అమెరికాలో కరోనావైరస్ జూలై 4 'ఇండిపెండెన్స్ డే'తో అంతమైపోతుందన్న బైడెన్ - Newsreel

జో బైడెన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనావైరస్‌ను మహమ్మారిగా ప్రకటించిన సరిగ్గా ఏడాది పూర్తయిన రోజున బైడెన్ ప్రసంగించారు

ప్రజలందరికీ టీకాలు అందినట్లయితే జులై 4 తేదీన అమెరికా కోవిడ్‌-19 మహమ్మారి నుంచి విముక్తమవుతుందని ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్‌ అన్నారు. మే 1 నాటికి అర్హులైన వయోజనులందరికీ వ్యాక్సీనేషన్‌ పూర్తి చేయాలని తాను రాష్ట్రాలకు సూచిస్తానని తొలి ప్రైమ్‌టైమ్‌ స్పీచ్‌లో బైడెన్‌ వెల్లడించారు.

కోవిడ్‌ వైరస్‌ను ప్రపంచ మహమ్మారిగా ప్రకటించి సరిగ్గా ఏడాది అయిన రోజునే బైడెన్‌ ఈ ప్రకటన చేశారు. బ్రిటన్‌ నుంచి స్వాతంత్ర్యం పొందిన రోజైన జూలై 4న గత ఏడాది అమెరికాలో వేడుకలు జరుపుకోవడానికి వీలు పడలేదు.

"వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముగిస్తే జులై 4న అందరం పండగ చేసుకోవచ్చు. కలిసి తినొచ్చు, తిరగొచ్చు. ఇరుగు పొరుగుతో మమేకం కావచ్చు. అదే రోజును మనం కోవిడ్‌ నుంచి విముక్తి పొందిన స్వాతంత్ర్య దినంగా జరుపుకోవచ్చు''అని బైడెన్‌ అన్నారు. పెద్దపెద్ద ఈవెంట్‌లు కాకపోయినా, చిన్నచిన్న వేడుకలను అప్పటి నుంచి జరపుకోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇప్పటి వరకు అమెరికాలో కరోనా వైరస్‌ కారణంగా ఐదు లక్షలమందికి పైగా మరణించారు. ఇది మొదటి, రెండో ప్రపంచ యుద్ధాలు, వియాత్నాం వార్‌ సందర్భంగా మరణించిన వారికన్నా ఈ సంఖ్య ఎక్కువ.

నిఖిలేశ్వర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

నిఖిలేశ్వర్

ఫొటో సోర్స్, Nikhileshwar/FB

మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE
line

నిఖిలేశ్వర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం

కవి నిఖిలేశ్వర్‌కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. దిగంబర కవులలో ఒకరుగా సుపరితులైన నిఖిలేశ్వర్ రచించిన 'అగ్నిశ్వాస' కవితా సంపుటి 2020 సంవత్సరం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికైంది.

దిగంబర కవులు ప్రకటించిన మూడు సంపుటాలలో 'ధర్మాగ్రహాన్ని' ప్రకటించిన నిఖిలేశ్వర్ విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక కార్యదర్శిగా పని చేశారు. మండుతున్న తరం, నాలుగు దశాబ్దాల సాక్షిగా నా మహానగరం, యుగస్వరం, అగ్నిశ్వాస వంటి రచనలను వెలువరించిన నిఖిలేశ్వర్ ప్రస్తుతం 'నిఖిలలోకం' పేరుతో తన సాహితీ జీవనయాత్రను గ్రంథస్థం చేసే పనిలో ఉన్నారు.

నిఖిలేశ్వర్ అసలు పేరు కుంభం యాదవరెడ్డి. నల్లగొండ జిల్లాలో ఈనాటి యాదాద్రి జిల్లాలోని వీరెల్లి గ్రామంలో 1938 ఆగస్ట్ 11న జన్మించారు. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్భంగా వచ్చిన 'గోలకొండ' సంచికలో ఆయన తొలి రచన 'టెలివిజన్ ఎలా పని చేస్తుంది' అచ్చయింది. కవిగానే కాకుండా కథకుడిగా, విమర్శకుడిగానూ ఆయన పేరు తెచ్చుకున్నారు. 22 కథలతో ఆయన 'నిఖిలేశ్వర్ కథలు' ప్రచురించారు.

నిఖిలేశ్వర్‌తో పాటు 2020 సంవత్సరానికి కన్నెగంటి అనసూయకు కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారం లభించింది. మానస ఎండ్లూరి రచించిన 'మిళింద' కథా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ యువ సాహితీ పురస్కారం లభించింది.

line

పింగళి వెంకయ్యకు 'భారతరత్న' పురస్కారం ఇవ్వాలని మోదీకి జగన్ లేఖ

వైఎస్ జగన్
ఫొటో క్యాప్షన్, పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మితో పాటు వారి కుటుంబ సభ్యులను కలిసిన సీఎం జగన్

జాతీయ జెండా రూపకర్తగా పింగళి వెంకయ్యకు భారత రత్న(మరణానంతరం) ప్రకటించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌'లో భాగంగా 'హర్ ఘర్ పర్ జెండా' కార్యక్రమానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పింగళి వెంకయ్యకు గుర్తింపు అవసరం అని జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం సీఎం జగన్ గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి వెంకయ్య కుటుంబాన్ని కలిశారు. పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మిని సన్మానించారు. పింగళి జీవిత విశేషాలతో కూడిన చిత్ర ప్రదర్శనను ముఖ్యమంత్రి తిలకించారు.

ముఖ్యమంత్రి స్వయంగా తమ నివాసానికి రావడంతో సీతామహలక్ష్మి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. సీఎంకు పింగళి జీవిత చరిత్ర పుస్తకం అందజేశారు. పింగళి కుటుంబంతో జగన్ కొద్దిసేపు ముచ్చటించారు.

పింగళి వెంకయ్య కుటుంబాన్ని కలుసుకున్న ఏపీ సీఎం జగన్

పింగళి వెంకయ్య కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం తరుపున రూ. 75లక్షల ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు. ఆ మేరకు యువజన సర్వీసుల శాఖ తరపున జీవో నెం. 33 కూడా విడుదల చేశారు.

అనంతరం సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. గాంధేయ మార్గంలో స్వతంత్ర్యపోరాటంలో పాల్గొన్న పింగళి వెంకయ్య వివిధ అంశాలపై శాస్త్రీయ దృక్పథంతో కృషి చేశారని లేఖలో పేర్కొన్నారు. దేశానికి ప్రాతినిధ్యం వహించే జెండా రూపకల్పన కోసం ఆయన ఎంతో శ్రమించారని తెలిపారు.

పింగళి వెంకయ్య 1918లో ఏ నేషనల్ ఫ్లాగ్ ఫర్ ఇండియా అంటూ బుక్ లెట్ ప్రచురించారని కూడా తన లేఖలో గుర్తు చేసిన జగన్, అందులో 30 రకాల జాతీయ పతాకాల డిజైన్లను తీర్చిదిద్ది, 1921లో విజయవాడ కాంగ్రెస్ సభలో మహాత్మా గాంధీకి ఆయన వాటిని అందించారని వివరించారు. 1947 జూలై 22 న రాజ్యాంగ సభ జాతీయ పతాకంగా దానిని ఆమోదించిందని చెప్పారు.

పీఎం మోదీకి వైఎస్ జగన లేఖ
ఫొటో క్యాప్షన్, పీఎం మోదీకి వైఎస్ జగన లేఖ

దేశం కోసం తన సేవలందించిన మహానీయుడికి తగిన గుర్తింపు అవసరం అని సీఎం అభిప్రాయపడ్డారు. ఆయన మరణించి చాలాకాలం అయినప్పటికీ తగిన గుర్తింపు రాలేదని, ఇప్పటికైనా భారతరత్న ప్రకటించి ఆయనను గౌరవించాలని కోరారు.

గతంలో భుపేంద్ర కుమార్ హజారికా, నానాజీ దేశ్ ముఖ్ వంటి వారికి మరణానంతరం భారతరత్న ప్రకటించినందున, అదే విధంగా పింగళి వెంకయ్యను భారతరత్నగా గుర్తించాలని జగన్ తన లేఖలో కోరారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 10,000 పరుగులు సాధించిన తొలి మహిళ మిథాలీ రాజ్

మిథాలీ రాజ్ ఆడకపోవడం వల్లేనా

ఫొటో సోర్స్, TWITTER @M_RAJ03

ఫొటో క్యాప్షన్, మిథాలీ రాజ్

భారత మహిళా క్రికెటర్, హైదరాబాదీ మిథాలీ రాజ్‌ మరో ఘనతను సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు చేసిన మొదటి భారత మహిళా క్రికెటర్ అయ్యారు.

మిథాలీ రాజ్ శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్లలో కలిపి పది వేల పరుగులు చేసిన మొదటి భారత మహిళా క్రికెటర్‌ అయ్యారు.

దక్షిణాఫ్రికా, భారత్ మహిళా టీమ్స్ మధ్య లఖ్‌నవూలోని ఎకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మూడో వన్డేలో మిథాలీ ఈ ఘనత అందుకున్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

మిథాలీ 10 వేల పరుగులు మైలురాయికి చేరువైన తర్వాత బంతికే అవుట్ అయ్యారు. కెరీర్‌లో తన 212వ వన్డే మ్యాచ్‌ ఆడుతున్న మిథాలీ, బోశ్చ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యే ముందు 36 పరుగులు చేశారు.

38 ఏళ్ల కుడిచేతి బ్యాటర్ మిథాలీ రాజ్ అత్యధికంగా వన్డేల్లో 6,974 పరుగులు చేశారు. టీ20ల్లో 2,364, 10 టెస్టుల్లో 663 పరుగులు చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

మిథాలీ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో పది వేల పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్ అయ్యారు.

మిథాలీ కంటే ముందు ఇంగ్లండ్‌ మహిళా క్రికెటర్ చార్లొటే ఎడ్వర్డ్స్ ఈ ఫీట్ సాధించారు. ఆమె అన్ని ఫార్మాట్లలో 10, 273 పరుగులు చేసి టాప్‌లో ఉన్నారు.

మిథాలీరాజ్ 1999 జూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

అరుదైన ఫీట్ సాధించిన మిథాలీ రాజ్‌కు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

భారత్-దక్షిణాఫ్రికా మధ్య ప్రస్తుతం జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటివరకూ రెండు జట్లూ 1-1తో సమంగా ఉన్నాయి.

line

'ఈ సింహం పిల్లలు ఇక చాలు': నెదర్లాండ్స్ జూలో సింహానికి 'వేసక్టమీ' ఆపరేషన్

సింహానికి వేసక్టమీ ఆపరేషన్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, నెదర్లాండ్ జూలో సింహానికి వేసక్టమీ ఆపరేషన్

నెదర్లాండ్స్‌లోని ఒక జూలో గత ఏడాది ఐదు కూనలకు తండ్రి అయిన ఒక సింహానికి 'వేసక్టమీ' ఆపరేషన్ చేశారు.

'థార్' అనే 11 ఏళ్ల మగ సింహాన్ని రెండు ఆడ సింహాలతో జత కలిపారు. వాటిలో మొదటి దానికి రెండు, రెండో దానికి మూడు కూనలు పుట్టాయి.

"థార్‌కు పిల్లలు పుడతాయని నిరూపితం అయ్యింది కాబట్టి, మేం దానికి ఆ ఆపరేషన్ చేసేశాం" అని రాయల్ బర్గెర్స్ జూ చీఫ్ వెటర్నరీ డాక్టర్ ఆనమ్ చెప్పారు.

గత 20 ఏళ్లలో సింహాల జనాభా 30 నుంచి 50 శాతం తగ్గిపోయిందని వరల్డ్ వైడ్ వైల్డ్‌లైఫ్ ఫండ్ చెబుతోంది.

కానీ, గురువారం థార్‌కు వేసక్టమీ ఆపరేషన్ చేసిన వెటర్నరీ డాక్టర్ హెంక్ లూటెన్ మాత్రం తమ జూలో థార్ డీఎన్ఏ ఇప్పటికే తగినంత ఉందని చెప్పారు.

"మా దగ్గర దాని కూనలు చాలా ఉన్నాయి. దాని జన్యు సమూహం ఎక్కువగా ఉండాలని మేం అనుకోవడం లేదు" అని ఆయన రాయిటర్స్‌కు చెప్పారు.

థార్ సింహం

ఫొటో సోర్స్, BURGERSZOO.NL

ఫొటో క్యాప్షన్, 11 ఏళ్ల థార్‌కు ఆపరేషన్ విజయవంతం అయ్యింది

జూలు ఊడిపోకుండా...

సింహాలకు వేసక్టమీ ఆపరేషన్ చేయడం చాలా అరుదు, ఇంతకు ముందు ఇలా జరిగినట్టు ఎవరూ వినలేదు.

"నేను ఇక్కడ వెటర్నరీ డాక్టరుగా ఉన్న 35 ఏళ్లలో ఒక సింహానికి ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇదే మొదటిసారి" అని లుటెన్ చెప్పారు.

ఈ సింహానికి కాస్ట్రేషన్ (వీర్యహరణం)కూడా చేసుండచ్చని, కానీ దానివల్ల ఈ సింహం జూలు ఊడిపోవడానికి కారణం అవుతుందని డాక్టర్ చెప్పారు.

కాస్ట్ర్టేషన్ వల్ల టెస్టోస్టెరాన్ లోపం కూడా తలెత్తుతుందని, అలా థార్ మందలో తన స్థానాన్ని కూడా కోల్పోయి ఉండేదని తెలిపారు. అందుకే దానికి 'వేసక్టమీ' చేశామని స్పష్టం చేశారు.

దాడికి గురవుతున్న జంతువుల్లో డబ్ల్యుడబ్ల్యుఎఫ్ సింహాలను కూడా చేర్చింది. అంటే, అడవుల్లో సింహాలు అంతరించిపోయే ప్రమాదాన్ని తీవ్రంగా ఎదుర్కుంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)