కొత్త పార్లమెంటు భవనానికి డిసెంబర్ 10న ప్రధాని మోదీ శంకుస్థాపన: స్పీకర్ ఓం బిర్లా వెల్లడి - Newsreel

ఫొటో సోర్స్, @loksabhaspeaker
భారతదేశ కొత్త పార్లమెంటు భవనం నిర్మాణానికి డిసెంబర్ 10వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేస్తారని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
ఈ ప్రాజెక్టు వ్యయం 971 కోట్ల రూపాయలని, నిర్మాణ పనులను టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారని చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ భవనం డిజైన్‌ను రూపొందించినట్లు స్పీకర్ చెప్పారు.
మొత్తం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించే కొత్త పార్లమెంటు భవనం భారతదేశపు భిన్నత్వాన్ని ప్రతిబింబించేలా ఆత్మనిర్భర్ భారత్ దేవాలయంలా ఉంటుందని ఆయన అభివర్ణించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
కొత్త భవనం ప్రస్తుత పార్లమెంటు భవనం కన్నా 17,000 చదరపు మీటర్ల మేర పెద్దదిగా ఉంటుందని చెప్పారు.
అందులో లోక్‌సభ సభ్యుల కోసం సుమారు 888 సీట్లు, రాజ్యసభ సభ్యుల కోసం 326 కన్నా ఎక్కువ సీట్లు ఉంటాయని వివరించారు. లోక్‌సభలో ఏక కాలంలో 1,224 మంది సభ్యులు కూర్చునేందుకు వీలు ఉంటుందని తెలిపారు.
భారత స్వాతంత్ర్యానికి 75వ వార్షికోత్సవం పూర్తయిన సందర్భంగా కొత్త పార్లమెంటు భవనంలో ఉభయసభల సమావేశాలను ప్రారంభిస్తామని స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు.

చంద్రుడిపై ఎర్ర జెండా పాతిన చైనా.. ప్రపంచంలో రెండో దేశం

ఫొటో సోర్స్, CNSA/CLEP
చంద్రుడి మీద చైనా తన దేశ జెండాను పాతింది. చందమామ మీద మొట్టమొదటిగా అమెరికా తన జెండాను పాతి 50 ఏళ్లకు పైగా దాటిన తర్వాత.. ఆ ఘనత సాధించిన రెండో దేశంగా చైనా నిలిచింది.
చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన ఫొటోల్లో.. ఐదు నక్షత్రాల ఎర్ర జెండా చంద్రుడి ఉపరితలం మీద నిశ్చలంగా నిలిచి ఉండటం కనిపిస్తోంది.
చైనా ప్రయోగించిన చాంగె-5 స్పేస్ ప్రోబ్ చంద్రుడి మీద నుంచి రాళ్ల నమూనాలు తీసుకుని గురువారం తిరిగి బయలదేరటానికి ముందు ఈ పొటోలు తీసింది.
చైనా గతంలో ప్రయోగించిన రెండు లూనార్ మిషన్లు.. ఆయా వాహనాల మీద మాత్రమే చైనా జెండా గుర్తులు ఉన్నాయి. ఆ రెండూ చంద్రుడి మీద జెండా పాతలేకపోయాయి.

ఫొటో సోర్స్, NASA
అమెరికా 1969లో అపోలో-11 మిషన్ సందర్భంగా చంద్రుడి మీద తొలి జెండా పాతింది. అనంతరం 1972 వరకూ అమెరికా సాగించిన చంద్రయానాల్లో మరో ఐదు జెండాలను పాతింది.
వాటిలో ఐదు జెండాలు ఇంకా నిలుచునే ఉన్నాయని శాటిలైట్ చిత్రాలు చెప్తున్నట్లు నాసా 2012లో పేర్కొంది. అయితే.. సూర్యుడి వేడికి ఆ జెండాలు వెలిసిపోయి ఉంటాయని నిపుణులు చెప్తున్నట్లు పలు కథనాలు వచ్చాయి.
మొట్టమొదటి జెండాను అపోలో లూనార్ మాడ్యూల్‌కి అతి దగ్గరగా నాటటం వల్ల.. అది తిరిగిరావటానికి బయలుదేరినపుడు పుట్టిన అగ్ని, పీడనాలకు ఆ జెండా ఎగిరి పోయివుంటుందని చెప్తుంటారు.

కోవిడ్ వ్యాక్సీన్: ప్రజలకు 'స్పుత్నిక్ వీ' వ్యాక్సీన్లు ఇవ్వడం ప్రారంభించన రష్యా

ఫొటో సోర్స్, EPA
రష్యాలో కరోనావైరస్ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యింది. రాజధాని మాస్కోలోని ఆస్పత్రులలో కోవిడ్ రిస్క్ ఎక్కువగా ఉన్నవారికి 'స్పుత్నిక్ వీ' వ్యాక్సీన్ ఇవ్వడం మొదలుపెట్టారు.
రష్యాలోనే తయారైన స్పుత్నిక్ వీ వ్యాక్సీన్‌కు ఆగస్ట్ నెలలో ఆమోద ముద్ర లభించింది. ఇది 95 శాతం సురక్షితమని, సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఉండవని దీని తయారీదారులు చెప్తున్నారు.
ఈ వ్యాక్సీన్‌ను రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోసు తీసుకునేందుకు ఇప్పటికే వేలాది మంది తమ పేర్లను నమోదు చేయించుకున్నారు.
అయితే, ఎంత అధిక స్థాయిలో రష్యా దీన్ని ఉత్పత్తి చెయ్యగలదనే దానిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. ఈ ఏడాది చివరికి 20 లక్షల వ్యాక్సీన్లు మాత్రమే ఉత్పత్తి చెయ్యగలరని భావిస్తున్నారు.
ఈ వారం ప్రారంభంలో వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను ప్రకటించిన మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్.. ముందుగా స్కూళ్లల్లోనూ, ఆరోగ్య సేవలు అందించేవారికి, సోషల్ వర్కర్లకు వ్యాక్సీన్ అందిస్తామని తెలిపారు.

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 15 రోజులకు.. హరియాణా ఆరోగ్య మంత్రికి కోవిడ్ పాజిటివ్

ఫొటో సోర్స్, Getty Images
హరియాణా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్‌కు కరోనా సోకింది.. నవంబర్ 20న ఆయన కోవాక్సిన్ టీకా వేయించుకున్నారు.
తనకు కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయ్యిందని, సివిల్ హాస్పిటల్ అంబాలా కాంట్‌లో చేరానని అనిల్ విజ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
నవంబర్ 20 వ తేదీన ఆయన కరోనావైరస్ టీకా వేయించుకున్నారు. కోవాక్సిన్ మూడో దశ ట్రయిల్స్‌కు వలంటీర్‌గా ముందుకొచ్చి మొట్టమొదటి టీకా వేయించుకున్నారు.
గత కొద్ది రోజులుగా తనతో దగ్గరగా మసిలినవాళ్లందరినీ కరోనా టెస్ట్ చేయించుకోమని అనిల్ విజ్ కోరారు.
అయితే.. కోవాక్సిన్ క్లినికల్ ట్రయిల్స్‌లో భాగంగా 28 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తారని.. రెండో డోసు వేయించుకున్న 14 రోజుల తరువాతే వ్యాక్సీన్ సామర్థ్యం బయటపడుతుందని భారత్ బయోటెక్ సంస్థ పేర్కొంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
‘‘రెండు డోసులూ తీసుకున్న తరువాతే కోవాక్సిన్ ప్రభావం చూపిస్తుంది’’ అని చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- బిచ్చగాడు అనుకుని దానం చేయబోయారు.. ఆయనెవరో తెలిసి సెల్యూట్ చేశారు
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- జర్మనీ: ఇక్కడి ప్రజలు పబ్లిగ్గా న్యూడ్‌గా తిరగడానికి ఎందుకు ఇష్టపడతారు?
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- వ్యాపారం కోసం వచ్చి ఇండియాలో మారణహోమం సాగించిన కంపెనీ కథ
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- తలలోకి పేలు ఎలా వస్తాయి? ఎందుకు వస్తాయి?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- వై.ఎస్.జగన్‌కు వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిశోర్.. బెంగాల్లో మమతను గట్టెక్కించగలరా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








