నాసా: అంతరిక్ష చరిత్రలో తొలిసారిగా ఇద్దరు మహిళా వ్యోమగాముల స్పేస్ వాక్

ఫొటో సోర్స్, Science Photo Library
నాసా మహిళా వ్యోమగాములు క్రిస్టీనా కోచ్, జెస్సికా మెయిర్ లు ఒకేసారి స్పేస్‌వాక్‌ను పూర్తి చేసి కొత్త చరిత్రను సృష్టించారు. అంతరిక్ష చరిత్రకు సంబంధించి ఇద్దరు మహిళలు ఒకేసారి స్పేస్ వాక్ చేయడం ఇదే తొలిసారి.
ఈ ఇద్దరు విద్యుత్ నియంత్రణ యూనిట్‌కు మరమ్మత్తు చేయడానికి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) బయట ఏడు గంటలపాటు గడిపారు.
క్రిస్టీనా కోచ్ ఇప్పటికే నాలుగు సార్లు స్పేస్ వాక్ చేయగా, జెస్సికా మెయిర్‌కు ఇదే తొలిసారి. అంతరిక్షంలో నడిచిన 15 వ మహిళగా జెస్సికా నిలిచారని నాసా వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వీడియో కాల్ చేసి వారిని అభినందించారు. ''మీరు చాలా ధైర్యవంతులు, తెలివైన మహిళలు'' అని వారు స్పేస్ వాక్ చేస్తున్నప్పుడు ట్రంప్ ప్రశంసించారు.

ఫొటో సోర్స్, NASA
ఎలక్ట్రికల్ ఇంజినీర్ అయిన క్రిస్టీనా కోచ్, మెరైన్ బయాలజీలో డాక్టరేట్ పొందిన జెస్సికా శుక్రవారం నాసా స్పేస్‌యూనిట్స్ నుంచి భారత కాలమానం ప్రకారం గం 5.08 లకు బయట అడుగు పెట్టారు. బ్యాటరీ ఛార్జ్-డిశ్చార్జ్ యూనిట్ (బీసీడీయూ)ను ఏర్పాటు చేసేందుకు పోర్ట్ 6 ట్రస్ స్ట్రక్చర్ అనే ప్రదేశానికి వెళ్లారు. పనిచేయని భాగాలను తమతో పాటు తిరిగి ఐఎస్ఎస్‌కు తీసుకెళ్లారు.
ఈ ఘటన 'చారిత్రాత్మకం కంటే ఎక్కువ' అని డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ట్వీట్ చేశారు.
'ఆల్ ఫిమేల్ స్పేస్ వాక్'లో భాగంగా అన్నే మెక్‌క్లైన్‌తో కలిసి క్రిస్టీనా కోచ్ ''ఎక్స్‌ట్రా-వెహికల్ యాక్టివిటీ'' (ఈవీఏ) లో పాల్గొంటారని మార్చిలో నాసా ప్రకటించింది.
అయితే, మెక్‌క్లెయిన్‌కు సరిపోయే స్పేస్ సూట్ అందుబాటులో లేకపోవడంతో ఆమె స్పేస్‌వాక్‌లో పాల్గొనలేకపోయారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అంతరిక్షంలో నడిచిన తొలి మహిళగా రష్మాకు చెందిన స్వెత్లానా సవిట్సికయా రికార్డు సృష్టించారు.
యుఎస్ఎస్ఆర్ అంతరిక్ష కేంద్రం సలియుట్- 7 నుంచి 1984 జులై 25న బయటకు వచ్చిన ఆమె దాదాపు మూడు గంటల 35 నిమిషాల పాటు స్పేస్ వాక్ చేశారు.
అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తి సోవియట్ వ్యోమగామి అలెక్సీ లియోనోవ్. ఆయన ఇటీవల మరణించారు.
చంద్రునిపైకి వెళ్లే వ్యోమగాములు ధరించే సరి కొత్త స్పేస్‌సూట్ నమూనాను మంగళవారం నాసా ఆవిష్కరించింది.
ఈ సూట్‌ను ఎక్స్‌ప్లోరేషన్ ఎక్స్‌ట్రావెహిక్యులర్ మొబిలిటీ యూనిట్‌గా పిలుస్తారు. ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉపయోగించే స్పేస్‌సూట్ లాగానే కనిపిస్తోంది.
అయితే, చంద్రుడి మీద కదలటానికి అనువుగా సౌకర్యవంతంగా ఉండేలా దీనిని మెరుగుపరచినట్లు నాసా పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
- అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...
- అపోలో మిషన్: చంద్రుని మీద మానవుడి తొలి అడుగుకు స్వర్ణోత్సవం
- చంద్రునిపై కాలుమోపి 50 ఏళ్లు... మానవ జీవితంలో వచ్చిన 8 మార్పులు
- చంద్రుడిపై కాలు పెట్టి 50 ఏళ్లు: అప్పట్నుంచి ఇప్పటి వరకూ చంద్రుడి మీదకు ఏ ఒక్క దేశం మనుషులను పంపించలేదు. ఎందుకు?
- నింజా టెక్నిక్: వ్యాసం రాయమంటే 'ఖాళీ' పేపర్ ఇచ్చిన అమ్మాయికి అత్యధిక మార్కులు.. ఎలా?
- #100WOMEN: కృత్రిమ గర్భసంచితో నెలలు నిండని శిశువులకు ప్రాణదానం
- జపాన్ ఎందుకంత క్లీన్‌గా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- సౌరవ్ గంగూలీ: ‘టీం ఇండియా దశ, దిశ మార్చా.. నన్నే టీంలోంచి తీసేశారు’ - BBC exclusive
- కంట్లో ప్రతిబింబించిన చిత్రంతో పాప్‌సింగర్ ఇల్లు కనిపెట్టి వేధించిన యువకుడు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








