ఫ్రాన్స్‌లో మరో దాడి.. చర్చి ఫాదర్‌పై కాల్పులు

ఫొటో సోర్స్, Reuters
ఫ్రాన్స్‌లోని లియోన్ నగరంలో జరిగిన కాల్పుల్లో గ్రీక్‌కు చెందిన ఒక చర్చి ఫాదర్ తీవ్రంగా గాయలపాలైనట్లు అధికారులు తెలిపారు.
పోలీసులు వెనువెంటనే సంఘటనా స్థలానికి చేరి, నేరస్థుల కోసం గాలించారు. అనుమానితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
కాల్పుల వెనుక కారణాలు స్పష్టంగా తెలియలేదని, ఈ సంఘటనను హత్యాయత్నంగా భావిస్తూ దర్యాప్తు ప్రారంభించారని అధికారులు తెలిపారు.
దీనికి కొద్దిరోజుల క్రితం నైస్ నగరంలోని చర్చిలో జరిగిన దాడిలో ముగ్గురు మరణించారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ఈ హత్యలను "ఇస్లామిస్ట్ ఉగ్రవాద దాడి"గా పిలిచారు. బహిరంగ ప్రదేశాల్లో, ప్రార్థనా స్థలాల్లో అదనపు సైనిక బలగాలను మోహరించినట్లు తెలిపారు.
లియోన్‌లో శనివారం నాడు స్థానిక సమయం సాయంత్రం నాలుగు గంటలకు ఫాదర్ చర్చిని మూసివేస్తుండగా ఈ కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఒక వ్యక్తి సాన్-ఆఫ్ షాట్‌గన్‌తో కాల్పులు జరిపి అక్కడనుంచీ పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
భద్రతా సిబ్బంది, అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలంలోనే ఉన్నారని, వెనువెంటనే ఆ స్థలాన్ని ఖాళీ చేయవలసిందిగా కోరుతూ ప్రజలను అప్రమత్తం చేసారని ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.
"ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన వివరాలను పోలి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు" లియోన్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నికొలాస్ జాకెట్ శనివారం రాత్రి ప్రకటించారు.
అయితే, పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో అనుమానితుని వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని, ఆ వ్యక్తి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారని ఆయన తెలిపారు.
లియోన్ మేయర్ డౌసెట్ మాట్లాడుతూ "దాడి వెనుక ఉద్దేశాలేమిటో తెలియలేదు" అని రిపోర్టర్లకు తెలిపారు.
కాల్పుల్లో గాయ పడిన చర్చి ఫాదర్‌ను నికొలాస్ కకావెలకిస్‌గా గుర్తించారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పొత్తికడుపులో రెండు సార్లు కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
ఫ్రెంచ్ ప్రధాని జాన్ క్యాస్టెక్స్ మాట్లాడుతూ "ప్రతీ ఒక్కరూ తమ తమ ఇష్టదైవాలను స్వేచ్ఛగా, పూర్తి భద్రతతో ప్రార్థించగలిగేలా" కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఇస్లాం మతాన్ని, ముస్లింలను, ప్రవక్త గొప్పతనాన్ని పశ్చిమ దేశాలు అర్థం చేసుకోలేవు’ - ఇమ్రాన్ ఖాన్
- ‘ఇస్లాం వివాదం’లో ఫ్రాన్స్‌కు భారత్ ఎందుకు మద్దతు ఇస్తోంది?
- ఫ్రాన్స్ లౌకికవాదానికి - ఇస్లాం మతానికి మధ్య ఘర్షణ ఎందుకు వచ్చింది?
- పదహారేళ్లు దాటినా రజస్వల కాకపోతే పెళ్లి చేయొచ్చా? డాక్టరును ఎప్పుడు సంప్రదించాలి
- సీ ప్లేన్: మోదీ ప్రారంభించిన ఈ నీటిపై విమానాలు ఏమిటి? స్పైస్‌జెట్ వీటిని ఎక్కడెక్కడ నడుపుతోంది
- నోబెల్‌కు 5 సార్లు నామినేట్ అయిన ‘భారత అణు కార్యక్రమ పితామహుడు’ మరణానికి కారణమేంటి
- విద్యుత్ కాంతి వలన ఆకాశం కలుషితమవుతోందా?
- ఇందిరా గాంధీ ప్రాణాలు నిలిపేందుకు 80 బాటిళ్ల రక్తం ఎక్కించారు.. ఆ తర్వాత..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








