పాకిస్తాన్‌లో రైలు ప్రమాదం.. 35 మంది మృతి

ఫైల్ ఫొటో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫైల్ ఫొటో

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రాంతంలో డహర్కీ దగ్గర సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్, మిల్లత్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 35కి పెరిగింది. చాలా మంది గాయపడ్డారు.

‘రేడియో పాకిస్తాన్’ తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రమాదం సోమవారం తెల్లవారుజామున జరిగింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

సోమవారం తెల్లవారు జామున కరాచీ నుంచి వస్తున్న మిల్లత్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఆ బోగీలు కొన్ని పక్కనే ఉన్న ట్రాక్‌పై బోల్తా పడగా రావల్పిండి నుంచి వస్తున్న సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ వాటిని ఢీకొంది. దాంతో రావల్పిండి ఎక్స్‌ప్రెస్ ఇంజన్, బోగీలు కూడా పట్టాలు తప్పాయి.

తీవ్రంగా గాయపడ్డ ప్రయాణికులను సమీప ఆస్పత్రులకు తరలించారు. బోగీల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీయడానికి సహాయ కార్యక్రమాలు ప్రారంభించినట్లు రేడియో పాకిస్తాన్ చెప్పింది.

మిల్లత్ ఎక్స్‌ప్రెస్‌లోని 8 బోగీలు, సర్ సయ్యద్ ఎక్స్‌ప్రెస్ ఇంజన్ సహా మూడు బోగీలు పట్టాలు తప్పాయి.

ఈ ఘటన ఘోట్కీ సమీపంలో డహర్కీ, రేతీ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. ఈ ప్రమాదం తర్వాత ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను రద్దు చేశారు.

పాకిస్తాన్ రైలు ప్రమాదం

ఫొటో సోర్స్, Majid

ఈ ఘటనలో కనీసం 40 మంది గాయపడ్డారని, ఘోట్కీ ఎస్ఎస్పీ వివరాల ప్రకారం 30 మంది వరకూ ప్రయాణికులు చనిపోయారని ఘోట్కీ డిప్యూటీ కమిషనర్ ఉస్మాన్ అబ్దుల్లా జియో న్యూస్‌కు చెప్పారు.

సహాయ కార్యక్రమాల కోసం అవసరమైన భారీ యంత్రాలను ఘటనాస్థలం దగ్గరకు పంపించామని, అవి త్వరలో అక్కడికి చేరుకుంటాయని ఆయన తెలిపారు.

చుట్టుపక్కల ఉన్న ఆస్పత్రులను అత్యవసర స్థితిని ఎదుర్కొనేందుకు అప్రమత్తం చేశారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఇమ్రాన్ ఖాన్

రైలు ప్రమాదంపై పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ట్విటర్‌లో దిగ్భ్రాంతి వ్యక్త చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

"ఈ రోజు తెల్లవారుజామున ఘోట్కీ దగ్గర 30 మంది మరణానికి కారణమైన ఘోర రైలు ప్రమాదం దిగ్భ్రాంతికి గురిచేసింది.

గాయపడినవారికి వైద్య సహాయం అదించడానికి, మృతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఘటనాస్థలానికి వెళ్లాలని రైల్వే మంత్రిని కోరాం. రైల్వే భద్రతా లోపాలపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించాం" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

తరచూ ప్రమాదాలు

పాకిస్తాన్‌లో రైలు ప్రమాదాలు మామూలే. తరచూ పట్టాలు తప్పడం, కాపలా లేని రైల్వే క్రాసింగ్స్ దగ్గర ఢీకొనడం జరుగుతుంటుంది.

అయితే సరైన స్థితిలో లేని రైళ్లలో తరచూ పరిమితికి మించి ప్రయాణిస్తుంటారు.

పాకిస్తాన్‌లో రైలు ప్రమాదాలకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

మెయింటనన్స్ సరిగా లేకపోవడం, సిగ్నల్ సమస్యలు, పాతబడిన ఇంజన్లు.

పరిమితికి మించిన ప్రయాణికులతో రైళ్లు తరచూ రద్దీగా ఉండడం వల్ల ప్రమాదాలు జరిగినపుడు మృతుల సంఖ్య కూడా భారీగా ఉంటుంది.

ఈ ఏడాది మార్చిలో కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న కరాచీ ఎక్స్‌ప్రెస్ రోహ్డీ దగ్గర పట్టాలు తప్పడంతో 30 మంది గాయపడ్డారు. ఒకరు చనిపోయారు.

గత ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ సింధ్ ప్రాంతంలో రోహ్డీలో కరాచీ నుంచి లాహోర్ వెళ్తున్న పాకిస్తాన్ ఎక్స్‌ప్రెస్ ఒక బస్సును ఢీకొనడంతో 22 మంది చనిపోయారు.

అంతకు ముందు 2019లో పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతంలో రహీమ్ యార్ ఖాన్ జిల్లాలో కరాచీ నుంచి రావల్పిండి వెళ్తున్న తేజ్‌గ్రామ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు అంటుకోవడంతో 74 మంది చనిపోయారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)