టాయ్‌లెట్‌కి వెళ్లి మూత్రం పోస్తున్న ఆవులు..

ఫొటో సోర్స్, FBN
ఆవులు మరుగుదొడ్డి వాడటం నేర్చుకున్నాయి. మూత్రం పోసేందుకు టాయ్‌లెట్‌కి వెళ్తున్నాయి. జర్మనీ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో భాగంగా ఆవులు మరుగుదొడ్డికి వెళ్లడం ప్రారంభించాయి.
ఆవులకు టాయ్‌లెట్ శిక్షణనివ్వడంతో, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించవచ్చని ఈ పరిశోధకులు తెలిపారు.
జంతువులకు నిర్దేశించిన మరుగుదొడ్డిని ఉపయోగించేలా జర్మనీలో జరిపిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు శిక్షణ ఇచ్చారు.
ఆవుల మూత్రం నుంచి వచ్చే అమ్మోనియా మట్టితో కలిసినప్పుడు గ్రీన్‌హౌస్ వాయువు నైట్రస్ ఆక్సైడ్‌గా మారుతుంది.
ప్రపంచవ్యాప్తంగా మానవ కార్యకలాపాలకు సంబంధించి గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో 10శాతం పశువుల నుంచే వస్తుంది.
రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫార్మ్ యానిమల్ బయాలజీకి చెందిన ఫార్మ్‌లో పరిశోధకులు 16 ఆవులకు టాయ్‌లెట్‌ను ఉపయోగించడం నేర్పించారు. ఈ టాయ్‌లెట్స్‌కు "మూలూ" అని పేరు పెట్టారు.
తొలుత జంతువులను మూలూ దొడ్డిలో ఉంచారు. అక్కడ మూత్ర విసర్జన చేసిన ప్రతిసారీ వాటికి ఆహారం బహుమతిగా ఇచ్చారు.
తర్వాత, వారు మూలూ పక్కన ఉన్న ప్రాంతంలో ఆవులను ఉంచారు. మరుగుదొడ్డిలోకి వెళ్లి మూత్ర విసర్జన చేసినందుకు ఆహారాన్ని మళ్లీ బహుమతిగా అందజేశారు.
మూలూ వెలుపల మూత్ర విసర్జన చేసిన ఆవులకు శిక్షగా మూడు సెకన్ల పాటు వాటిపై నీటిని చల్లారు.
శిక్షణ మూడవ దశలో భాగంగా, టాయిలెట్ నుంచి దూరాన్ని పెంచారు. రివార్డులు, శిక్షలు కొనసాగించారు.

ఫొటో సోర్స్, FBN
10 శిక్షణా సెషన్‌లు ముగిసే సమయానికి, 11 ఆవులు విజయవంతంగా మరుగుదొడ్డిని ఉపయోగించడంలో శిక్షణ పొందినట్లు పరిశోధకులు గుర్తించారు.
"చాలా త్వరగా, సగటున 15 నుంచి 20 మూత్ర విసర్జనలు చేయడానికి కంటే ముందే, ఆవులు టాయ్‌లెట్‌లోకి వెళ్లడాన్ని ప్రారంభించాయి" అని అధ్యయనంలో పాల్గొన్న లిండ్సే మాథ్యూస్ రేడియో న్యూజిలాండ్‌తో అన్నారు.
"చివరికి, మూడో వంతు జంతువులు, మూడొంతుల మూత్ర విసర్జనను మరుగుదొడ్డిలో మాత్రమే చేస్తున్నాయి" అని ఆయన చెప్పారు.
"లేగ దూడలైతే.. పిల్లలతో సమానంగానూ, చాలా చిన్న పిల్లల కంటే మెరుగ్గాను పని తీరు కనబర్చాయి" అని అధ్యయనం తెలిపింది.
మూలూ వంటి మోడల్‌లో, 80శాతం పశువుల మూత్రాన్ని గ్రహించడం వలన అమ్మోనియా ఉద్గారాలు 56శాతం తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
జంతువులు నివాస ముండే ప్రదేశాల్లో మూత్ర స్థాయిలను తగ్గించడం వల్ల వాటి పరిశుభ్రత, సంక్షేమం మెరుగుపడుతుందని కూడా వారు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్‌లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- ధోనీ ఎవరికీ భయపడడు ఎందుకు?
- అఫ్గాన్ మహిళలు రంగురంగుల దుస్తులు వేసుకుని ఆ ఫొటోలు షేర్ చేస్తున్నారెందుకు
- 'లవ్ జిహాద్ లాగే నార్కోటిక్ జిహాద్' అంటూ కేరళ బిషప్ చేసిన వ్యాఖ్యలపై వివాదం
- 'జాక్ మా' లాంటి పారిశ్రామిక దిగ్గజాలను చైనా ఎందుకు ‘ఇబ్బంది పెడుతోంది’
- వాయు కాలుష్యం నుంచి ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- ఐపీఎల్ కోసమే INDvsENG ఐదో టెస్టు రద్దు చేశారా? ఈ ప్రశ్నకు బీసీసీఐ ఛీఫ్ సౌరవ్ గంగూలీ సమాధానం ఏంటి?
- మొగిలయ్య పాడిన భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ అసలు పాట ఏంటి? కిన్నెర చరిత్ర ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: 'సినిమా వ్యాపారం మాది, ప్రభుత్వం టికెట్లు అమ్ముకుంటే ఎలా?' - కొత్త జీవోపై కలకలం
- సినిమా టికెట్లపై కీలక నిర్ణయం తీసుకున్న జగన్ ప్రభుత్వం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)















