చైనా: సరికొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా భారీ రాకెట్ ప్రయోగం

ఫొటో సోర్స్, Getty Images
సరికొత్త శాశ్వత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసేందుకు కీలకమైన రాకెట్‌ను చైనా ప్రయోగించింది. చైనా ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న అంతరిక్ష కార్యక్రమంలో ఇది తాజా ప్రయత్నం.
సిబ్బందికి నివాసిత గృహాలతో సహా ఉన్న టియాన్‌హే మాడ్యూల్ ను లాంగ్ మార్చ్ -5బి రాకెట్ ద్వారా వెన్చాంగ్ స్పేస్ కేంద్రం నుంచి ప్రయోగించారు.
ఇది 2022 నాటికి సిద్ధమవుతుందని చైనా భావిస్తోంది.
ప్రస్తుతం కక్ష్యలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) మాత్రమే ఉంది. చైనా ఇందులో భాగంగా లేదు.
అంతరిక్ష పరిశోధనల రంగంలో చైనా కాస్త ఆలస్యంగా ప్రవేశించింది. చైనా తొలి వ్యోమగామిని కక్ష్యలోకి తొలి సారి 2003లోనే పంపింది. అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపిన దేశాల్లో సోవియెట్ యూనియన్, అమెరికాల తర్వాత చైనా మూడవ స్థానంలో ఉంది.
ఇప్పటి వరకు చైనా కక్ష్యలోకి రెండు అంతరిక్ష కేంద్రాలను పంపింది. అందులో టియాంగాంగ్ -1, టియాంగాంగ్ -2 ట్రయల్ స్టేషన్లలో వ్యోమగాములకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉండటానికి అనుమతించాయి.
కొత్త 66-టన్నుల మల్టీ-మాడ్యూల్ టియాంగాంగ్ స్టేషన్ కనీసం 10 సంవత్సరాలు పని చేసే విధంగా రూపొందించారు.
అందులో టియాన్హే కీలకమైనది. ఇది 16.6 మీటర్ల పొడవు , 4.2 మీటర్ల వెడల్పు ఉంటుంది.
ఇది వ్యోమగాములకు అవసరమైన పవర్, ప్రొపల్షన్, లైఫ్ సపోర్ట్ సాంకేతికతతో పాటు వారు నివసించేందుకు కూడా వీలుంటుంది.
వచ్చే సంవత్సరం ఈ అంతరిక్ష కేంద్రం నిర్మాణం పూర్తయ్యే లోపు ఇలాంటి మరో 10 ప్రయోగాలను చేయడం ద్వారా అవసరమైన అదనపు పరికరాలను కక్ష్యలోకి చేర్చాలని బీజింగ్ భావిస్తోంది. ఇది భూమికి 340 - 450 కిలోమీటర్ల ఆల్టిట్యూడ్ లో పరిభ్రమిస్తుంది.
ప్రస్తుతం కక్ష్యలో ఉన్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను రష్యా, అమెరికా, కెనడా, యూరోప్, జపాన్ లు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఇందులో చైనాను చేరనివ్వకుండా నిరోధించారు.
ఐఎస్ఎస్ 2024లో కక్ష్య నుంచి రిటైర్ అయ్యే సమయానికి, టియాంగోన్గ్ మాత్రమే కక్ష్యలో ఏకైక అంతరిక్ష కేంద్రంగా మిగులుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
స్టీఫెన్ మెక్ డోనెల్
చైనా ప్రతినిధి విశ్లేషణ
చైనా తన ప్రతిష్ట గురించి ప్రచారం చేసుకుంటున్న వీడియోలలో ప్రతి సారి ఆ దేశ అంతరిక్ష కార్యక్రమం ప్రస్తావన ఉండకుండా ఉండదు.
ప్రపంచ దేశాలతో వేగంగా పోటీపడుతున్న చైనాకు భూమికి అవతల కూడా ప్రతిష్టాత్మక ప్రణాళికలు ఉన్నాయి.
అంతర్జాతీయ అంతరిక్ష కార్యక్రమంలో చేరేందుకు అమెరికా చైనాను నిరోధించడంతో బీజింగ్ సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంది.
వచ్చే సంవత్సరానికి ఇది తయారయ్యే సమయానికి అంతర్జాతీయ కేంద్రంలో కేవలం పావు పరిమాణంలోనే ఉన్నప్పటికీ, మరే ఇతర దేశానికి అప్పటికి సొంత అంతరిక్ష కేంద్రాలు ఉండవు.
చైనాకి మార్స్ పైకి వెళ్లే మిషన్ తో పాటు, రష్యాతో కలిసి చంద్రమండలానికి వెళ్లే ప్రణాళికలు ఉన్నాయనే మాటలు ఇక్కడ వినిపిస్తున్నాయి.
కోల్డ్ వార్ సమయంలో అంతరిక్షంలో జాగా కోసం జరిగిన పోటీతో దీనిని పోల్చవచ్చు. ఈ ప్రాజెక్టుల పై భారీగా వెచ్చించిన నిధులను సమర్ధించుకోవడానికి అంతర్జాతీయంగా ఉన్న అపనమ్మకం, చట్టబద్ధమైన శాస్త్రీయ లక్ష్యాలు, అంతరిక్షాన్ని అదుపులో ఉంచుకోవాలనే ఆలోచన, కొన్ని కీలకమైన ప్రాజెక్టుల గురించి చైనా ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

ఫొటో సోర్స్, Reuters
చైనా అంతరిక్ష కలలు
"ఈ ప్రాజెక్టు చాలా కీలకమైనది" అని చైనా అంతరిక్ష కార్యక్రమంలో నిపుణులు చెన్ లాన్ ఏఎఫ్ పి వార్తా సంస్థకు చెప్పారు.
"ఇది చైనాకు అత్యంత భారీ అంతర్జాతీయ అంతరిక్ష సహకారం కానుండటంతో దీనికి చాలా ప్రాముఖ్యం ఉంది" అని ఆయన అన్నారు.
చైనా తన అంతరిక్ష కార్యక్రమ ప్రణాళికల గురించి రహస్యంగా ఉంచలేదు.
చైనా అంతరిక్ష కార్యక్రమాలకు చాలా భారీగా నిధులు కేటాయించింది.
చైనా 2019లో సిబ్బంది లేకుండా చంద్ర మండలానికి రోవర్ను పంపిన తొలి దేశంగా నిలిచింది.
చైనా నిర్వహిస్తున్న అంతరిక్ష కార్యక్రమానికి దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా మద్దతు పలుకుతున్నారు.
చైనా మీడియా చైనా అంతరిక్ష కలలను జాతీయ పునరుద్ధరణకు మరో అడుగుగా చెబుతూ దీనికి సంబంధించిన కార్యక్రమాలను తరచుగా ప్రసారం చేస్తూ ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- అంగారకుడి మీద ఒకప్పుడు ప్రవహించిన నీరంతా ఆ గ్రహం పైపొరలోనే బందీగా ఉందా?
- స్కైల్యాబ్: ‘అంతరిక్షంలో వ్యోమగాముల తిరుగుబాటు’ వెనకున్న అసలు కథ ఇది..
- కరోనావైరస్: భారతదేశంలో 3 లక్షలు దాటిన రోజువారీ కోవిడ్ కేసులు... యూపీలో ఒకే రోజు 34 వేల మందికి వైరస్
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విశాఖపట్నం: మహానగరం మధ్యలో అభయారణ్యం... అందులో రహస్య గిరిజన గ్రామం...
- వంటకాల కోసం తగువులాడుకుంటున్న దేశాలు... భారత్, పాకిస్తాన్ల మధ్య కూడా ఓ వివాదం
- చైనా, తైవాన్: రెండు దేశాల మధ్య పైనాపిల్ యుద్ధం
- బానిసలుగా వచ్చి బాద్‌షాలయ్యారు
- తైవాన్: స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశం
- ఫ్రెండ్స్ సమక్షంలో పూలతో ప్రపోజ్ చేసి, హగ్ చేసుకున్న ప్రేమ జంట... బహిష్కరించిన యూనివర్సిటీ
- 173 మందితో వెళ్తున్న విమానంలో మంటలు చెలరేగితే ల్యాండింగ్‌కు అనుమతి ఇచ్చారు.. తరువాత ఏమైందంటే
- నరేంద్ర మోదీ: ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో కోవిడ్ వ్యాక్సిన్ల వృధా 10 శాతం పైనే ఉంది’’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








