కరోనావైరస్ వ్యాక్సిన్ కోసం ‘‘ఏడాదిలో రూ. 80 వేల కోట్లు ఖర్చు చేయాలి.. ప్రభుత్వం దగ్గర అంత డబ్బుందా?’’ - BBC Newsreel

ఫొటో సోర్స్, TWITTER @ ADARPOONAWALLA
‘‘వచ్చే ఏడాది, దేశంలో అందరికీ కరోనావైరస్ వ్యాక్సిన్ అందించే దిశలో 80,000 కోట్ల రూపాయలు ఖర్చుచెయ్యడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందా?’’ అంటూ ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ తయారీలో మొదటి స్థానంలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూనవాలా ప్రశ్నించారు.
శనివారం నాడు తన ట్వీట్‌లో ప్రధానమంత్రి కార్యాలయం, ఆరోగ్య మంత్రిత్వ శాఖలను ట్యాగ్ చేస్తూ ఈ ప్రశ్న అడిగారు.
"ఈ ప్రశ్న నేను ఎందుకు అడుగుతున్నానంటే మనం ముందే ప్లాన్ చేసుకోవాలి’’ అని ఆయన పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
‘‘ఇండియాలోనూ, విదేశాల్లోనూ వ్యాక్సిన్ తయారుచేసేవాళ్లకు ఖర్చు, పంపిణీల విషయంలో మార్గనిర్దేశం చెయ్యాల్సి ఉంటుంది. ఇదే తరువాత మనం ఎదుర్కోబోయే పెద్ద సవాలు" అంటూ అదార్ వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
అమెరికా సుప్రీంకోర్టు జడ్జిగా 'అమీ కోనీ బారెట్‌ను ఎంపిక చేయనున్న ట్రంప్'
ఇటీవల మరణించిన అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి రుత్ బాడర్ గిన్స్‌బర్గ్ స్థానంలో కన్సర్వేటివ్ పార్టీ అభిమాన అమీ కోనీ బారెట్‌ను జస్టిస్‌గా ట్రంప్ నియమించనున్నట్టు సమాచారం.
నవంబర్‌లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికోసం గట్టి పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ అంశంలో తుది నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం నాడు ప్రకటించనున్నారు.
యూఎస్‌లో బీబీసీ భాగస్వామి సీబీఎస్ అందించిన రిపోర్ట్ ప్రకారం జడ్జ్ బారెట్‌వైపే ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం 48 యేళ్ల వయసున్న జడ్జ్ బారెట్ ఈ పదవిని పొందితే సుప్రీంకోర్టులో కన్సర్వేటివ్ పార్టీ అనుకూలుర బలం 6:3 మెజారిటీలో ఉంటుంది.
2017, 2018 లలో నీల్ గోర్సచ్, బ్రెట్ కెవెనాల తరువాత రిపబ్లికన్ అధ్యక్షుడు నియమించనున్న మూడో జడ్జ్ అమీ కోనీ బారెట్ అవుతారు.
ఇవి కూడా చదవండి:
- నగ్నంగా పరుగెడుతున్న మహిళపై 36 రౌండ్లు కాల్పులు జరిపారు...
- చెంచాడు గోధుమ పిండి చాలు మీ శానిటైజర్ మంచిదో కాదో చెప్పడానికి
- చైనాలో మరో ఇన్ఫెక్షన్... 4 వేల మందికి సోకిన బ్రుసెలోసిస్ బ్యాక్టీరియా లక్షణాలేంటి?
- వారంలో ఆరు రోజులు సబ్‌రిజిస్ట్రార్.. ఆదివారం వ్యవసాయ కూలీ
- శ్రీలంక ప్రజలు ఆకలి బారిన పడకుండా పనస కాయలే కాపాడుతున్నాయా...
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- PCOD: ''తనకు పీరియడ్స్ సరిగా రావు.. ఎప్పుడూ లేటే.. పిల్లలు పుట్టే అవకాశం వుందో లేదో చూడండి’’
- మోదీ ప్రభుత్వం చైనా బ్యాంక్ నుంచి కోట్ల డాలర్ల రుణం తీసుకుందా? నిజం ఏంటి? - BBC Fact Check
- 'కరోనావైరస్ నుంచి కోలుకున్నాను... కానీ, కంప్యూటర్ స్క్రీన్ నన్ను దెయ్యంలా వెంటాడుతోంది'
- ప్రపంచంలో తొలి టీకా ప్రచారాన్ని భారత రాణులే చేపట్టారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








