కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు రామ్ విలాస్ పాశ్వాన్ మృతి - BBC Newsreel

ఫొటో సోర్స్, Getty Images
లోక్ జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ) అధ్యక్షుడు, కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ మృతి చెందారు.
ఈ విషయాన్ని ఆయన కుమారుడు, ఎంపీ చిరాగ్ పాశ్వాన్ ట్విటర్‌లో ప్రకటించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘‘నాన్నా.. మీరిప్పుడు ఈ ప్రపంచంలో లేరు. కానీ మీరెక్కడ ఉన్నా నాతోనే ఉంటారు. మిస్ యూ పాపా’’ అని చిరాగ్ పాశ్వాన్ ట్వీట్ చేశారు.
74 ఏళ్ల రామ్ విలాస్ పాశ్వాన్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
1969లో తొలిసారి ప్రజాప్రతినిధిగా ఆయన ఎన్నికయ్యారు. సంయుక్త సోషలిస్టు పార్టీ తరపున బిహార్ అసెంబ్లీ సభ్యుడిగా ఆయన ఎన్నికయ్యారు. ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికైన రామ్ విలాస్ పాశ్వాన్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.
లోక్‌దళ్, జనతా పార్టీల్లో కూడా పనిచేసిన రామ్ విలాస్ పాశ్వాన్ 2000వ సంవత్సరంలో లోక్ జనశక్తి పార్టీని స్థాపించారు.
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో చేరి మన్మోహన్ సింగ్ క్యాబినెట్‌లో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
2014లో ఎన్డీఏలో చేరి మోదీ క్యాబినెట్‌లో భాగమయ్యారు. 2019లో రెండోసారి కూడా మోదీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, MAIL TODAY

ఫొటో సోర్స్, Getty Images

'రిపబ్లిక్ టీవీ డబ్బులు ఇచ్చి టీఆర్‌పీ పెంచుకుంటోంది': ముంబయి పోలీసులు
రిపబ్లిక్ టీవీ న్యూస్ ఛానెల్ సహా మూడు టీవీ ఛానెళ్లు డబ్బులు ఇచ్చి తమ టెలివిజన్ రేటింగ్ పాయింట్ల (టీఆర్‌పీ)ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ముంబయి పోలీసులు ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఇప్పటివరకూ మూడు టీవీ ఛానెళ్లకు పాత్ర ఉన్నట్లు గుర్తించామని అన్నారు.
ముంబయి పోలీస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ గురువారం ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.అయితే, రిపబ్లిక్ టీవీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. ఆ ఛానెల్ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
''సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో మేం ప్రశ్నలు సంధించినందుకే, ముంబయి పోలిస్ కమిషనర్ పరమ్‌వీర్ సింగ్ రిపబ్లిక్ టీవీపై తప్పుడు ఆరోపణలు చేశారు. ఆయనపై మేం పరువు నష్టం దావా వేస్తాం. బార్క్ (టీఆర్‌పీలు వెల్లడించే సంస్థ) ఇంతవరకూ ఒక్క ఫిర్యాదులోనూ మా పేరు ప్రస్తావించలేదు. ఇలా మమ్మల్ని లక్ష్యంగా చేసుకోవడం... నిజం పట్ల మాకున్న నిబద్ధతను మరింత పెంచుతుంది. పరమ్‌వీర్ సింగ్ క్షమాపణలు చెప్పి, చట్టపరమైన చర్యలు ఎదుర్కొనేందుకు సిద్ధమవ్వాలి'' అని పేర్కొన్నారు.

ఇటు టీఆర్‌పీ లెక్కించే బాధ్యతను బార్క్.. హంస అనే ఏజెన్సీకి ఇచ్చిందని... ఆ ఏజెన్సీ అధికారులు కొందరు కొన్ని ఛానెళ్ల నుంచి డబ్బులు తీసుకుని వాటి టీఆర్‌పీ పెంచుతున్నారని ముంబయి పోలీసులు ఆరోపించారు.
తాము సూచించిన ఛానెల్‌ను చూసే జనాలకు నెలకు 400-500 రూపాయల దాకా చెల్లిస్తున్నారని అన్నారు.
ముంబయిలో ఈ తంతు జరుగుతున్నట్లు గుర్తించామని, దేశంలోని మిగతా ప్రాంతాల్లోనూ ఇలా జరుగుతుండే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, FINNISH GOVERNMENT
ఫిన్‌లాండ్: ఒక రోజు ప్రధానమంత్రిగా పనిచేసిన 16 ఏళ్ల బాలిక
లింగ సమానత్వం విషయంలో ఫిన్‌లాండ్ తరచూ అగ్రస్థానంలో ఉంటుంది. ఆ దేశ ప్రధానమంత్రి సనా మారిన్ దేశంలో లింగ వివక్షపై తమ పోరాటాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లారు.
ఓ పదహారేళ్ల బాలిక ఒక రోజు ప్రధానమంత్రిగా ఉండేందుకు ఆమె తన పదవిని ఆ బాలికకు అందించారు.
బుధవారం ఫిన్‌లాండ్ ప్రధానమంత్రి స్థానంలో ఉన్న అవా ముర్టో కొత్త చట్టాలేమీ చేయలేదు. కానీ, టెక్నాలజీలో మహిళల హక్కులను హైలైట్ చేయడానికి ఆమె రోజంతా రాజకీయ నాయకులతో సమావేశం అయ్యారు.
ఐక్యరాజ్యసమితి బాలికల దినోత్సవం సందర్భంగా, పిల్లల కోసం పనిచేసే ఒక స్వచ్ఛంద సంస్థ తన ప్రచారంలో భాగంగా ముర్టోకు ఈ అవకాశం అందించింది.
ప్లాన్ ఇంటర్నేషనల్ 'గర్ల్స్ టేకోవర్'లో భాగంగా ఫిన్‌లాండ్ ఇలా చేయడం ఇది నాలుగోసారి.
గర్ల్స్ టేకోవర్‌లో భాగంగా ప్రపంచంలోని వివిధ దేశాలు రాజకీయాలు, వివిధ రంగాల నాయకుల స్థానంలో బాలికలు ఒక రోజు ఉండడానికి అనుమతిస్తున్నాయి.
ఇందులో భాగంగా ఈ ఏడాది బాలికలకు డిజిటల్ నైపుణ్యాలు, సాంకేతిక అవకాశాలను ప్రోత్సహించాలనే ప్రచారంపై దృష్టి పెట్టారు.
ఫిన్‌లాండ్‌తో పాటు కెన్యా, పెరూ, సూడాన్, వియత్నాం కూడా ఇలా బాలికల కోసం ఒక రోజు మార్పులు చేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Reuters
డోనల్డ్ ట్రంప్: 'చైనా వల్లే నాకు కరోనా సోకింది.. ఇందుకు ఆ దేశం మూల్యం చెల్లిస్తుంది'
కరోనావైరస్ పాజిటివ్ రావడంతో నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తిరిగి విధుల్లోకి వచ్చారు.
ఆస్పత్రి నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఆయన ఒక వీడియో సందేశంలో తన ఆరోగ్యం గురించి సమాచారం ఇచ్చారు.
ఈ వీడియోలో అధ్యక్షుడు ట్రంప్ మాస్క్ లేకుండానే కనిపించారు.
దాదాపు ఐదు నిమిషాలు ఉన్న ఈ వీడియోలో ఆయన “ఇది నాకు దేవుడి ఆశీర్వాదమో, లేక అదృశ్య ఆశీర్వాదమో అనిపిస్తోంది. నేను ఇప్పుడు బాగున్నాను. ఒక అమెరికా అధ్యక్షుడుగా నాకు ఎలాంటి చికిత్స అందించారో, అది ప్రతి అమెరికా పౌరుడికీ అందించాలని నేను కోరుకుంటున్నాను” అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
అధ్యక్షుడు ఈ వీడియోలో చైనాపై విమర్శలు కూడా చేశారు.
“నేను వైరస్ నుంచి కోలుకున్నాను. ఇది వ్యాపించడంలో మీ తప్పేం లేదు. ఇది చైనా చేసిన తప్పిదం. చైనా దీనికి మూల్యం చెల్లించుకుంటుంది. ఈ దేశానికి, ప్రపంచానికి చేసిన దానికి చైనా తీవ్రంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది” అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








