టీ20 వరల్డ్ కప్ సూపర్ 12: వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ విజయం

జాస్ బట్లర్

ఫొటో సోర్స్, Alex Davidson/getty images

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12‌లో భాగంగా శనివారం(అక్టోబర్ 23) జరిగిన రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ వెస్టిండీస్‌పై ఇంకా 70 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఇంగ్లండ్ 8.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ 21 పరుగులకు ఓపెనర్ జాసన్ రాయ్(11) వికెట్ కోల్పోయింది.

30 పరుగుల దగ్గర జానీ బెయిర్‌స్టో(9) రెండో వికెట్‌గా అవుట్ అయ్యాడు. తర్వాత ఇంగ్లండ్ మొయిన్ అలీ(3), లియామ్ లివింగ్‌స్టోన్(1) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

అకీల్ హసేన్ కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకోవడంతో లివింగ్ స్టోన్ కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. అతడు కొట్టిన షాట్‌ను హుసేన్ పక్కకు లాంగ్ డైవ్ చేసి పట్టాడు.

చివరకు వికెట్ కీపర్ జాస్ బట్లర్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మరో వికెట్ పడకుండా జట్టుకు విజయం అందించారు. జాస్ బట్లర్ ఇంగ్లండ్ జట్టులో అత్యధికంగా 24 పరుగులు చేశాడు.

వెస్టిండీస్ బౌలర్లలో అకీల్ హుసేన్ 2, రవి రాంపాల్ 1 వికెట్ పడగొట్టారు.

ఆదిల్ రషీద్

ఫొటో సోర్స్, Alex Davidson/getty images

ఫొటో క్యాప్షన్, 4 వికెట్లు తీసిన ఆదిల్ రషీద్

కుప్పకూలిన బ్యాటింగ్ ఆర్డర్

మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలడంతో వంద పరుగుల మైలురాయిని కూడా అందుకోలేకపోయింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

2.2 ఓవర్లలో కేవలం 2 పరుగులు ఇచ్చిన అదిల్ రషీద్ 4 వికెట్లు పడగొట్టాడు.

టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 14.2 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

వెస్టిండీస్ టాప్ ఆర్డర్ కుప్పకూలడంతోపాటూ వెంటవెంటనే వికెట్లు పడడం, సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్ కూడా 13 పరుగులకే అవుట్ కావడంతో జట్టు కోలుకోలేకపోయింది.

వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో క్రిసే గేల్ చేసిన 13 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం విశేషం. మిగతా అందరూ కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.

ఓపెనర్ లెండి సిమన్స్(3) అవుటైన నాలుగు బంతులకే మరో ఓపెనర్ ఎవిన్ లూయిస్(6) కూడా అవుట్ అయ్యాడు. దీంతో 9 పరుగులకే వెస్టిండీస్ ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 4
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 4

జట్టు స్కోర్ 27 పరుగుల దగ్గర షిమ్రాన్ హెట్‌మెయర్(9) అవుట్ అయ్యాడు. తర్వాత నాలుగు పరుగులకే క్రిస్ గేల్(13) కూడా పెలివియన్ చేరాడు.

తర్వాత వరసగా వికెట్లు పడుతూ ఉండడంతో వెస్టిండీస్ ఏ దశలోనూ కోలుగోలేకపోయింది.

8, 9, 11వ ఓవర్లలో డ్వేన్ బ్రావో(5), నికొలస్ పూరన్(1), 13వ ఓవర్లో పొల్లార్డ్(6) పెవిలియన్ చేరగా, ఒబెడ్ మెక్‌కాయ్(0) వరుస బంతుల్లో అవుట్ అయ్యారు.

చివరగా జట్టు స్కోర్ 55 పరుగుల దగ్గర రవి రాంపాల్(3) అదిల్ రషీద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

అకీల్ హుసేన్ 6 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఇంగ్లండ్ బౌలర్లలో అదిల్ రషీద్ 4 వికెట్లు తీయగా, మొయిన్ అలీ, టిమల్ మిల్స్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్‌కు చెరో వికెట్ లభించింది.

స్టీవ్ స్మిత్

ఫొటో సోర్స్, Dan Mullan/getty images

దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా విజయం

టీ20 సూపర్ 12 మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఆస్ట్రేలియా 19.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 5
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 5

119 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. రబాడా వేసిన రెండో ఓవర్ చివరి బంతికి ఓపెనర్ ఆరాన్ ఫించ్ అన్రిజ్ నార్‌ట్జేకు క్యాచ్ ఇచ్చాడు. పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు.

జట్టు స్కోర్ 20 పరుగులు దగ్గర ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(14) అవుట్ అయ్యాడు. ఈ వికెట్ కూడా రబాడా పడగొట్టాడు.

8వ ఓవర్లో మిచెల్ మార్ష్(11) అవుట్ అయ్యాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో మార్ష్ కొట్టిన షాట్‌ను డసెన్ గాల్లోకి ఎగిరి అందుకున్నాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 6
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 6

తర్వాత స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్ జట్టు స్కోరును 80 పరుగుల వరకూ తీసుకొచ్చారు. ఇద్దరూ వెంటవెంటనే అవుటవడంతో ఆస్ట్రేలియా చిక్కుల్లో పడింది.

3 ఫోర్లతో 37 పరుగులు చేసిన స్మిత్ అన్రిచ్ నార్‌ట్జే బౌలింగ్‌లో కొట్టిన షాట్‌ను మార్‌క్రామ్ ముందుకు డైవ్ చేసి అద్భుతంగా అందుకున్నాడు.

మూడు బంతుల తర్వాత తబ్రైజ్ షంశీ బౌలింగ్‌లో రివర్స్ షాట్‌కు ప్రయత్నించిన మాక్స్‌వెల్ కూడా బౌల్డ్ అయ్యాడు.

మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ తర్వాత మరో వికెట్ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు.

స్టోయినిస్ 16 బంతుల్లో 24 పరుగులు, వేడ్ 10 బంతుల్లో 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

దక్షిణాఫ్రికా బౌలర్లలో అన్రిచ్ నార్‌ట్జే 2 వికెట్లు పడగొట్టగా, రబాడా, కేశవ్ మహరాజ్, తబ్రయిజ్ షంసీకి తలో వికెట్ దక్కింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 7
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 7

అంతకు ముందు...

టాస్ గెలిచి ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.

కట్టుదిట్టంగా బౌలింగ్ చేసిన ఆసీస్ బౌలర్లు మొదటి నుంచి రెగ్యులర్‌గా వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా భారీ స్కోరు చేయలేకపోయింది.

ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 13 పరుగులకే ఓపెనర్, కెప్టెన్ టెంబా బవుమా వికెట్ కోల్పోయింది.

ఏడు బంతుల్లో రెండు ఫోర్లతో 12 పరుగులు చేసిన టెంబా గ్లెన్ మాక్స్‌వెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

అతడి స్థానంలో వచ్చిన రసీ వాన్‌డెర్ డుసెన్ ఆ తర్వాత ఓవర్లోనే అవుటయ్యాడు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 8
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 8

మరో ఓపెనర్ క్వింటన్ డికాక్(7) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. బ్యాట్‌కు తగిలిన బంతి గాల్లోకి లేచి మళ్లీ వికెట్ల మీద పడడంతో అతడు అవుట్ అయ్యాడు.

డుసెన్, డికాక్ ఇద్దరి వికెట్లను జాష్ హేజల్‌వుడ్ పడగొట్టాడు.

ఐడెన్ మార్‌క్రామ్ ఒకవైపు నిలబడి ఆసీస్ బౌలర్లను ఎదుర్కున్నప్పటికీ, అతడికి అండగా నిలిచేవారే కరువయ్యారు.

వరసగా అవుటైన హెన్రిచ్ క్లాసెన్(13), డేవిడ్ మిల్లర్(16), డ్వెయిన్ ప్రిటోరియస్(1), కేశవ్ మహరాజ్(0) క్రీజులో నిలబడి స్కోరును ముందుకు కలిదించడంలో విఫలమయ్యారు.

ఒకవైపు ఒంటరిపోరాటం చేసిన మార్‌క్రామ్ 40 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చాడు. 18వ ఓవర్లో అవుటైన అతడి ఇన్నింగ్స్‌లో 1 సిక్స్, 3 ఫోర్లున్నాయి.

చివర్లో కగిసో రబాడా స్కోరు పెంచే ప్రయత్నం చేశాడు. ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టిన అతడు 19 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అన్రిచ్ నార్ట్జే 2 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, జాష్ హేజల్‌వుడ్, ఆడం జంపా రెండేసి వికెట్లు పడగొట్టారు. గ్లెన్ మాక్స్‌వెల్, పాట్ కమ్మిన్స్ తలో వికెట్ తీశారు.

ఏయే గ్రూప్‌లో ఏ జట్లు ఉన్నాయి

క్వాలిఫయర్ మ్యాచ్‌లో గ్రూప్ Aలో టాప్‌లో నిలిచిన శ్రీలంక గ్రూప్-1లో ఉంటుంది. దానితోపాటూ ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, గ్రూప్ Bలో రెండో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ కూడా ఉంటాయి.

ఇక గ్రూప్-2లో భారత్, పాకిస్తాన్, న్యూజీలాండ్, అఫ్గానిస్తాన్, గ్రూప్ Bలో టాప్‌లో నిలిచిన స్కాట్లండ్, వీటితోపాటు గ్రూప్ Aలో రెండో స్థానంలో నిలిచిన నమీబియా కూడా ఉన్నాయి.

ఇప్పుడు టీ20 టోర్నీలో టాప్ టీమ్స్ మ్యాచ్‌లు మొదలయ్యాయి. ప్రతి గ్రూపులో టాప్‌కు చేరిన రెండు జట్లు సెమీ ఫైనల్లో స్థానం సంపాదిస్తాయి.

శ్రీలంక

ఫొటో సోర్స్, ICC

గ్రూప్-1

ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, బంగ్లాదేశ్

గ్రూప్-2

భారత్, పాకిస్తాన్, న్యూజీలాండ్, అఫ్గానిస్తాన్, నమీబియా, స్కాట్లండ్

వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Icc

ముఖ్యమైన మ్యాచ్‌లు

అక్టోబర్ 23

అక్టోబర్ 23న గ్రూప్-1లో రెండు కీలకమైన మ్యాచ్‌లు జరగబోతున్నాయి. అబుధాబిలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, దుబయిలో ఇంగ్లండ్, వెస్టిండీస్ తలపడతాయి.

అక్టోబర్ 24

గ్రూప్ 2 మ్యాచ్‌లు ఆదివారం మొదలవుతాయి.

అందరూ వేచిచూస్తున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ దుబయిలో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6(భారత్‌లో సాయంత్రం 7.30) గంటలకు మొదలవుతుంది.

అఫ్గానిస్తాన్ అక్టోబర్ 25న షార్జాలో స్కాట్లండ్‌ను ఢీకొంటుంది.

మరోవైపు అక్టోబర్ 26న షార్జాలో పాకిస్తాన్, న్యూజీలాండ్ మ్యాచ్ జరగనుంది

గ్రూప్ 1 మ్యాచ్‌లు నవంబర్ 6న ముగుస్తాయి. అదే రోజు అబుధాబిలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మ్యాచ్ జరుగుతుంది, ఇంగ్లండ్ దక్షిణాఫ్రికా తలపడతాయి.

గ్రూప్ 2 మ్యాచ్‌లు నవంబర్ 8న ముగుస్తాయి. అదే రోజు భారత్, నమీబియాను ఎదుర్కుంటుంది.

వరల్డ్ కప్

ఫొటో సోర్స్, Icc

నవంబర్ 10-11న సెమీఫైనల్ మ్యాచ్‌లు

మొదటి సెమీ ఫైనల్ నవంబర్ 10న సాయంత్రం 6 గంటలకు జరుగుతుంది. రెండో సెమీ ఫైనల్ నవంబర్ 11న దుబయిలో జరుగుతుంది.

రెండు సెమీ పైనల్స్ కోసం అదనపు రోజులను కూడా రిజర్వ్ చేశారు.

టీ20 వరల్డ్ కప్ ఫైనల్

టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ దుబయి ఇంటర్నేషనల్ స్టేడియంలో నవంబర్ 14న జరుగుతుంది.

పాయింట్స్ ఎలా లెక్కిస్తారు

మొదటి రౌండ్‌లాగే సూపర్-12 దశలో పాయింట్లు లెక్కిస్తారు. గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు లభిస్తాయి.

మ్యాచ్ టై అయినా, రద్దయినా, ఫలితం తేలకపోయినా రెండు జట్లకూ ఒక్కో పాయింట్ లభిస్తుంది.

ఓడినా, మ్యాచ్ నుంచి తప్పుకున్నా ఎలాంటి పాయింట్లు లభించవు.

జట్లు వాటి మ్యాచ్‌లు

గ్రూప్-1

ఇంగ్లండ్

ఫొటో సోర్స్, @ENGLANDCRICKET

ఇంగ్లండ్

అక్టోబర్ 23 వెస్టిండీస్‌తో

అక్టోబర్ 27 బంగ్లాదేశ్‌తో

అక్టోబర్ 30 ఆస్ట్రేలియాతో

అక్టోబర్ 01 శ్రీలంకతో

అక్టోబర్ 6 దక్షిణాఫ్రికాతో

ఆస్ట్రేలియా

ఫొటో సోర్స్, @CRICKETAUS

ఆస్ట్రేలియా

అక్టోబర్ 23 దక్షిణాఫ్రికాతో

అక్టోబర్ 28 శ్రీలంకతో

అక్టోబర్ 30 ఇంగ్లండ్‌తో

అక్టోబర్ 4 బంగ్లాదేశ్‌తో

అక్టోబర్ 6 వెస్టిండీస్‌తో

దక్షిణాఫ్రికా

అక్టోబర్ 23 ఆస్ట్రేలియాతో

అక్టోబర్ 26 వెస్టిండీస్‌తో

అక్టోబర్ 30 శ్రీలంకతో

నవంబర్ 02 బంగ్లాదేశ్‌తో

నవంబర్ 06 ఇంగ్లండ్‌తో

వెస్టిండీస్

ఫొటో సోర్స్, @WINDIESCRICKET

వెస్టిండీస్‌

అక్టోబర్ 23 ఇంగ్లండ్‌తో

అక్టోబర్ 26 దక్షిణాఫ్రికాతో

అక్టోబర్ 29 బంగ్లాదేశ్‌తో

నవంబర్ 04 శ్రీలంకతో

నవంబర్ 06 ఆస్ట్రేలియాతో

శ్రీలంక

ఫొటో సోర్స్, @OFFICIALSLC

శ్రీలంక

అక్టోబర్ 24 బంగ్లాదేశ్‌తో

అక్టోబర్ 28 ఆస్ట్రేలియాతో

అక్టోబర్ 30 దక్షిణాఫ్రికాతో

నవంబర్ 01 ఇంగ్లండ్‌తో

నవంబర్ 04 వెస్టిండీస్‌తో

బంగ్లాదేశ్

ఫొటో సోర్స్, ICC

బంగ్లాదేశ్

అక్టోబర్ 24 శ్రీలంకతో

అక్టోబర్ 27 ఇంగ్లండ్‌తో

అక్టోబర్ 29 వెస్టిండీస్‌తో

నవంబర్ 02 దక్షిణాఫ్రికాతో

నవంబర్ 04 ఆస్ట్రేలియాతో

గ్రూప్-2

విరాట్ కోహ్లీ

ఫొటో సోర్స్, MATTHEW LEWIS-ICC

భారత్

అక్టోబర్ 24 పాకిస్తాన్‌తో

అక్టోబర్ 31 న్యూజీలాండ్‌తో

నవంబర్ 3 అఫ్గానిస్తాన్‌తో

నవంబర్ 5 స్కాట్లాండ్‌తో

నవంబర్ 8 నమీబియాతో

పాకిస్తాన్

ఫొటో సోర్స్, Pcb

పాకిస్తాన్

అక్టోబర్ 24 భారత్‌తో

అక్టోబర్ 26 న్యూజీలాండ్‌తో

అక్టోబర్ 29 అఫ్గానిస్తాన్‌తో

నవంబర్ 02 నమీబియాతో

నవంబర్ 7 స్కాట్లాండ్‌తో

న్యూజీలాండ్

ఫొటో సోర్స్, @BLACKCAPS

న్యూజీలాండ్

అక్టోబర్ 26 పాకిస్తాన్‌తో

అక్టోబర్ 31 భారత్‌తో

నవంబర్ 03 స్కాట్లాండ్‌తో

నవంబర్ 05 నమీబియాతో

నవంబర్ 07 అఫ్గానిస్తాన్‌తో

అఫ్గానిస్తాన్

ఫొటో సోర్స్, @ACBOFFICIALS

అఫ్గానిస్తాన్

అక్టోబర్ 25 స్కాట్‌లాండ్‌తో

అక్టోబర్ 29 పాకిస్తాన్‌తో

అక్టోబర్ 31 నమీబియాతో

నవంబర్ 03 భారత్‌తో

నవంబర్ 07 న్యూజీలాండ్‌తో

స్కాట్లాండ్

ఫొటో సోర్స్, @CRICKETSCOTLAND

స్కాట్లాండ్

అక్టోబర్ 26 అఫ్గానిస్తాన్

అక్టోబర్ 28 నమీబియా

నవంబర్ 3 న్యూజీలాండ్

నవంబర్ 5 భారత్‌తో

నవంబర్ 7 పాకిస్తాన్‌తో

నమీబియా

ఫొటో సోర్స్, Icc

నమీబియా

అక్టోబర్ 28 స్కాట్లాండ్‌తో

అక్టోబర్ 30 అఫ్గానిస్తాన్‌తో

నవంబర్ 02 పాకిస్తాన్‌తో

నవంబర్ 05 న్యూజీలాండ్‌తో

నవంబర్ 08 భారత్‌తో

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)