‘డోంట్ టచ్ మై క్లోత్స్’: అఫ్గాన్ మహిళలు రంగురంగుల దుస్తులు వేసుకుని ఆ ఫొటోలు ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారెందుకు

ఫొటో సోర్స్, DR BAHAR JALALI
విశ్వవిద్యాలయాల్లో మహిళా విద్యార్థులకు డ్రెస్ కోడ్‌ను తాలిబాన్లు తప్పనిసరి చేయడాన్ని నిరసిస్తూ అఫ్గానిస్తాన్ మహిళలు ఆన్‌లైన్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
'డు నాట్ టచ్ మై క్లోత్స్', 'అఫ్గానిస్తాన్ కల్చర్' హ్యాష్‌ట్యాగ్‌లతో అందమైన, రంగురంగుల సంప్రదాయ వస్త్రాలను ధరించిన తమ ఫోటోలను ఆన్‌లైన్‌లో షేర్ చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాల్లో ఈ ఉద్యమాన్ని ప్రారంభించిన డాక్టర్ బహర్ జలాలీతో బీబీసీ ప్రతినిధి సోడాబా హైదరి మాట్లాడారు.
''అఫ్గానిస్తాన్ ట్రెడిషనల్ క్లోత్స్'' అని గూగుల్‌లో టైప్ చేయగానే కనిపించే విభిన్న రంగులతో కూడిన అందమైన డ్రెస్‌లను చూసి మీరు ఆశ్చర్యపోతారు. ఎంబ్రాయిడరీ, భారీ డిజైన్లు, జాగ్రత్తగా అమర్చిన చిన్నచిన్న అద్దాలతో ప్రతి డ్రెస్ ప్రత్యేకంగా ఉంటుంది.
అఫ్గాన్ జాతీయ నృత్యం 'అట్టాన్' చేసేటప్పుడు కుచ్చులతో కూడిన పొడవైన స్కర్ట్‌లు మరింత అందంగా కనిపిస్తాయి. అక్కడ కొంతమంది మహిళలు హెవీ ఎంబ్రాయిడరీ టోపీలను, మరికొందరు అందమైన డిజైన్లతో కూడిన కిరీటం లాంటి అలంకరణలను తలపై ధరిస్తారు. అఫ్గానిస్తాన్‌లోని ఒక్కో ప్రాంతానికి చెందిన మహిళలకు ఒక్కో రకమైన అలంకరణ సంప్రదాయాలు ఉంటాయి.
గత 20 ఏళ్లలో అఫ్గాన్ మహిళలు యూనివర్సిటీలకు, కార్యాలయాలకు వెళ్లేటప్పుడు సంప్రదాయ వస్త్రాల్లాగే కనిపించేవి, కాస్త పొట్టిగా ఉండే డ్రెస్‌లను కూడా వేసుకున్నారు. ఎప్పుడూ ట్రౌజర్లే కాకుండా కొన్నిసార్లు జీన్స్ ధరించేవారు. భుజాలపై వేసుకునే స్కార్ఫ్‌లను స్టైలిష్‌గా తలకు చుట్టుకునేవారు.

ఫొటో సోర్స్, EPA
కానీ వారాంతంలో 'తాలిబాన్ ఆర్డర్'కు మద్దతుగా కాబుల్‌లో జరిగిన తాలిబాన్ అనుకూల ర్యాలీలో మహిళలంతా పొడవైన నల్లటి బుర్ఖాలు ధరించారు. వారి మొహాలు, చేతులు బయటకు కనిపించకుండా ఉన్న వస్త్రధారణ, గత 20 ఏళ్ల నాటికి మహిళల వస్త్రధారణకు పూర్తిగా విరుద్ధంగా అనిపించింది.
మేకప్ వేసుకునేవారు, ఆధునిక దుస్తులు ధరించే వారు 'ముస్లిం అఫ్గాన్ మహిళలకు ప్రాతినిధ్యం వహించవద్దు', 'షరియా చట్టం అనుమతించని విదేశీ మహిళల హక్కులు మాకు అక్కర్లేదు' అని కాబుల్‌లో జరిగిన తాలిబాన్ అనుకూల ర్యాలీలో మహిళలు నినదించడం ఒక వీడియోలో కనిపించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అఫ్గాన్ మహిళలు వెంటనే దీనిపై స్పందించారు.
అఫ్గానిస్తాన్‌లోని అమెరికన్ యూనివర్సిటీ మాజీ హిస్టరీ ప్రొఫెసర్, డాక్టర్ బహర్ జలాలీ ప్రారంభించిన సోషల్ మీడియా ఉద్యమంలో భాగమైన మహిళలంతా గతంలోలాగే తాము సంప్రదాయ దుస్తులు వేసుకునేందుకు అనుమతించాలని డిమాండ్ చేశారు. దీని కోసం 'డు నాట్ టచ్ మై క్లోత్స్', 'అఫ్గానిస్తాన్ కల్చర్' హ్యాష్ ట్యాగ్‌లను ఉపయోగించారు.
''నేను ఆందోళన చెందుతున్న అంశాల్లో అతి ముఖ్యమైనదేంటంటే... అఫ్గానిస్తాన్ గుర్తింపు, సార్వభౌమత్వం ప్రమాదంలో పడుతున్నాయి. అందుకే ఈ సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రారంభించాను'' అని జలాలీ చెప్పారు.
ఆకుపచ్చ రంగులోని అఫ్గాన్ సంప్రదాయ దుస్తుల్ని ధరించిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఆమె... '' అఫ్గానిస్తాన్ అసలైన సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా'' ఫొటోలు పంచుకోవాలని ఇతరులను కోరింది.
''మీరు మీడియాలో చూస్తున్న వస్త్రధారణ (తాలిబాన్ అనుకూల ర్యాలీలో మహిళలు వేసుకున్న దుస్తులను ఉద్దేశించి) అఫ్గాన్ సంస్కృతి కాదు అని ప్రపంచానికి తెలియజేయాలి అనుకుంటున్నా. అసలు అది మా గుర్తింపు కాదు'' అని ఆమె పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ర్యాలీలో మహిళలు దుస్తులు ధరించిన తీరు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.
రంగురంగుల అఫ్గాన్ సంప్రదాయ దుస్తులు ధరించడం అలవాటు పడినవారికి, పూర్తిగా నలుపు రంగుతో శరీరాన్ని కప్పేసిన ఆ దుస్తులు వింతగా అనిపించాయి.

ఫొటో సోర్స్, EPA
అఫ్గానిస్తాన్‌లోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సంప్రదాయ దుస్తులు వాడుకలో ఉన్నాయి. అన్ని వైవిధ్యాలు ఉన్నప్పటికీ, అక్కడి వారందరి దుస్తుల్లో సాధారణంగా అద్దాలు, ఎంబ్రాయిడరీ, ఆకర్షణీయ రంగులు కచ్చితంగా ఉంటాయి.
ఇలాంటి ఆకర్షణీయ దుస్తులే వారి గుర్తింపు అని అక్కడి మహిళలు చెబుతున్నారు.
''ఇవే మేం వేసుకునే బట్టలు. అఫ్గానిస్తాన్ మహిళలెప్పుడూ రంగురంగుల, అందమైన డిజైన్లతో కూడిన బట్టలే వేసుకుంటారు. నలుపు బుర్ఖా వేసుకోవడం అఫ్గాన్ సంస్కృతిలోనే లేదు'' అని వర్జీనియాకు చెందిన హక్కుల కార్యకర్త స్పోమే మసీద్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''శతాబ్దాలుగా మేం ఇస్లామిక్ దేశాల్లోనే నివసిస్తున్నాం. మా నాన్నమ్మలు, అమ్మమ్మలు కూడా ఆ కాలానికి తగిన సంప్రదాయ దుస్తులే ధరించారు. అంతే తప్ప నీలం రంగు 'చాదరి', అరబ్బుల నల్లటి బుర్ఖాలు ఎప్పుడూ వేసుకోలేదు'' ఆమె చెప్పారు.
''మా సంప్రదాయ వస్త్రాలు 5000 ఏళ్ల చరిత్ర ఉన్న అఫ్గాన్ సంస్కృతి గొప్పదనాన్ని ప్రతిబింబిస్తాయి. మాకు ఉనికిని మేం గర్వించేలా చేస్తాయి.''
దేశంలోని అత్యంత సంప్రదాయవాద ప్రాంతాల్లో నివసించే వారు కూడా, అఫ్గాన్ మహిళలు నిఖాబ్ ధరించడం, మొహాన్ని కప్పి ఉంచే నల్లని వస్త్రాలు కట్టుకోవడం ఎప్పుడూ చూడలేదని చెప్పారు.
''మేం అఫ్గాన్ మహిళలం కాబట్టి, ఆ సంప్రదాయం ఉట్టిపడే ఫొటోను పోస్ట్ చేశాం. చాలా గర్వంగా మేం అలాంటి దుస్తుల్ని వేసుకుంటాం. అవే మా గుర్తింపు. నలుపు లేదా తెలుపులకే మా సంస్కృతి పరిమితం కాదు. చాలా రంగులతో అందంగా ఉంటుంది. అది ఒక కళ. అలాంటి మా గుర్తింపును తీవ్రవాద గ్రూపులు నిర్దేశించాలని మేం కోరుకోవట్లేదు'' అని 37 ఏళ్ల అఫ్గాన్ పరిశోధకురాలు లీమా హలీమా అన్నారు. ఆమె మహిళల సమస్యల కోసం ఏర్పాటైన 'పేవండ్ అఫ్గాన్ అసోసియేషన్' వ్యవస్థాపకురాలు.
అఫ్గానిస్తాన్‌లో గత 20 ఏళ్లుగా నివసిస్తోన్న అహ్మద్ ''ఇక్కడ మహిళలు అభిరుచిని కలిగి ఉంటారు. మా అమ్మ పొడవైన దుస్తులు ధరించేవారు. కొందరేమో కొంచెం చిన్నవిగా ఉన్నవాటిని వేసుకుంటారు. ఇక్కడ మహిళలపై డ్రెస్‌కోడ్ ఎప్పుడూ అమలు చేయలేదు'' అన్నారు.
''అఫ్గాన్ మహిళలమైన మేమెప్పుడూ అలా శరీరం మొత్తాన్న కప్పి ఉంచే డ్రెస్‌లు వేసుకోలేదు. నల్లని నీడ లాంటి యూనిఫార్మ్‌తో పాటు చేతులకు నల్లని గ్లౌజులు, కనీసం కళ్లు కూడా కనిపించకుండా ఉన్నఆ దుస్తులు ప్రత్యేకంగా ఆ ర్యాలీ కోసమే రూపొందించారా అనిపించేలా ఉన్నాయి'' అని ప్రొ-తాలిబాన్ ర్యాలీని ఉద్దేశించి ఆమె వ్యాఖ్యానించారు.
ప్రేగ్‌లో స్థిరపడ్డ అఫ్గాన్ జర్నలిస్ట్ మలాలి బషీర్ ఆమె గీసిన చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
అఫ్గాన్‌లో తాను పెరిగిన గ్రామంలో నల్లని లేదా నీలి రంగులో ఉండే బుర్ఖాను ఎవరూ, ఎప్పుడూ ధరించలేదు. మహిళలంతా సంప్రదాయ దుస్తులే వేసుకునేవారు. వృద్ధులు నలుపు రంగు వస్త్రాలను, యువత రంగురంగుల డిజైన్ల వస్త్రాలను తలకు చుట్టుకునేవారు. పురుషులను కూడా మహిళలు షేక్ హ్యాండ్‌తో పలకరించేవారు'' అని చెప్పుకొచ్చారు.
''సంప్రదాయ దుస్తుల స్థానంలో బుర్ఖాలు ధరించాలని, పబ్లిక్ ప్రదేశాల్లో ఉండకూడదంటూ ఇటీవల కాలంలో అఫ్గాన్ మహిళలపై ఒత్తిడి పెరిగిపోతోంది. నేను నా ఫొటోతో పాటు, అఫ్గాన్ సంప్రదాయ నృత్యం అట్టాన్‌ను ప్రదర్శిస్తోన్న మహిళల చిత్రాన్ని ట్విట్టర్‌లో షేర్ చేశాను'' అని మలాలీ చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
షరియా చట్టానికి లోబడి మహిళలు చదువుకునేందుకు, పని చేసేందుకు అనుమతిస్తున్నట్లు తాలిబాన్ అధికారులు చెప్పారు. కానీ వారు కఠిన డ్రెస్ కోడ్ నిబంధనలను పాటించాలని ఆదేశించారు.
ఇప్పటికే కొందరు మహిళలు నలుపు, నీలం రంగు బుర్ఖా వేసుకోవడం ప్రారంభించారు. కాబుల్‌తో పాటు ఇతర నగరాల్లో ఇలా వేసుకునే వారు ఎక్కువగా కనిపిస్తున్నారు.
జెండర్ పరంగా యూనివర్సిటీలను వేరు చేస్తామని కొత్తగా ఎన్నికైన ఉన్నత విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బాకీ హక్కానీ ప్రకటించారు. మహిళలు తప్పనిసరిగా హిజాబ్ ధరించాల్సి ఉంటుందని అన్నారు. అయితే అదనంగా ముఖానికి ముసుగు ధరించాలా, లేదా అనేది స్పష్టంగా చెప్పలేదు.
ఇవి కూడా చదవండి:
- వాయు కాలుష్యం నుంచి ఫ్లోర్ టైల్స్ తయారు చేస్తున్న భారతీయుడు
- ‘పుల్కా తినేసిందని ఎద్దును చంపేశాడు’
- బీజేపీ నిశ్శబ్దంగా ముఖ్యమంత్రుల్ని ఎలా మారుస్తోంది? పార్టీలో ఎవరూ గొంతెత్తరు ఎందుకు?
- 'జాక్ మా' లాంటి పారిశ్రామిక దిగ్గజాలను చైనా ఎందుకు ‘ఇబ్బంది పెడుతోంది’
- భారత న్యాయవ్యవస్థలో ‘ఉన్నత వర్గాలు, ఆధిపత్య కులాల పురుషులే’ ఎక్కువా?
- కోవిడ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన హెల్త్ కేర్ సిబ్బందికి పరిహారం ఎందుకు అందడం లేదు
- జపాన్‌పై దాడిచేయగలిగే లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా
- మోదీ రాజకీయ వారసత్వాన్ని నిలబెట్టేవారే లేరా
- బిగ్‌బాస్-5లో తొలి ఎలిమినేషన్
- మాట్లాడే బాతు.. 'యూ బ్లడీ ఫూల్' అంటూ తిట్లు.. ఆస్ట్రేలియాలో వింత
- కేంద్ర ప్రభుత్వ కేవైసీ-వీఎస్.. వ్యాక్సీన్ వేసుకున్నామని అబద్ధం చెబితే దొరికిపోతారు
- భూపేంద్ర పటేల్ ఎవరు? మొదటిసారి ఎమ్మెల్యేని బీజేపీ సీఎం చేసింది ఎందుకు?
- అఫ్గానిస్తాన్: గత 20 ఏళ్లలో ఏం మారింది?








