అఫ్గానిస్తాన్: కాబుల్ విమానాశ్రయం బయట ఏడుగురు చనిపోయారన్న బ్రిటన్ రక్షణ శాఖ

ఫొటో సోర్స్, Aykut Karadag/Anadolu Agency via Getty Images
కాబుల్ ఎయిర్‌పోర్టు వద్ద గందరగోళ పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాలిబాన్ ఆక్రమణ తర్వాత అఫ్గానిస్తాన్ నుంచి బయటపడ్డానికి జనం భారీగా కాబుల్ విమానాశ్రయానికి తరలి వస్తున్నారు.
ఎయిర్‌పోర్టు బయట భారీగా గుమిగూడిన వారిలో ఏడుగురు అఫ్గాన్ పౌరులు మృతిచెందినట్లు బ్రిటన్ రక్షణ శాఖ చెప్పింది.
"అక్కడ పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి. కానీ వీలైనంత వేగంగా, సురక్షితంగా అక్కడి పరిస్థితులను చక్కదిద్దడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాం" అని బ్రిటన్ రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఎలాగైనా దేశం వదిలి వెళ్లాలని వేలాది అఫ్గాన్ పౌరులు ప్రయత్నిస్తుండడంతో కాబుల్ విమానాశ్రయం బయట గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రస్తుతం హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం దాదాపు 4500 మంది అమెరికా సైనికుల నియంత్రణలో ఉంది.
900 మంది బ్రిటిష్ సైనికులు విమానాల్లో జనాలను సురక్షితంగా తరలించేలా చూసుకుంటున్నారు.
విమానాశ్రయం చుట్టూ తాలిబాన్ మిలిటెంట్లు చెక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ప్రయాణించడానికి తగిన పత్రాలు లేకుండా వచ్చేవారిని అడ్డుకుంటున్నారు.

ఫొటో సోర్స్, ANI
168 మందితో కాబుల్ నుంచి భారత్ చేరుకున్న ఎయిర్‌ఫోర్స్ విమానం
అఫ్గానిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలించే చర్యలు వేగం అందుకున్నాయి.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన సీ-17 విమానం 168 మంది ప్రయాణికులతో కాబుల్ నుంచి దిల్లీ సమీపంలోని ఘాజియాబాద్ హిండన్ ఎయిర్‌బేస్‌కు చేరుకుంది.
కాబూల్ నుంచి వచ్చిన 168 మందిలో 107 మంది భారతీయులు ఉన్నారు.

అఫ్గానిస్తాన్ నుంచి స్వదేశం చేరిన భారతీయుల్లో మహిళలు, వృద్ధులు, పాలు తాగే పసికందులు
ఎన్నో ప్రయత్నాల తర్వాత అఫ్గానిస్తాన్ నుంచి భారత్ తిరిగి వస్తున్న భారతీయుల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.
యుద్ధ వాతావరణం నెలకొన్న ఒక దేశం నుంచి బయటపడిన తర్వాత వారందరికీ ఎంత ఉపశమనంగా అనిపించిందో ఆ దృశ్యాల్లో తెలుస్తోంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
స్వదేశానికి తిరిగి వస్తున్నవారిలో మహిళలు, వృద్ధులు, పాలు తాగే పసికందులు ఉన్నారు.
168 మందితో దేశానికి చేరుకున్న భారత వైమానిక దళం సీ-17 విమానంలో ఒక నవజాత శిశువు కూడా ఉన్నాడు.
వీరంతా దిల్లీ దగ్గర ఘాజియాబాద్‌లో ఉన్న హిండన్ ఎయిర్ బేస్‌లో దిగారు.
భారత్ తిరిగి వచ్చినవారిలో అఫ్గాన్ హిందువులు, సిక్కులు కూడా ఉన్నారు.

ఫొటో సోర్స్, Ravinder Singh Robin/BBC
ఏపీ హెల్ప్ లైన్స్:
అఫ్గానినిస్తాన్ లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్మిక శాఖలో హెల్ప్ డెస్క్ ని ఏర్పాటు చేసింది. బాధితులు 0866-2436314 హెల్ప్ లైన్‌కు కాల్ చేసి సహాయం పొందవచ్చని కార్మిక శాఖ కమీషనర్ శ్రీమతి. జి. రేఖా రాణి ఐఏఎస్ గారు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ APNRTS ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసాంధ్రులకు సహాయం చేసేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆ సంస్థ అధ్యక్షులు వెంకట్ ఎస్. మేడపాటి తెలిపారు. అఫ్గానిస్తాన్‌లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలుగువారు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లను (0863 2340678, వాట్సాప్: 85000 27678) సంప్రదించాలని ఆయన కోరారు. అలాగే, వారు [email protected] , [email protected] అనే ఇమెయిల్స్‌కు సమాచారాన్ని పంపించి కూడా సహాయం పొందవచ్చని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా అఫ్గానిస్తాన్‌లో ఉన్న భారతీయుల కోసం హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్ నంబర్లు: +91-11-49016783, +91-11-49016784, +91-11-49016785; +91-8010611290(వాట్సాప్). అలాగే, సహాయం కోసం [email protected] కు ఇమెయిల్ చేయవచ్చని అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, ANI
"20 ఏళ్లుగా చేసింది ఇప్పుడు జీరో అయిపోయింది": కన్నీళ్లు పెట్టుకున్న అఫ్గాన్ సిక్కు ఎంపీ
కాబూల్ నుంచి ఘాజియాబాద్ హిండన్ ఎయిర్ బేస్ చేరుకున్న వారిలో అఫ్గానిస్తాన్ సిక్కు ఎంపీ నరేంద్ర సింగ్ ఖాల్సా కూడా ఉన్నారు.
విమానం ఎయిర్ బేస్‌లో దిగిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన తన కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.
అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి చూస్తుంటే ఏడుపొస్తోందని అన్నారు.
"అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో అదంతా ఇప్పుడు జీరో అయిపోయింది" అని నరేంద్ర సింగ్ అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
నిన్న రాత్రి మరో విమానం దుశాంబే మీదుగా న్యూదిల్లీ చేరుకుంది.
ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం దీనికి సంబంధించి అర్ధరాత్రి ఒక ట్వీట్ చేసింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
"135 మంది భారతీయులతో ఉన్న మొదటి బృందాన్ని కాబుల్ నుంచి దోహా చేర్చాం. ఈరోజు వారిని భారత్ పంపిస్తున్నాం. వారిని సురక్షితంగా తరలించేందుకు ఎంబసీ అధికారులు తగిన సహాయ సహకారాలు అందించారు" అని చెప్పింది.

ఫొటో సోర్స్, HAIDAR HAMDANI/AFP via Getty Images
తాలిబాన్ అమెరికా చేతిలో తోలుబొమ్మ- ఇస్లామిక్ స్టేట్
తాలిబాన్లు 'ముల్లా బ్రాడ్లీ' ప్రాజెక్ట్‌గా మారారని ఐఎస్ విమర్శించింది.
జిహాద్‌ను బలహీనంగా మార్చేందుకు అమెరికా నియమించిన వారి గురించి చెప్పడానికి జిహాదీ గ్రూపులు 'ముల్లా బ్రాడ్లీ' అనే మాటను ఉపయోగిస్తుంటాయి.
ఇది అల్‌ఖైదా మాజీ నేత అన్వార్ అల్-అవ్లాకీ సృష్టించిన ఒక పదం.
తాలిబాన్లు ఆగస్టు 15న మొత్తం అఫ్గానిస్తాన్ స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఐఎస్ వారిపై వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి.
తమ వార్తా పత్రిక అల్-నబా ఎడిటోరియల్‌కు "మొత్తానికి వారు ముల్లా బ్రాడ్లీని స్థాపించారు" అని ఇస్లామిక్ స్టేట్ శీర్షిక పెట్టింది.
అందులో 'కొత్త తాలిబాన్' అనే మాటను ప్రయోగించిన ఐఎస్...అఫ్గాన్ గ్రూప్ 20 ఏళ్ల క్రితం ప్రారంభించిన అసలుసిసలు జిహాదీ ఉద్యమం నుంచి వీరు దారితప్పారని అన్నారు.
"వారు విజయంగా చెబుతున్న ఇది అమెరికా అరేంజ్ చేసిన విజయం" అని ఐఎస్ చెప్పింది.

ఫొటో సోర్స్, US MARINE CORPS/REUTERS
కాబుల్ విమానాశ్రయంపై ఐఎస్ దాడి చేయొచ్చంటూ అమెరికా హెచ్చరికలు
కాబుల్ విమానాశ్రయంపై అఫ్గానిస్తాన్‌లోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ మిలిటెంట్లు దాడి చేసే అవకాశం ఉందని అమెరికా ఆందోళన చెందుతోంది. దీంతో అమెరికా పౌరులు ఎవరూ కాబుల్ విమానాశ్రయం వైపు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేసింది.
బయట ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా అమెరికా పౌరులు తమను తాము కాపాడుకోవాలని శనివారం అమెరికా రక్షణ శాఖ జారీ చేసిన భద్రతా హెచ్చరికలో చెప్పారు.
కాబుల్‌లో పరిస్థితులను గమనిస్తున్నామని, వేరే మార్గాలు అన్వేషిస్తున్నామని కూడా అమెరికా భద్రతా అధికారులు చెప్పారు.
ఐఎస్ దాడులు చేయవచ్చని హెచ్చరించిన అమెరికా, దానికి సంబంధించిన పూర్తి సమాచారం షేర్ చేయలేదు. కాబుల్ మీద దాడి చేస్తామని ఐఎస్ కూడా ఎలాంటి బహిరంగ హెచ్చరికలూ చేయలేదు.

ఫొటో సోర్స్, Reuters
ఎయిర్ పోర్ట్ టెర్మినల్ బయట గందరగోళ పరిస్థితులు కొనసాగుతుండడంతో అమెరికా శనివారం ఈ సూచనలు జారీ చేసింది.
కాబుల్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఇప్పటివరకు 17 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వారిలో 2500 మంది అమెరికా పౌరులు కూడా ఉన్నారని శనివారం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్సులో అమెరికా రక్షణ శాఖ చెప్పింది.
ప్రస్తుతం కాబుల్ ఎయిర్ పోర్ట్ నియంత్రణ అమెరికా భద్రతా బలగాల చేతుల్లో ఉంది.
అమెరికా, అఫ్గానిస్తాన్ ప్రజల్లో కొంతమంది హింసకు గురయ్యారు. ఎయిర్ పోర్టు వైపు వస్తున్న సమయంలో కొన్ని ప్రాంతాల్లో వారిపై దాడులు జరిగాయి అని అధికారులు చెప్పారు.
ఎయిర్ పోర్ట్ గేటు బయట జనం భారీగా గుమిగూడకుండా చూడాలని కూడా తమకు ఆదేశాలు అందాయని అమెరికా రక్షణ శాఖ ప్రతినిధి చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- అఫ్గానిస్తాన్ యుద్ధ బాధితులకు మానవతా సాయం ఎందుకు అందడం లేదు?
- కాందహార్: తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన అఫ్గాన్‌లో రెండో అతిపెద్ద నగరం
- ‘వాళ్లు పాశ్చాత్య సంస్కృతిని వీడటం లేదు, మేం వారిని చంపాల్సిందే’ - తాలిబన్లు
- భారత ఫొటో జర్నలిస్ట్ దానిష్ సిద్దిఖీ హత్యకు ముందు, ఆ తర్వాత ఏం జరిగింది?
- మహమ్మద్ ఇస్మాయిల్ ఖాన్: తాలిబన్లతో పోరాడుతున్న 'అఫ్గాన్ సింహం'
- అఫ్గానిస్తాన్: తాలిబన్ల వశమైన ఐదు ప్రాంతీయ రాజధానులు
- అఫ్గానిస్తాన్: జైలును స్వాధీనం చేసుకుని ఖైదీలందరినీ వదిలేశామని ప్రకటించిన తాలిబన్లు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








