భారత్ Vs న్యూజీలాండ్: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ నిబంధనలు ప్రకటించిన ఐసీసీ

ఐసీసీ

ఫొటో సోర్స్, ICC

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ నిబంధనలను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ - ఐసీసీ ప్రకటించింది.

ఐదు రోజుల్లో ఫలితం తేలకుండా, మ్యాచ్ డ్రా అయితే రెండు జట్లను సంయుక్త విజేతగా ప్రకటిస్తామని ఐసీసీ వెల్లడించింది.

నిర్ణీత సమయంలో మ్యాచ్ పూర్తికాకపోతే, ఏవైనా అడ్డంకులు ఎదురైతే నష్టపోయిన ఆటను ఆరో రోజు ఆడిస్తామని వివరించింది.

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ మొదలు కావడానికి ముందే 2018 జూన్‌లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లో సమయం నష్టపోతేనే రిజర్వ్ డేను కేటాయిస్తారు.

జూన్ 23ను రిజర్వ్ డేగా నిర్ణయించారు.

రిజర్వ్ డేను ఉపయోగించుకోవాలా వద్దా అనేది మ్యాచ్ రెఫరీ నిర్ణయిస్తారు. అది కూడా ఐదో రోజు మ్యాచ్ చివరి గంటలో సమీక్షించి తుది నిర్ణయం తీసుకుంటారు.

ఐదు రోజుల మ్యాచ్ తర్వాత కూడా ఫలితం తేలకపోతే మరో రోజు అదనంగా ఆటను కొనసాగించరు.

అలాంటి పరిస్థితుల్లో మ్యాచ్‌ని డ్రాగా ప్రకటిస్తారు.

వచ్చే నెల 18 నుంచి 22 వరకు సౌథాంప్టన్‌ వేదికగా భారత్, న్యూజీలాండ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో తలపడబోతున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)