అపోలో11: ‘50 ఏళ్ల కిందట చంద్రుడిపై నడిచాను.. ఇప్పుడు రాత్రుళ్లు జాబిలిని చూస్తుంటే ఆ రోజులు గుర్తొస్తుంటాయి’

ఫొటో సోర్స్, Getty Images
చంద్రుడిపై మనిషి అడుగుపెట్టి 50 ఏళ్లైన సందర్భంగా వేలాది మంది ఈ విజయాన్ని వేడుకగా జరుపుకొంటున్నారు.
20 జులై 1969లో అపోలో 11 వ్యోమనౌక ద్వారా అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తొలిసారిగా భూమి సహజ ఉపగ్రహంపై అడుగుపెట్టారు.
నాడు సోవియట్ యూనియన్, అమెరికాల మధ్య జరుగుతున్న అంతరిక్షపోరులో ఈ ఘటనతో అమెరికా ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.
ఇప్పుడు ప్రపంచమంతా చంద్రుడిపై మానవసహిత యాత్రను గుర్తుచేసుకుంటున్నారు.

ఫొటో సోర్స్, AFP
మానవాళికి పెద్ద అడుగు
నాడు చంద్రుడిపై మానవుడు అడుగుపెట్టిన దృశ్యాన్ని ఇప్పుటితరం చూసేలా ఆన్‌లైన్‌లో నాసా ప్రసారం చేసి 50 ఏళ్ల వేడుకను ప్రారంభించింది.
50 ఏళ్ల కిందట ఈ ఘటనను ప్రపంచమంతా 50 కోట్ల మంది ప్రజలు వీక్షించారు.
అపోలో 11 చంద్రుడిపై దిగగానే, ఆర్మ్‌స్ట్రాంగ్... ''హ్యూస్టన్, మేం ట్రాంగ్విలిటీ బేస్ (చంద్రుడిపై దిగిన ప్రాంతం) దగ్గర ఉన్నాం'' అని పేర్కొన్నారు.
కొన్ని గంటల తర్వాత ఆర్మ్ స్ట్రాంగ్ వ్యోమనౌక నుంచి చంద్రుడిపై అడుగుపెడుతూ ''ఈ చిన్న అడుగు భవిష్యత్తులో
మానవాళికి పెద్ద అడుగు'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, PA Media
ఈ మిషన్‌లో ఆర్మ్ స్ట్రాంగ్‌తో పాటు బజ్ అల్డ్రిన్, మైఖల్ కొలిన్స్ పాల్గొన్నారు. వీరందరూ 1930లలో పుట్టినవారే. అల్డ్రిన్, కొలిన్స్ ఇప్పటికీ బతికే ఉన్నారు. ఆర్మ్‌స్ట్రాంగ్ 82వ ఏట 2012లో మరణించారు.
చంద్రుడుపై అడుగుపెట్టిన రెండో వ్యక్తి అల్డ్రిన్ శనివారం ట్వీట్ చేస్తూ,''మేం ముగ్గురం తొలిసారిగా చంద్రుడిపైకి వెళ్లాం. ఆ ఘటనను 25 కోట్ల మంది అమెరికన్లు చూశారు. వాస్తవానికి ఈ మిషన్ అందరిది. చంద్రుడుపై అడుగుపెట్టాలని కలగనే అమెరికా భవిష్యత్తు ప్రజానికానిది కూడా'' అని పేర్కొన్నారు.
మైఖల్ కొలిన్స్ కూడా ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ, ''ఇది తరచూగా చేసే యాత్ర కాదు'' అని చెప్పారు.
''మంచి జీవితాన్ని కొనసాగిస్తున్నా. రాత్రిళ్లు మా వీధుల్లో నడుచుకుంటూ వెళుతున్నా. పైకి చూస్తుంటే ఆకాశంలో వెండి రంగుల్లో ఓ మెరుపు కనిపిస్తుంది. ఓహ్, అది చంద్రుడు కదూ అని అనుకుంటాను'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ప్రపంచమంతా ఎలా జరుపుకుంటుంది
హ్యూస్టన్‌లోని నాసా కార్యాలయంతో పాటు ప్రపంచంలోని చాలా పట్టణాల్లో చంద్రుడిపై మానవసహిత యాత్ర ఘటనను వేడుకగా జరుపుకుంటున్నారు.
వాషింగ్టన్ డీసీలోని నేషనల్ ఏయిర్ అండ్ స్పేస్ మ్యూజియంలో ఆర్మ్‌స్ట్రాంగ్ స్పేస్‌సూట్‌ను ప్రదర్శనకు పెట్టారు.
సీయోటల్‌లోని మ్యూజియంలో చంద్రుడిపై మానవసహిత యాత్ర వీడియోను అప్పటికాలం టీవీలో ప్రదర్శించింది.
చంద్రుడి ఫొటోలతో పారిస్‌లో ఒక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ ప్రదర్శన వచ్చే సోమవారం వరకు ఉండనుంది. ఈ ప్రదర్శనలో ఉన్న భారీ చంద్రుడి నమూనా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో కొందరు కళాకారులు రూపొందించిన భారీ చంద్రుడి నమూనాను ఒక బిల్డింగ్‌పై ప్రదర్శనకు పెట్టారు.

ఫొటో సోర్స్, EPA
చంద్రుడిపై మానవసహిత యాత్రకు 50 ఏళ్లు పూర్తైన సందర్భంలో అనుకోకుండా ఇటీవల మరో సంఘటన కూడా జరిగింది.
రష్యాకు చెందిన వ్యోమనౌక బికనూర్ నుంచి అమెరికా వ్యోమగామిని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లింది.
ఈ విషయంపై రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ ట్వీట్ చేసింది. తమ వ్యోమ నౌక క్షేమంగా అంతరిక్షంలో దిగిందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








