్ను'' అంటూ నటుడు మాధవన్ ట్వీట్ చేశారు.

''గుండె పగిలిపోతోంది. ఇంత తొందరగా వెళ్లిపోయావేంటి అప్పూ'' అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు.

నందమూరి బాలకృష్ణ, పవన్ కల్యాణ్, నాగార్జున, రాంచరణ్, రవితేజ, రామ్ పోతినేని సహా పలువురు తెలుగు హీరోలు, మలయాళ హీరో మమ్ముట్టి, మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్ ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు.

అభిషేక్ బచ్చన్, సోనూ సూద్, బోనీ కపూర్, సునీల్ శెట్టి, సంగీత దర్శకులు థమన్, దేవీశ్రీ ప్రసాద్.. హీరోయిన్లు అనుష్క, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, రష్మిక మంధన్న, తమన్నా, ఈషా రెబ్బ, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు సంతాపం తెలిపారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

పునీత్ మృతి చాలా బాధాకరమంటూ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశారు. పునీత్ మృతి భారతీయ సినిమాకు లోటని ఆయన తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్ప, వెంకటేశ్ ప్రసాద్ తదితర క్రికెటర్లు ట్విటర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

ప్రధాని నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు పునీత్ మృతికి సంతాపం తెలిపారు.

కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, తేజస్వి సూర్య, ఇతర నేతలు పునీత్ మృతికి సంతాపం తెలిపారు.

తండ్రి రాజ్‌కుమార్‌తో చిన్ననాటి పునీత్

ఫొటో సోర్స్, facebook/puneethrajkumar

ఫొటో క్యాప్షన్, తండ్రి రాజ్‌కుమార్‌తో చిన్ననాటి పునీత్

బాల నటుడిగా మొదలైన ప్రస్థానం..

కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్ తనయుడైన పునీత్ రాజ్‌కుమార్ బాల నటుడిగా కెరీర్ ప్రారంభించారు.

2002లో 'అప్పు' సినిమాతో హీరోగా మారారు. అక్కడి నుంచి కెరీర్‌లో ఆయన వెనుదిరిగి చూసుకోలేదు.

అరసు, వీరకన్నడిగ, జాకీ, పవర్ వంటి సినిమాలతో మాస్ హీరో‌గా క్రేజ్ సంపాదించుకున్నారు పునీత్ రాజ్‌కుమార్.

పునీత్ రాజ్‌కుమార్ అన్నయ్య డాక్టర్ శివరాజ్ కుమార్ కూడా కన్నడ చిత్రరంగంలో పేరున్న హీరో.

తండ్రి రాజ్‌కుమార్ కన్నడ కంఠీరవగా ప్రసిద్ధుడు. 2000 సంవత్సరంలో రాజ్‌కుమార్‌ను వీరప్పన్ అపహరించి 108 రోజుల పాటు బందీగా ఉంచి అనంతరం వదిలిపెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)