అమృత్‌సర్‌లో హనుమంతుడు, పారిస్‌లో లిటిల్ అమల్ - ఈ వారం ప్రపంచవార్తలు అందమైన చిత్రాల్లో

దసరా నవరాత్రుల సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో హనుమంతుడి వేషధారణలో వచ్చిన భక్తులు. ఇజ్రాయెల్‌లోని నెజేవ్ ఎడారిలో ఉన్న రామోన్ బిలంలో స్పేస్ సూట్‌లతో నడుస్తున్న ఇద్దరు ఆస్ట్రోనాట్‌లు. మరెన్నో అరుదైన చిత్రాల సమాహారం.

దసరా నవరాత్రుల సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో హనుమంతుడి వేషధారణలో వచ్చిన భక్తులు.

ఫొటో సోర్స్, Narinder Nanu / AFP

ఫొటో క్యాప్షన్, దసరా నవరాత్రుల సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో హనుమంతుడి వేషధారణలో వచ్చిన భక్తులు.
యూకే కన్జర్వేటివ్ ఎంపీ సర్ డేవిడ్ అమెస్ కత్తిపోట్లకు గురై మరణించిన చర్చి వద్ద పోలీసులు. ఆయన హత్య తరువాత ఒక అనుమానితుడిని అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, John Keeble / Getty Images

ఫొటో క్యాప్షన్, యూకే కన్జర్వేటివ్ ఎంపీ సర్ డేవిడ్ అమెస్ కత్తిపోట్లకు గురై మరణించిన చర్చి వద్ద పోలీసులు. ఆయన హత్య తరువాత ఒక అనుమానితుడిని అరెస్ట్ చేశారు.
ఇజ్రాయెల్‌లోని నెజేవ్ ఎడారిలో ఉన్న రామోన్ బిలంలో స్పేస్ సూట్‌లతో నడుస్తున్న ఇద్దరు ఆస్ట్రోనాట్‌లు

ఫొటో సోర్స్, Jack Guez / AFP

ఫొటో క్యాప్షన్, ఇజ్రాయెల్‌లోని నెజేవ్ ఎడారిలో ఉన్న రామోన్ బిలంలో స్పేస్ సూట్‌లతో నడుస్తున్న ఇద్దరు ఆస్ట్రోనాట్‌లు. భవిష్యత్‌లో అంగారకుడిపై దిగేందుకు ఉపయోగపడేలా సన్నాహకాలు ఇక్కడ చేపడుతున్నారు. ఆస్ట్రియన్ స్పేస్ ఫోరం, ఇజ్రాయెల్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా మూడు వారాల పాటు ఈ మిషన్ చేపడుతోంది. 2021 అక్టోబరు 10 నాటి చిత్రం.
స్టార్ ట్రెక్ నటుడు విలియం షాట్నర్ అంతరిక్షంలోకి వెళ్లిన అత్యంత పెద్ద వయసు వ్యక్తిగా 2021 అక్టోబర్ 13న రికార్డు సృష్టించారు.

ఫొటో సోర్స్, Blue Origin / Reuters

ఫొటో క్యాప్షన్, స్టార్ ట్రెక్ నటుడు విలియం షాట్నర్ అంతరిక్షంలోకి వెళ్లిన అత్యంత పెద్ద వయసు వ్యక్తిగా 2021 అక్టోబర్ 13న రికార్డు సృష్టించారు. 90 ఏళ్ల ఆయన అమెజాన్.కామ్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజన్ రాకెట్‌లో రోదసిలోకి వెళ్లి 10 నిమిషాలు ఉన్నారు. ఈ రాకెట్ భూమి నుంచి 100 కిలోమీటర్ల దూరం వెళ్లింది. తిరిగి టెక్సాస్‌లో వాన్ హార్న్ ఎడారి సమీపంలో దిగారు.
రాయల్ బ్రిటిష్ దళం శతాబ్ది ఉత్సవాల కోసం లండన్‌లోని వెస్ట్ మినిష్టర్స్ అబేకు వచ్చిన రాణి ఎలిజబెత్-II. ఊతకర్ర సాయంతో వచ్చిన రాణి నవ్వుతూ నడవడాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు.

ఫొటో సోర్స్, Frank Augstein / AFP

ఫొటో క్యాప్షన్, రాయల్ బ్రిటిష్ దళం శతాబ్ది ఉత్సవాల కోసం లండన్‌లోని వెస్ట్ మినిష్టర్స్ అబేకు వచ్చిన రాణి ఎలిజబెత్-II. ఊతకర్ర సాయంతో వచ్చిన రాణి నవ్వుతూ నడవడాన్ని ఈ చిత్రంలో చూడొచ్చు.
వాతావరణ మార్పులపై నిర్వహించే COP26 సమావేశాలు నిర్వహించే గ్లాస్గోలోని వేదిక ఎదురుగా కుడ్య చిత్రం వేస్తున్న చిత్రకారుడు.

ఫొటో సోర్స్, Andy Buchanan / AFP

ఫొటో క్యాప్షన్, వాతావరణ మార్పులపై నిర్వహించే COP26 సమావేశాలు నిర్వహించే గ్లాస్గోలోని వేదిక ఎదురుగా కుడ్య చిత్రం వేస్తున్న చిత్రకారుడు.
ఫ్రాన్స్‌లోనిబోర్డాక్స్‌లో ఉన్న సెయింట్ ఆండ్రూ కెథడ్రల్‌లో ప్రదర్శించిన కళాఖండాల రక్షణ కోసం నిర్వహించిన డ్రిల్‌లో అగ్నిమాపక సిబ్బంది ఓ భారీ చిత్రంపై దుప్పటి కప్పుతున్నారు.

ఫొటో సోర్స్, Philippe Lopez / AFP

ఫొటో క్యాప్షన్, ఫ్రాన్స్‌లోనిబోర్డాక్స్‌లో ఉన్న సెయింట్ ఆండ్రూ కెథడ్రల్‌లో ప్రదర్శించిన కళాఖండాల రక్షణ కోసం నిర్వహించిన డ్రిల్‌లో అగ్నిమాపక సిబ్బంది ఓ భారీ చిత్రంపై దుప్పటి కప్పుతున్నారు.
చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్‌ ఝావోఝువాంగ్ నగరంలోని రంగురంగులతో మెరిసిపోతున్న వంపుల దారిలో సాగిపోతున్న పర్యాటకులు.

ఫొటో సోర్స్, Song Haicun / Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాలోని షాండాంగ్ ప్రావిన్స్‌ ఝావోఝువాంగ్ నగరంలోని రంగురంగులతో మెరిసిపోతున్న వంపుల దారిలో సాగిపోతున్న పర్యాటకులు.
మాస్కోలోని ఆల్ రష్యా ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఉన్న ఫౌంటెయిన్ శుభ్రం చేస్తున్న కార్మికుడు. ఆల్ రష్యా ఎగ్జిబిషన్ సెంటర్‌లో అనేక స్మారక మండపాలు, శిల్పాలు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Kirill Kudryavtsev / AFP

ఫొటో క్యాప్షన్, మాస్కోలోని ఆల్ రష్యా ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఉన్న ఫౌంటెయిన్ శుభ్రం చేస్తున్న కార్మికుడు. ఆల్ రష్యా ఎగ్జిబిషన్ సెంటర్‌లో అనేక స్మారక మండపాలు, శిల్పాలు ఉన్నాయి.
సిరియా శరణార్థి బాలికను గుర్తుతెచ్చేలా రూపొందించిన భారీ తోలుబొమ్మ లిటిల్ అమల్ ఇది

ఫొటో సోర్స్, Thomas Samson / AFP

ఫొటో క్యాప్షన్, సిరియా శరణార్థి బాలికను గుర్తుతెచ్చేలా రూపొందించిన భారీ తోలుబొమ్మ లిటిల్ అమల్ ఇది. పారిస్‌లోని డి లా రిపబ్లిక్ ప్రాంతం మీదుగా దీన్ని తీసుకెళ్తుండగా అక్టోబరు 14న తీసిన చిత్రం. శరణార్థి బాలలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అవగాహన కల్పించే క్రమంలో ది హ్యాండ్ స్ప్రింగ్ పప్పెట్ కంపెనీ దీన్ని తయారు చేసింది. యూరప్‌లో వివిధ దేశాల మీదుగా 8 వేల కిలోమీటర్లు ప్రయాణించి లండన్ చేరనుంది ఈ బొమ్మ.