సెక్స్ ట్రాఫికింగ్: ఓ టీనేజర్ చేసిన ట్వీట్లతో ఒక సినిమా తయారైంది, ఇంతకీ ఆ ట్వీట్లలో ఏముంది?

టేలర్ పేజ్

ఫొటో సోర్స్, A24 Films

ఫొటో క్యాప్షన్, టేలర్ పేజ్
    • రచయిత, ఎమ్మా జోన్స్
    • హోదా, బీబీసీ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధి

ట్విటర్ వేదికగా ఒక టీనేజర్ రాసిన #thestory థ్రెడ్ వైరల్ అయింది. అది ఓ సినిమా దర్శకుడిని ఆకర్షించింది. ఆ ట్వీట్స్‌లోని కథతో చివరకు సినిమా తయారైంది.

2015లో 19 సంవత్సరాల జోలా 148 ట్వీట్లతో తన ఫ్లోరిడా రోడ్ ట్రిప్ గురించి రాశారు. ఆ థ్రెడ్ జోలా పేరుతో చలన చిత్రంగా రూపొందింది. ఆమె అసలు పేరు అజియా కింగ్. ఆమె డెట్రాయిట్‌లో ఒక వెయిట్రెస్‌గా పని చేసేవారు.

ఈ చలన చిత్రానికి జానిక్జా బ్రావో దర్శకత్వం వహించారు. ఆమె ఈ చిత్రానికి సహ రచయితగా కూడా పని చేశారు. ఇందులో టేలర్ పేజ్, రైలీ కీయో, నికోలస్ బ్రౌన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

ఈ సినిమాలో జోలా ట్వీట్‌లను సంభాషణల్లో వాడుతున్నారు.

జోలా పాత్రలో పేజ్ నటించారు. జోలాను కస్టమర్ స్టెఫాని బలవంతం చేసి ఫ్లోరిడా తీసుకుని వెళతారు. స్టెఫానీ పాత్రలో కియావ్ నటించారు.

ఫ్లోరిడాలో వీకెండ్‌లో క్లబ్‌లలో డాన్స్ చేసి బాగా డబ్బులు సంపాదించాలనుకున్న జోలాను ఈ ట్రిప్ ప్రమాదకరమైన సెక్స్ ట్రాఫికింగ్ ప్రపంచంలోకి నెట్టేస్తుంది.

కియావ్ (ఎడమవైపు)

ఫొటో సోర్స్, Anna Kooris / A24 Films

ఫొటో క్యాప్షన్, కియావ్ (ఎడమవైపు)

ప్రస్తుతం ఈ కథను ట్విటర్ నుంచి తొలగించారు. కానీ, ఇంటర్నెట్‌లో ఎక్కడో ఒక చోట భద్రంగానే ఉండి ఉంటుంది.

ఈ కథను సరదాగా చెప్పిన విధానం వల్ల ట్విటర్‌లో వైరల్ అవ్వడంతో పాటు, చాలా మంది సెలెబ్రిటీలు కూడా ఈ కథను రీట్వీట్ చేశారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన బ్రావో ఈ కథ గురించి వినగానే ఇది మంచి సినిమా అవుతుందని భావించారు.

"నేను ట్విటర్లో లేను. కానీ, ఈ కథను సినిమాగా తీయాలని అనుకున్నాను" అని ఆమె వివరించారు.

"ఈ కథ గురించి నా ఫోన్ గ్రూప్ చాట్స్‌లో కనీసం 100 మెసేజ్‌లు ఉండేవి"అని ఆమె గుర్తుచేసుకున్నారు.

కోల్మన్ డొమింగో

ఫొటో సోర్స్, Anna Kooris / A24 Films

ఫొటో క్యాప్షన్, కోల్మన్ డొమింగో

"ఆ చాట్‌లు చూడటంతో ఈ ట్వీట్లకు లభించిన అనూహ్య స్పందన అర్ధమయింది. ఆ అనుభవం అంతా ఒక నాటకం చూసినట్లుగా అనిపించింది. జోలా స్టేజి పై నిల్చుని తన కథను చెబుతుంటే, ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో, జోలా శక్తిని పుంజుకుంది"అని ఆమె అన్నారు.

"ఆమె గొంతు నాకు నచ్చింది. అలాంటి గొంతును నేను అంతకు ముందెన్నడూ వినలేదు. నాకు కళ్ళెదురుగా చూస్తున్న అనుభూతి కలిగింది. నాకు ఆ చిత్రాలు చూస్తేనే, స్క్రిప్ట్ లభిస్తుందని వెంటనే అర్ధమయింది. ఫోటోలు చూడటంతో నా సినిమా ప్రయాణం మొదలయింది" అని చెప్పారు.

జోలా కథను ఆమె అభిమానులు గ్రీక్ రచయత హోమర్ రాసిన ప్రముఖ కవిత ది ఒడిస్సీతో పోల్చారు.

డిజిటల్ యుగంలో తొలి పెద్ద కవితను అజియా రాశారని చిత్ర సహ రచయత జెరేమి ఓ హ్యారిస్ అభిప్రాయపడ్డారు.

జోలా

ఫొటో సోర్స్, Anna Kooris / A24 Films

కానీ, ట్విటర్ లో కొంత మంది జోలా రాసిన కథ గురించి ప్రశ్నలను సంధించారు.

నాటకీయత కోసం కొన్ని విషయాలను ఎక్కువ చేసి చెప్పినట్లు జోలా రోలింగ్ స్టోన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు.

అలాగే, సినిమాలో స్టెఫానీ పాత్రకు స్ఫూర్తిని కలుగచేసిన జెస్సికా కూడా ఆమె అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆమె చెప్పిన కథనంలో జోలా పాత్ర అంత గొప్పగా ఏమి లేదు.

"మనమంతా మన కథల్లో మన గురించి ఎప్పుడూ గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం" అని జెస్సికా అన్నారు. "ఆ కథలో నిజానిజాల గురించి నేనెప్పుడూ తలదూర్చలేదు. జోలా సొంతంగా అందమైన కథను అద్భుతంగా అల్లారు. అలాగే, సినిమా జర్నలిజమో, డాక్యుమెంటరీనో కాదు. ఇది డాక్యుమెంటరీ తరహాలో చెప్పిన ఒక కథ" అని ఆమె అన్నారు.

జోలా

ఫొటో సోర్స్, Anna Kooris / A24 Films

"రైలీ కీయో, నికోలస్ బ్రౌన్ కూడా రెడిట్, ఫేస్‌‌‌బుక్ వేదికలపై కథలో తాము పోషించిన పాత్రలను వివరించారు. వీరందరి కథలను కలిపితే, అవన్నీ ఒకేలా కనిపిస్తాయి. మన కథలకు మనమే తారల్లా కనిపిస్తాం" అని జెస్సికా అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా 50లక్షల మంది బలవంతపు లైంగిక దోపిడీకి గురవుతున్నట్లు వివిధ అధ్యయనాలు అంచనా వేశాయి. అయితే జోలా కథను ఇప్పటికీ సోషల్ మీడియాలో చాలా మంది వ్యతిరేకిస్తూ బ్రావో అన్నారు.

జోలా

ఫొటో సోర్స్, Anna Kooris / A24 Films

"నేను చదివిన ప్రతీ వ్యాసమూ ఆ కథ నిజానిజాల గురించి ప్రశ్నించినదే" అని బ్రావో అన్నారు.

ఈ కథను సెక్స్ ట్రాఫికింగ్ కథనంగా వినాలని అనుకోనివారు కూడా హాయిగా చదవడం కోసం ఈ కథను సరదాగా రాసినట్లు జోలా చెప్పారు. అలా రాయడం వల్ల వినోదాత్మకంగా ఉంటుందని భావించినట్లు చెప్పారు.

జోలా

ఫొటో సోర్స్, Anna Kooris / A24 Films

ఈ సినిమా స్క్రిప్ట్‌లో జోలా.. స్టెఫానీ దగ్గరకు వచ్చే వినియోగదారుల నుంచి మూడు రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ శక్తివంతమైన పాత్రలో ఉన్నట్లుగా చిత్రీకరించారు.

"నేను సెక్స్‌ని ఒక పనిగానే చూపించాలని అనుకున్నాను. అలాగే, సెక్స్ వర్క్ చేసే మహిళల గురించి వాళ్లకిష్టమైనట్లే చూపించాలని అనుకున్నాను" అని బ్రావో వివరించారు.

"ఈ కథను చెప్పిన జోలా.. సెక్స్ వర్కర్లు చేసే పనిని చాలా గౌరవంతో రూపొందించడానికి చూశారు" అని అన్నారు.

"ఇక్కడొక విషాదం ఉంది. అదేమిటంటే, వాళ్ళు వాళ్ళ సంస్థను కోల్పోయినప్పుడు, వాళ్ళ పనిని మాత్రమే కాదు, వారి మానసిక సంసిద్ధతను కూడా కోల్పోతారు. ఆ తేడాను సినిమాలో చూపించాలని అనుకున్నాను. జోలా ఏం చేయాలనుకుంటుందో, ఏం చేయకూడదని అనుకుంటుందో తరచుగా చెబుతూనే ఉంది" అని చెప్పారు.

"ఈ సినిమా చాలా వినోదాత్మకంగా ఉంటుంది. దీని వల్ల, ఈ సినిమా గురించి ప్రేక్షకులు చర్చించే వీలు కలుగుతుంది" అని అన్నారు.

"కానీ ఈ మహిళలకు కూడా మర్యాద దక్కాలని ఆశిస్తున్నాను. జీవితపు అంచులపై నిల్చుని జీవించే వీరి పాత్రలను ఎవరూ పరిగణనలోకి తీసుకోరు. కనీసం వీరిలో కొంత మంది మహిళలను, పురుషులను విభిన్నంగా చూస్తారని ఆశిస్తున్నాను" అని అన్నారు.

జోలా ఆగస్టు 06న థియేటర్లలో విడుదలయింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)