అంగారక గ్రహంపై తొలిసారిగా కదిలిన చైనా రోవర్ జురాంగ్

ఫొటో సోర్స్, Reuters
వారం క్రితం అంగారక గ్రహంపై దిగిన చైనా రోవర్ 'జురాంగ్', కాప్స్యూల్ నుంచి బయటకు వచ్చి మార్స్ ఉపరితలంపై కాలు మోపింది.
దీంతో, అమెరికా తరువాత మార్స్‌పై రోవర్‌ను నడిపిన రెండవ దేశంగా చైనా చరిత్ర లిఖించింది.
జురాంగ్ రోవర్ అంగారక గ్రహం ఉపరితలంపై ఉన్న మట్టిని, వాతావరణాన్ని అధ్యయనం చేయనుంది.
దానితోపాటు, అక్కడ జీవం జాడలను అన్వేషించడమే కాకుండా, భూమి లోపలి పొరల్లో నీరు లేదా మంచు ఉందేమో పరిశీలిస్తుంది.
ఆర్బిటార్, లాండర్, రోవర్లతో కూడిన టియాన్వెన్-1 మిషన్‌ను చైనా గత జూలైలో ప్రారంభించింది.
జురాంగ్ రోవర్ మార్స్‌పై భూమి లెక్కల్లో 92 రోజులు లేదా మార్స్ లెక్కల్లో 90 రోజులు (వీటినే 'సోల్స్' అంటారు) అధ్యయనం కొనసాగిస్తుందని, ఆర్బిటార్ ద్వారా తన పరిశోధన ఫలితాలను భూమికి చేరవేస్తుందని ఈ మిషన్‌కు డిప్యుటీ చీఫ్ కమాండర్‌గా వ్యవహరిస్తున్న జాంగ్ యుహ్వా తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
"మార్స్ స్థలాకృతి, నేల స్వభావం, వాతావరణం, సంవత్సరం పొడుగునా ఉపరితలం లోపలి పొరల్లో జరిగే మార్పుల గురించి సమగ్రమైన సమాచారాన్ని సేకరించగలమని ఆశిస్తున్నాం. తద్వారా మార్స్ గురించి మా దేశం సమృద్ధిగా ఫస్ట్-హ్యాండ్ డాటా కూడబెట్టగలుగుతుంది" అని ఆమె అన్నారు.
సోలార్ శక్తితో పని చేసే ఆరు చక్రాల జురాంగ్ రోబో మార్స్ ఉత్తరార్ధగోళంలో విస్తారమైన భూభాగం యుటోపియా ప్లానెటియాను లక్ష్యంగా చేసుకుని పని చేస్తుంది.
చైనా పురాణాల్లోని అగ్ని దేవుడి పేరు జురాంగ్. ఆ పేరే ఈ రోవర్‌కు పెట్టారు. దీని బరువు 240 కేజీలు.
యుటోపియా ప్లానెటియా అనేది 3,000 కిమీ వెడల్పు గల విస్తారమైన గుంట. ఇది అంగారక గ్రహం చరిత్ర ప్రారంభంలో కొన్ని వాతావరణ ప్రభావాల కారణంగా ఏర్పడింది.
పూర్వం ఇక్కడ సముద్రం ఉండి ఉంటుందనేందుకు కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి.

ఫొటో సోర్స్, CNSA
అక్కడి ఉపరితలం అట్టగుడు పొరల్లో మంచు ఉందన్న సంగతిని రిమోట్ సెన్సింగ్ ద్వారా శాటిలైట్లు సూచించాయి.
యుటోపియా ప్లానెటియా ప్రాంతంలోనే 1976లో అమెరికా కూడా వికింగ్-2 మిషన్‌ను మార్స్‌పై దించింది.
మళ్లీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఒక టన్ను బరువుగల రోబోను అమెరికా అంగారక గ్రహంపైకి పంపించింది. ఈ రోవర్ పరిశోధనలు ఇంకా కొనసాగుతున్నాయి.
యూరోప్ అంతరిక్ష సంస్థ కూడా వచ్చే ఏడాది మార్స్ పైకి 'రోసాలిండ్ ఫ్రాంక్‌లిన్' అనే రోవర్‌ను పంపించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో రష్యా కూడా భాగం పంచుకుంటోంది.
గతంలో యూరోప్ రెండుసార్లు మార్స్ పైకి రోవర్‌ను దింపే విఫలయత్నాలు చేసింది.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- చైనా: సరికొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా భారీ రాకెట్ ప్రయోగం
- అంగారక గ్రహం మీద విజయవంతంగా ఎగిరిన నాసా హెలికాప్టర్
- మార్స్ మీద మొదటిసారిగా శ్వాసించదగిన ఆక్సిజన్ తయారు చేసిన నాసా రోవర్
- మేడ మీదే విమానం తయారీ
- చైనా రాకెట్ భూమ్మీదకు దూసుకొచ్చింది... ముక్కలు ముక్కలై హిందూ మహాసముద్రంలో పడిపోయింది
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- చైనా సైన్యం 'కెప్టెన్ అమెరికా', 'ఐరన్ మ్యాన్' లాంటి సూపర్ హీరోలను సృష్టిస్తోందా
- సైన్యంలో చేరాలని రెండు సార్లు ఫెయిలైన వ్యక్తి ఇప్పుడు దేశాన్నే గుప్పిట్లో పెట్టుకున్నాడు
- రఫేల్ విమానాల విషయంలో ఎవరి మాటల్లో నిజముంది?
- ‘నేవీ నుంచి బయటపడటానికి విమానాన్ని దొంగిలించా’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








