పాకిస్తాన్‌లో 'అంతర్యుద్ధం' మొదలైందా? - భారత మీడియా కథనాల్లో నిజమెంత?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, అబిద్ హుస్సేన్
- హోదా, బీబీసీ ఉర్దూ, ఇస్లామాబాద్
పాకిస్తాన్‌లోని కరాచీ నగరంలో అంతర్యుద్ధం రాజుకుందంటూ భారతదేశానికి చెందిన వెబ్‌సైట్లు, సోషల్ మీడియాలో ఈ వారం విస్తృతంగా ఫేక్ న్యూస్ చలామణీ అవుతోంది.
ప్రముఖ ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసేలా ఒత్తిడి చేయటానికి రాష్ట్ర పోలీస్ బాస్‌ను సైనిక బలగాలు కిడ్నాప్ చేశాయంటూ పాకిస్తాన్ మీడియాలో వార్తలు రావటంతో ఈ ఫేక్ న్యూస్ వరద మొదలైంది.
కరాచీలో పోలీసులకు, సైన్యానికి మధ్య ఘర్షణలో చాలా మంది పోలీసులు చనిపోయారని, కరాచీ వీధుల్లో యుద్ధ ట్యాంకులు కనిపిస్తున్నాయని చెప్పేంత దూరం ఈ ఫేక్ న్యూస్ పోయింది.
పాక్‌లో అశాంతి అని చెప్తూ ఒక ఫేక్ వీడియో కూడా ట్విటర్‌లో సర్క్యులేట్ అయింది.
కానీ వాస్తవంలో ఇందులో ఏదీ నిజం కాదు.
రాజకీయ నేత అరెస్టు విషయంలో స్థానిక పోలీసులు, ప్రతిపక్ష నాయకులు చాలా మంది ఆగ్రహంతో ఉన్నారు కానీ.. అక్కడ ఎటువంటి హింసా చోటు చేసుకోలేదు.

ఫొటో సోర్స్, AFP
ఆగర్భ శత్రువులుగా ఉన్న పాకిస్తాన్, భారత్‌దేశాలు ఒకదానికి వ్యతిరేకంగా మరొకటి ప్రచారాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటాయన్నది బాగా తెలిసిందే.
యూరప్‌లో ఈ ప్రాంతం పట్ల నిర్ణయాలను ప్రభావితం చేయటం లక్ష్యంగా ఏర్పాటైన భారత్ అనుకూల నకిలీ వెబ్‌సైట్లు, మేధో బృందాలను, పాకిస్తాన్ సైన్యంతో సంబంధం ఉన్న అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను గత ఏడాది ఫేస్‌బుక్ బ్లాక్ చేసింది.
అయితే.. ఈసారి పేరున్న పలు వార్తా సంస్థల అకౌంట్ల నుంచి తమను అనుసరించే లక్షలాది మంది పాఠకులకు పూర్తిగా తప్పుడు వార్తలు పెట్టటం కొత్త పరిణామం.
మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అల్లుడు సఫ్దర్ అవాన్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుకు సంబంధించిన పరిస్థితులపై దర్యాప్తు చేయాలని పాకిస్తాన్ సైన్యాధిపతి ఆదేశించటంతో ఉద్రిక్తతలు రేగినట్లు కనిపించింది.
దానికి ఒక రోజు ముందు.. ప్రతిపక్షానికి బలమైన పట్టున్న సింధ్ రాష్ట్రంలో.. రాజధాని కరాచీ నగరంలో పాక్ ప్రస్తుత ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వ్యతిరేకంగా భారీ ప్రదర్శన జరిగింది.

ఫొటో సోర్స్, Reuters
అయితే.. సైనిక బలగాలకు, పోలీసులకు మధ్య ఘర్షణ చెలరేగిందని, కనీసం ఐదుగురు చనిపోయారని, కరాచీ నగరంలో యుద్ధ ట్యాంకులు ఉన్నాయని ఓ కొత్త అకౌంట్ నుంచి మంగళవారం రాత్రి ట్వీట్ చేశారు.
ఈ మొదటి ట్వీట్‌ను ఎవరు చేశారనేది తెలియదు. బీబీసీ తీవ్రంగా పరిశోధించినప్పటికీ.. @drapr007 అనే ఈ అకౌంట్‌ను ఎవరు నిర్వహిస్తున్నారనేది తెలియలేదు.
ఇదే అకౌంట్ నుంచి మరో గంట తర్వాత.. ''బ్రేకింగ్: కరాచీలోని గుల్షన ఎ బాగ్ ప్రాంతంలో పాక్ ఆర్మీకి, సింధ్ పోలీసులకు మధ్య భారీ స్థాయిలో కాల్పులు, యుద్ధం జరుగుతోంది'' అని ట్వీట్ చేశారు.
అయితే.. కరాచీలో అటువంటి పేరుతో ఏ ప్రాంతమూ లేదని కరాచీ నగరం ఎరిగిన వారికి తెలుసు. కానీ చాలా మంది పాఠకులకు ఆ విషయం తెలీదు.

అసలు నగరంలో ఎక్కడా ఎలాంటి కాల్పులు, కానీ ట్యాంకులు కానీ లేవు.
అయినప్పటికీ.. ''అంతర్యుద్ధం'' అంటూ తప్పుడు వార్త వేగంగా వ్యాపించింది. అదే సమయంలో కరాచీ గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించటం ఈ వదంతులను మరింత పెంచింది.
సీఎన్ఎన్18, జీన్యూస్, ఇండియా టుడే వంటి ప్రధాన భారత మీడియా సంస్థలు కూడా ఆ ఫేక్ న్యూస్‌ను అందుకున్నాయి.
సుప్రీంకోర్టు అడ్వకేట్ అని రాసివున్న 'ప్రశాంత్ పటేల్' అనే ఒక యూజర్ అకౌంట్ నుంచి.. కరాచీలో 'అంతర్యుద్ధం తరహా పరిస్థితి' నెలకొందని, పోలీసులు, సైనికులు చనిపోయారని, రేడియోలో దేశభక్తి గీతాలు ప్రసారం చేయాలని ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆదేశించారని, అమెరికా నౌకాదళం కరాచీ రేవుకు రాబోతోందని వరుస ట్వీట్లు చేశారు.

బీబీసీ రియాలిటీ చెక్ బృందం ఈ అకౌంట్లు, వెబ్‌సైట్లలో కొన్నిటిని పరిశీలించింది. వాటిలో కొన్ని సింధ్ పోలీసు విభాగానికి చెందిన అకౌంట్లుగా చెప్పుకుంటూ కరాచీలో పరిస్థితి గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేశాయి. ఆ అకౌంట్లకు భారతదేశంతో లింకులు ఉన్నట్లు బీబీసీ రియాలిటీ చెక్ బృందం గుర్తించింది.
ఇంటర్నేషనల్ హెరాల్డ్ పేరుతో ఉన్న ఒక అకౌంట్ నుంచి.. కరాచీలో ఘర్షణలుగా చెప్తున్న ఒక వీడియోను షేర్ చేశారు.
అస్పష్టంగా ఉన్న ఆ వీడియోను అసలు పాకిస్తాన్‌లోనే చిత్రీకరించారా అనేది బీబీసీ నిర్ధారించలేకపోయింది.
2018లో ఆగిపోయిన ఒక భారతీయ కంపెనీ కింద ఇంటర్నేషనల్ హెరాల్డ్ రిజిస్టరయి ఉంది. దీనికి 2015 నుంచి ఒక ట్విటర్ అకౌంట్ ఉంది. అది ఎవరినీ ఫాలో కావటం లేదు. దీనిని ఫాలో అవుతున్న వారిలో భారతదేశంలో అధికార బీజేపీకి చెందిన ఇద్దరు నాయకులు కూడా ఉన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
'సమన్వయంతో బూటకపు వార్తలు'
భారత మీడియాలో వస్తున్న వాదనలను పాకిస్తాన్‌లోని ప్రధాన స్రవంతి మీడియా సంస్థలు 'ఫ్యాక్ట్ చెక్'లతో సవాల్ చేశాయి.
పాకిస్తాన్‌లోని ట్విటర్ యూజర్లు.. తప్పుడు వార్తలను విమర్శిస్తూ చెలరేగిపోయారు. "CivilwarKarachi", "fakenews" and "Indianmedia" హ్యాష్ ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండయ్యాయి. దీనిపై జోకులు, మీమ్‌లు కూడా వచ్చాయి.
''కరాచీ అంతర్యుద్ధం ఎంత తీవ్రంగా ముదిరిందంటే.. మా ఫుడ్ పాండా డెలివరీ బాయ్ తన ఏకే47, ఆర్‌పీజీ, 9ఎంఎంలతో పాటు, నా బిర్యానీని తీసుకుని మందుపాతరల మధ్యగా పాకుతూ రావాల్సి వచ్చింది. పరిస్థితి చాలా సీరియస్‌గా మారుతోంది'' అంటూ ప్రఖ్యాత గాయకుడు, నటుడు ఫక్రే ఆలమ్ ట్వీట్ చేశారు.
''నేను నివసించేది కరాచీలోనే. ఇప్పుడే సరుకులు కొనుక్కున్నాను. బేకరీకి వెళ్లాను. కొన్ని దుస్తులు కొనుక్కుని ఇంటికి వచ్చాను. అక్కడ అంతర్యుద్ధం జరుగుతున్నట్లయితే.. నాకు కనిపించలేదు మరి'' అంటూ రచయిత బీనా షా వ్యాఖ్యానించారు.
భారత మీడియా సమన్వయంతో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తోందని కొందరు విమర్శించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
''అర్థంలేనంత పక్షపాతం''
దేశంలో ప్రముఖ మేగజీన్లలో ఒకటైన కారవాన్ రాజకీయ సంపాదకుడు హర్తోష్ సింగ్ బల్ బీబీసీతో మాట్లాడుతూ.. ''రెండు దేశాల్లోనూ ఒక వర్గం మీడియా ఉంది. ఆటలాడటంలో అది తలమునకలై ఉంటుంది. వారు చేసే పనికి జర్నలిజంతో సంబంధమేమీ లేదు'' అని వ్యాఖ్యానించారు.
''అవి ఎంత పక్షపాతంతో ఉంటాయంటే.. అవి చెప్పేదానికి అర్థమేమీ ఉండదు'' అని పేర్కొన్నారు.
పాకిస్తాన్ పతనం గురించి భారతదేశంలో చెప్పే కథనాలకు.. పాక్‌లో సైన్యానికి, పోలీసులకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పటం సరిపోతుందని మరో సీనియర్ పాత్రికేయుడు అభిప్రాయపడ్డారు.
''ఈ తప్పుడు సమాచారం ట్వీట్ చేస్తున్న ట్విటర్ హ్యాండిళ్లను ఒకసారి పరికిస్తే.. వాటిలో చాలా వరకూ అధికార పార్టీకి మద్దతు ఇచ్చేవో, దానితో అనుబంధం ఉన్నవో అయివుంటాయి'' అని చెప్పారు.
ఫేక్‌న్యూస్ విషయంలో ట్విటర్ స్వయంగా నిర్దేశించిన మార్గదర్శకాలకు ట్విటర్ నిబద్ధతను ఇమ్రాన్ ఖాన్ డిజిటల్ స్ట్రాటజీ సలహాదారు అర్స్లాన్ ఖాలిద్ ప్రశ్నించారు.
దీనిపై ట్విటర్ స్పందన తెలుసుకోవటానికి బీబీసీ పలుమార్లు ప్రయత్నించినా జవాబు రాలేదు.
బీబీసీ రియాలిటీ చెక్, బీబీసీ మానిటరింగ్ విభాగాలు ఈ కథనానికి తోడ్పాటునందించాయి.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలో విదేశాలపై ఆధారపడని ఏకైక ‘దేశం’ ఇదేనా?
- ఉత్తర కొరియా ప్రదర్శించిన భారీ క్షిపణి సత్తా ఏంటి? దాని వల్ల అమెరికాకు ముప్పు ఉందా?
- న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు: ‘జడ్జిలకు రాజ్యాంగం మినహాయింపు ఇవ్వలేదు.. వారిని ప్రశ్నించాల్సిందే’ - అభిప్రాయం
- యూరప్ అణు కేంద్రంలో నటరాజ విగ్రహం ఎందుకుంది, సోషల్ మీడియా దాని గురించి ఏమంటోంది?
- టైటానిక్ ప్రమాదంలో 700 మంది ప్రాణాలను ఆ రేడియో ఎలా కాపాడిందంటే...
- ఘోస్ట్ ఐలాండ్: 'మానవజాతి అంతమైపోయాక భూమి ఇలాగే ఉండొచ్చు'
- వీరప్పన్ కేసుల్లో 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నవారి కథేమిటి.. గంధపు చెక్కల స్మగ్లర్ నేరాల్లో వారి పాత్రేమిటి
- చైనా టిబెట్ ఆక్రమణకు 70 ఏళ్లు: అసలు హిమాలయాల్లో ఘర్షణ ఎందుకు మొదలైంది?
- ఇంగువ.. అనాదిగా భారతీయ వంటల్లో భాగం.. కానీ నేటివరకూ భారతదేశంలో పండలేదు...
- ‘బందిపోటు’ పోలీసులు.. హత్యలు, దోపిడీలతో చెలరేగిపోతున్నారు
- బెంగళూరులో పది లక్షల బావులు ఎందుకు తవ్వుతున్నారు?
- విశాఖ తెన్నేటి పార్క్ తీరానికి కొట్టుకొచ్చిన నౌకను మళ్లీ సముద్రంలోకి ఎలా పంపిస్తారంటే...
- ‘మాకు #MeToo తెలియదు... ఇల్లు, రోడ్డు, పనిచేసే చోటు ఏదీ మాకు సురక్షితం కాదు’
- ‘సోషల్ మీడియాలో సవాళ్లకు టెంప్ట్ అవుతున్నారా.. జాగ్రత్త కపుల్స్’
- చైనాలో మహిళలకు మాత్రమే పరిమితమైన రహస్య భాష... నుషు
- ఓ డొక్కు టీవీ ఊరు మొత్తానికీ ఇంటర్నెట్ రాకుండా చేసింది.. ఎలాగంటే...
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









