చైనా, మాల్దీవుల రుణ వివాదం: 'మా తాతల ఆస్తులు అమ్మినా మీ అప్పు తీర్చలేం'

ఫొటో సోర్స్, WPA Pool/Getty Images
చైనా నుంచి తీసుకున్న రుణాలపై మాల్దీవుల ప్రభుత్వం ఆందోళన ప్రకటిస్తూనే ఉంది. గతవారం ఈ వివాదం ట్విటర్ వేదికగా బయటకు వచ్చింది.
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంటు స్పీకర్ మహ్మద్ నాషీద్, మాల్దీవుల చైనా రాయబారి జాంగ్ లిజాంగ్ మధ్య ఇటీవల ట్విటర్‌లో మాటల యుద్ధం జరిగింది.
రాబోయే రెండువారాల్లో పెద్ద మొత్తంలో అప్పును చైనా బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉందని నాషీద్ డిసెంబర్ 11న ఒక ట్వీట్ చేశారు.
దీన్ని చైనా రాయబారి ఖండించారు. తీర్చవలసిన అప్పుడు నాషీద్ చెబుతున్నంత పెద్ద మొత్తం కాదని ట్వీట్ చేశారు.
మాల్దీవుల్లో మహ్మద్ నాషీద్ అత్యత ప్రజాదరణ పొందిన నాయకుడిగా పేరు పొందారు. ఆయనను భారత్‌కు అనుకూలమైన వ్యక్తిగా కూడా భావిస్తారు.
"రాబోయే 14 రోజుల్లో 1.5 కోట్ల డాలర్లకు పైగా అప్పును చైనా బ్యాంకుకు చెల్లించాల్సి ఉంది. ఈ చెల్లింపుల విషయంలో చైనా మాకు ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు. ఈ మొత్తం అప్పు, మాల్దీవుల ప్రభుత్వ ఆదాయంలో సుమారు 50 శాతానికి సమానం. కోవిడ్ సంక్షోభం తరువాత మాల్దీవులకు కోలుకోవడానికి కొంత సమయం కావాలి" అని నాషీద్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇది పోస్ట్ చేసిన రెండు గంటల్లోనే చైనా రాయబారి జాంగ్ లిజాంగ్ మరో ట్వీట్ చేశారు. "బ్యాంకుల నుంచీ నాకొచ్చిన సమాచారం ప్రకారం 14 రోజుల్లో 1.5 కోట్ల డాలర్లను చెల్లించాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్ పుస్తకాలను మరొకసారి చెక్ చేసుకోండి. ఈ మొత్తాన్ని మీ బడ్జెట్‌కోసం దాచుకోండి, చీర్స్" అని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అయితే, డిసెంబర్ 12న జాంగ్ లిజాంగ్ మరొక ట్వీట్‌లో, "నేను కొంత హోమ్ వర్క్ చేసాను. 2020లో 17,19,535 డాలర్ల రుణం చెల్లించాలన్నది నిజమే. హుల్హుమలే ఫేజ్ II 1530 హౌసింగ్ యూనిట్ కోసం తీసుకున్న అప్పు 23,75,000 వేల డాలర్లను మూడవ దేశానికి చెందిన బ్యాంకుకు చెల్లించాలి. సీబీడీకి కాదు. స్టెల్కో ప్రోజెక్ట్‌కు, 2021 జనవరిలో మొదటి బాకీ చెల్లించాలి" అని ట్వీట్ చేస్తూ కొన్ని పత్రాల స్క్రీన్‌షాట్లను కూడా పోస్ట్ చేసారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఒక ట్వీటర్ యూజర్, చైనా రాయబారి ట్వీట్‌కు స్పందనగా..2018 డిసెంబర్ 31 నాటి మాల్దీవుల ఆర్థిక శాఖ ప్రకటనను జత చేస్తూ, "2018 వార్షిక నివేదిక ప్రకారం, హుల్హుమలే ఫేజ్ 3లో 1530 హౌసింగ్ యూనిట్ కోసం హెచ్‌డీసీ, సీబీడీ దగ్గర 4.2 కోట్ల డాలర్ల ఋణం తీసుకుంది. ఈ ఋణం చెల్లిచాల్సిన సమయం వచ్చినప్పుడు, మీరెలాగూ అంత మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదని ఖండిస్తున్నారు కాబట్టి.. బాకీ సొమ్ముకు బదులు మీరు పోస్ట్ చేసిన స్క్రీన్ షాట్లను పంపిస్తే ఫరవాలేదా?" అంటూ ట్వీట్ చేశారు.
దీనికి చైనా రాయబారి ఎటువంటి జవాబూ ఇవ్వలేదు. కానీ, నాషీద్ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. చైనా రాయబారి లిజోంగ్‌ను ఉద్దేశిస్తూ..."మీరు చూపిస్తున్న అభిమానానికి ధన్యవాదాలు. చైనాతో మాకున్న సంబంధాలకు మేము ఎంతో విలువ ఇస్తాం. ఈ ఋణాల విషయాన్ని చివరి నిముషం వరకూ వాయిదా వెయ్యకుండా ఇప్పుడే పరిష్కరించుకుందాం. ఈ ఋణాలను చెల్లించడానికి మాల్దీవులకు మరొక 2 సంవత్సరాలు వ్యవధి కావాలి లేదంటే మేమెప్పటికీ ఆ అప్పును తీర్చలేం" అని డిసెంబర్ 12న ట్వీట్ చేశారు.
నాషీద్ ట్వీట్‌కు చైనా రాయబారి సానుకూలంగా స్పందిస్తూ..."రెండు దేశాల మధ్య ఉన్న సంప్రదాయ స్నేహాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నందుకు గౌరవనీయులైన స్పీకర్‌ను అభినందిస్తున్నాను. ఋణాల విషయమై చర్చ ఇప్పటికే ప్రారంభమైంది. ఉమ్మడి ప్రయత్నాలతో ఇరు దేశాలకు లాభదాయకంగా ఉండే పరిష్కారాన్ని కనుగొనగలమని ఆశిస్తున్నాను" అంటూ జవాబిచ్చారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఇంతకుముందు కూడా ట్వీటర్ వేదికపై మాటల యుద్ధం జరిగింది
మాల్దీవుల్లో ప్రస్తుత చైనా రాయబారికి అనేకమంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఆ దేశ మాజీ అధ్యక్షులు అబ్దుల్లా యామీన్ మద్దతుదారులు చైనా రాయబారికి బహిరంగంగా మద్దతు తెలుపుతుంటారు. 2013లో పదవిలోకి వచ్చిన యామీన్ భారత్‌కన్నా చైనాతో దగ్గర సంబంధాలను కొనసాగించారు. కొన్ని ప్రోజెక్టుల విషయంలో చైనా సహకారాన్నే ఎంచుకున్నారు. మాల్దీవుల్లో ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి చైనా రాయబారి తమకు సహకరిస్తారని యామీన్ అభిమానులు విశ్వసిస్తున్నారు.
అయితే, ప్రస్తుత ప్రభుత్వం భారతదేశంతో దగ్గర సంబంధాలు నెరుపుతోంది. ఈ ఏడాది నవంబర్‌లో నాషీద్ "మాల్దీవుల ప్రజలు తమ తాతల సొత్తు అమ్ముకున్నాగానీ చైనా ఋణాలను చెల్లించలేరు" అని ఒక ట్వీట్‌లో అన్నారు.
దీనికి జవాబిస్తూ "తాతల సొమ్ముకు ఒక ధర ఉంటుంది. కానీ, వెల కట్టలేని మాల్దీవుల స్నేహానికి మేము ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాం" అని చైనా రాయబారి బదులిచ్చారు.
మాల్దీవులు చైనానుంచీ 3.1 బిలియన్ డాలర్లు ఋణాన్ని తీసుకున్నట్లు నాషీద్ సెప్టెంబర్‌లో బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇందులో చైనా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల వాటా ఉందని నాషీద్ తెలిపారు.
2018లో నషీద్ పార్టీ..మాల్దీవియన్ డెమొక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ఋణం 1.5 బిలియన్ డాలర్లు ఉందని భారత ప్రభుత్వం అంచనా వేసింది.
నాషీద్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ వారి ప్రభుత్వం, భారత్‌నుంచీ ఆర్థిక సహాయం తీసుకుంటోంది. భారత్, మాల్దీవులకు 1.4 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
చైనా, భారత్‌ల గురించి మాల్దీవుల్లో చర్చ
చైనా, ఇండియాల గురించి మాల్దీవుల రాజకీయల్లో వేడి వేడి చర్చలు జరుగుతుంటాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌లో మాల్దీవుల్లో సోషల్ మీడియాలో ‘ఇండియా అవుట్’ ప్రచారం జోరుగా సాగింది. ఈ ప్రచారం వెనుక ఐసిస్ హస్తం ఉందని, మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారని నాషీద్ తెలిపారు.
అయితే, మాల్దీవుల్లో భారత సైనికుల ఉనికి, ఆ దేశ సార్వభౌమత్వానికి, స్వాతంత్ర్యానికి భంగం అని మాల్దీవుల ప్రధాన ప్రతిపక్షం భావిస్తోంది.
ప్రతిపక్ష పార్టీ ఆరోపణలపై స్పందిస్తూ.."బలపడుతున్న ద్వైపాక్షిక సంబంధాలను జీర్ణించుకోలేనివారు ఇలాంటి ఆరోపణలే చేస్తారని" ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్దుల్లా అన్నారు.
ఇండియా మద్దతిస్తున్న ఒక స్ట్రీట్ లైటింగ్ ప్రోజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా అబ్దుల్లా మాట్లాడుతూ..."ఈ రెండు దేశాల మధ్య సంబంధం హృదయాలతో ముడిపడి ఉన్నది. దీనికి మేము సదా కృతజ్ఞులం" అని పేర్కొన్నారు.
ఆగస్ట్‌లో మాల్దీవుల కోసం ఇండియా 50 కోట్ల డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇందులో 10 కోట్ల డాలర్ల గ్రాంట్ కూడా ఉంది. అంతకుముందు 2018లో 80 కోట్ల డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: ప్రపంచమంతా సుగంధ ద్రవ్యాలకు భారీగా పెరిగిన గిరాకీ.. పండించే రైతులకు మాత్రం కష్టాలు రెట్టింపు
- సూడాన్ ఖల్వాస్: విద్యార్థులకు జంతువులకు వేసినట్లు సంకెళ్లు వేసే బడిలో బీబీసీ రహస్యం చిత్రీకరణ
- ఎవరెస్టు శిఖరం ఎత్తు సుమారు ఒక మీటరు పెరిగింది.. ఇదెలా సాధ్యమైంది?
- రైతుల నిరసనలు: మోదీ మంచి వక్త... కానీ, రైతులతో ఎందుకు మాట్లాడలేకపోతున్నారు?
- ఇచట వివాహేతర సంబంధాలు తెంచబడును!
- మహిళల శరీరాలు ఎప్పుడంటే అప్పుడు సెక్స్‌కు సిద్ధంగా ఉంటాయా?
- ’నా భర్త నా కిడ్నీ దొంగిలించాడు’
- నల్లగా ఉన్నావంటూ భర్త చేసే వేధింపులకు తట్టుకోలేక భార్య ఆత్మహత్య
- #HerChoice: నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!
- లాక్డౌన్ ఎఫెక్ట్: విపరీతంగా పెరిగిన రివెంజ్ పోర్న్ కేసులు
- "చపాతీని కొలవడానికి నా భర్త రోజూ స్కేలు తీసుకొని భోజనానికి కూర్చుంటాడు!"
- మొరటు శృంగారానికి, లైంగిక దాడికి తేడా ఏంటి?
- చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








