టోక్యో ఒలింపిక్స్: పోరాడి ఓడిన భారత మహిళల హాకీ జట్టు.. కాంస్యం కైవసం చేసుకున్న బ్రిటన్

ఫొటో సోర్స్, Reuters
భారత మహిళా హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం గ్రేట్ బ్రిటన్‌తో తలపడింది.
ఈ మ్యాచ్‌లో 4-3 తేడాతో భారత్‌పై బ్రిటన్ విజయం సాధించింది.
మ్యాచ్ చివరి సమయంలో భారత ప్లేయర్లు ఉదిత, షర్మిలలు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఉదితకు యెల్లో కార్డు, షర్మిలకు గ్రీన్ కార్డులను చూపించారు.

ఫొటో సోర్స్, Alexander Hassenstein/Getty Image
తొలి గోల్ బ్రిటన్‌దే
మ్యాచ్‌లో తొలిగోల్ చేసిన బ్రిటన్ 1-0 ఆధిక్యం సంపాదించింది. ఆ గోల్‌ను అడ్డుకోబోయిన భారత్ స్వయంగా బంతిని గోల్‌లోకి పంపింది.
తర్వాత బ్రిటన్ అదే క్వార్టర్‌లో రెండో గోల్ వేసింది. కానీ, కాసేపటికే భారత్ కూడా గోల్ వేసింది. పెనాల్టీ కార్నర్‌ను భారత్ గోల్‌గా మలచగలిగింది.

తర్వాత కాసేపటికే భారత్‌కు మరో పెనాల్టీ అవకాశం వచ్చింది. దానిని కూడా గోల్ పోస్టులోకి పంపగలిగారు.
సెకండ్ క్వార్టర్ చివర్లో మరో గోల్ వేసిన భారత్ బ్రిటన్‌పై 3-2 ఆధిక్యం సాధించింది.

ఫొటో సోర్స్, Ravinder Singh Robin
మూడో క్వార్టర్ మొదలవుతూనే బ్రిటన్ మరో గోల్ కొట్టింది. దీంతో రెండు జట్ల స్కోర్ సమం అయ్యింది.
అయితే, నాలుగో క్వార్టర్ చివర్లో బ్రిటన్ కీలకమైన నాలుగో గోల్ కొట్టింది. దీంతో భారత్‌పై 4-3 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఫలితంగా భారత జట్టు ఓటమిని చవిచూసింది.
చివరి 15 నిమిషాల్లో భారత్‌కు చెందిన ఉదితకు యెల్లో కార్డ్ చూపించారు. ఆ సమయంలో భారత్-బ్రిటన్ 3-3తో సమంగా ఉన్నాయి.ఆ తర్వాత కీలకమైన సమయంలో భారత హాకీ క్రీడాకారిణి షర్మిలకు గ్రీన్ కార్డ్ చూపించారు. దాంతో ఆమె రెండు నిమిషాలపాటు బయటే ఉండిపోయారు.

ఫొటో సోర్స్, ANNE-CHRISTINE POUJOULAT/AFP via Getty Images
గెలిస్తే చారిత్రక విజయం
ఈరోజు మ్యాచ్ గెలిస్తే ఇది భారత మహిళా హాకీ జట్టుకు చరిత్రాత్మక విజయం అయ్యుండేది.
భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్‌లో ఆడడం 1980 నుంచీ ప్రారంభమైంది.

ఫొటో సోర్స్, Gulshan Kumar
భారత మహిళా హాకీ జట్టు ప్రస్తుతం మూడోసారి ఒలింపిక్స్‌లో ఆడుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే, 2016లో టీమ్ అంత మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయింది.
గురువారం భారత పురుషుల హాకీ జట్టు జర్మనీని 5-4తో ఓడించి కాంస్య పతకం గెలుచుకుంది. 1980 తర్వాత ఒలింపిక్స్ హాకీలో భారత్‌కు ఇది మొదటి పతకం.
Please wait...
ఇవి కూడా చదవండి:
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








