నాసా లూసీ మిషన్: సౌర కుటుంబం మూల కణాలు గురు గ్రహం చుట్టూ తిరుగుతున్నాయా?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, జొనాథన్ అమోస్
- హోదా, సైన్స్ కరస్పాండెంట్
సౌర వ్యవస్థలోని శిలాజాల గుట్టు తెలుసుకునేందుకు కేప్ కెనావెరల్ నుంచి ఒక స్పేస్ క్రాఫ్ట్ పంపించారు.
'లూసీ' అనే ఈ స్సేస్‌క్రాఫ్ట్ గురు (జూపిటర్-బృహస్పతి) గ్రహం కక్ష్యలోకి చేరి అక్కడి రెండు గ్రహశకలాల సముదాయలను అధ్యయనం చేస్తుంది. ఇందులో ఒకటి.. సముదాయం భ్రమణ మార్గంలో గురు గ్రహానికి ముందు.. రెండోది వెనుక వైపు ఉంటాయి.
సౌర వ్యవస్థ ఏర్పాటు తొలి దశ పరిణామలను అర్థం చేసుకోవడానికి ఈ గ్రహ శకలాల అధ్యయనం తోడ్పడుతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి అట్లాస్-5 రాకెట్‌లో లూసీ స్పేస్‌క్రాఫ్ట్‌ను శనివారం గ్రీనిచ్ కాలమానం ప్రకారం 9.45గంటలకు పంపించారు.
ఈ మిషన్ కోసం పన్నెండేళ్ల కాలానికి గాను నాసా 98.1 కోట్ల డాలర్లు (సుమారు రూ. 7,360 కోట్లు) ఖర్చు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

ఫొటో సోర్స్, JASON KUFFER CC
ఆఫ్రికాలో లూసీ అనే మానవ శిలాజం ఒకటి ఉంది. మానవ జాతి ఉనికి గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది ఈ శిలాజమే.
దాన్ని స్ఫూర్తిగా తీసుకుని అదే పేరుతో నాసా ఈ మిషన్ చేపడుతోంది.
''ట్రోజన్ ఆస్టరాయిడ్స్ గురు గ్రహ కక్ష్యకు 60 డిగ్రీల కోణంలో తిరుగుతాయి'' అని కొలరాడోలోని సౌత్‌వెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన హాల్ లెవిసన్ చెప్పారు. లూసీ స్పేస్‌క్రాఫ్ట్ ప్రధాన అధ్యయనకర్తగా ఆయన వ్యవహరిస్తున్నారు.
''గురుడు, సూర్యుడి ఆకర్షణ శక్తి ప్రభావంతో ఈ గ్రహశకలాలు ఆ కక్షలో నిలకడగా తిరుగుతుంటాయి. సౌర వ్యవస్థ ఏర్పడిన తొలినాళ్లలో ఏదైనా వస్తువు అక్కడ పడితే.. అది ఎప్పటికీ అలా స్థిరంగా ఉండిపోతుంది. కాబట్టి గ్రహాలు వేటి నుంచి ఏర్పడ్డాయో వాటి శిలాజాలే ఈ శకలాలు'' అన్నారు హాల్ లెవిసన్.

ఫొటో సోర్స్, NASA/SWRI
ఒక నగరమంత పరిమాణంలో లేదా అంతకంటే భారీగా ఉండే శకలాల ఆకారం, నిర్మాణం, ఉపరితల పరిస్థితులు, వాటి ఏర్పాటుకు కారణమైన పదార్థాల సమ్మేళనం వంటి అనేక అంశాలను లూసీ అధ్యయనం చేస్తుంది.
గురు గ్రహానికి ఉన్న ఉపగ్రహాలలో ఉండే పదార్థాలతోనే ఈ శకలాలు ఏర్పడ్డాయా అనేదీ అధ్యయనం చేస్తుంది.
''ఉదాహరణకు మనం కైపర్ బెల్ట్‌గా పిలిచే వాటిలో ఉండే పదార్థాలతోనే ఇవి కూడా తయారైతే.. కైపర్ బెల్ట్‌లోనే ఇవి కూడా తయారై తరువాత కక్షలోకి చేరాయని అనుకోవాల్సి ఉంటుంది'' అని సౌత్ వెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ మిషన్ శాస్త్రవేత్త డాక్టర్ కార్లీ హోవెట్ చెప్పారు.
కొన్ని అసాధారణ నావిగేషన్ లెక్కల ఫలితమే ఈ మిషన్ అని చెప్పారు కార్లీ.
లూసీ మొత్తం 600 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించనుంది. ట్రోజాన్ల సముదాయాన్ని ఇది 2027/28లో అధ్యయనం చేయనుంది. అనంతరం గురుగ్రహం రెండో వైపు గల శకలాల సముదాయాన్ని 2033లో చేరుతుంది.

లూసీ ఎప్పుడు ఎక్కడికి చేరుతుందంటే..
భ్రమణ మార్గంలో గురు గ్రహానికి ముందు వైపు ఉండే సమూహం:
* యూరీబేట్స్, క్వెటా(సహజ ఉపగ్రహం) - ఆగస్టు 2027
* పాలిమెలె - సెప్టెంబర్ 2027
* లూకస్ - ఏప్రిల్ 2028
* ఓరస్ - నవంబర్ 2028
భ్రమణ మార్గంలో గురుడు వెనుక ఉండే సమూహం:
* పాట్రోక్లస్, మెనోసియస్ - మార్చ్ 2033
మెయిన్ బెల్ట్ ఆస్టరాయిడ్స్:
* డోనల్డ్ జాన్సన్ - ఏప్రిల్ 2025
ఇవి కూడా చదవండి:
- ప్రపంచ ఆహార దినోత్సవం: ఆహార పదార్థాల ధరలు ప్రపంచవ్యాప్తంగా ఎందుకు పెరుగుతున్నాయి?
- సెక్సువల్ అటానమీ: భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉంటాయా? సెక్స్ భంగిమల కోసం బలవంతం చేయవచ్చా?
- 'హనీమూన్ సమయంలో మేం మంటల్లో తగలబడుతున్న ఇంట్లో, బొద్దింకల మధ్య గడపాల్సి వచ్చింది’
- అమృత్‌సర్‌లో హనుమంతుడు, పారిస్‌లో లిటిల్ అమల్ - ఈ వారం ప్రపంచవార్తలు అందమైన చిత్రాల్లో
- దసరా స్పెషల్: అమలాపురం వీధుల్లో కత్తులు, కర్రల ప్రదర్శన... ఈ ఆచారం ఏనాటిది, ఎలా వచ్చింది?
- ఐపీఎల్ 2021 విన్నర్ సీఎస్కే: కోల్‌కతాను ఓడించి నాలుగోసారి టైటిల్ గెలిచిన చెన్నై
- చైనా, భూటాన్ ఒప్పందంతో భారత్‌కు టెన్షన్ తప్పదా... 'చికెన్స్ నెక్' మీద డ్రాగన్ కన్ను పడిందా?
- హెరాయిన్ కేసు: మూడు దేశాలపై అదానీ కీలక నిర్ణయం.. మండిపడుతున్న ఇరాన్
- 175 ఏళ్ల కిందట అనెస్థీషియా ఎలా పుట్టింది? పూర్వకాలంలో మత్తు మందు లేకుండా ఆపరేషన్లు ఎలా చేసేవాళ్లు? తొలినాళ్లలో వాడిన 4 మత్తు మందులు, వాటి సైడ్ ఎఫెక్ట్స్
- భారతదేశం బొగ్గు కథ: 31,900 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలున్న దేశంలో సంక్షోభం ఎందుకొచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)












