చైనా టిబెట్‌లో ఏం చేస్తోంది... లక్షలాది మంది ప్రజలను శిక్షణ శిబిరాలకు ఎందుకు తరలిస్తోంది? - BBC Newsreel

చైనా ప్రభుత్వం టిబెట్‌లోని లక్షలాది మంది ప్రజలను మిలటరీ తరహా శిక్షణ శిబిరాలకు తరలిస్తోందని, అవి 'లేబర్ క్యాంపుల' మాదిరిగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారని ఇటీవలి ఒక అధ్యయనం వెల్లడించింది.
స్థానిక మీడియా కథనాలు, పాలసీ పత్రాలు, రాయిటర్స్ వార్తా సంస్థ సమకూర్చిన ఉపగ్రహ చిత్రాలను ఆధారం చేసుకుని జేమ్స్‌టౌన్ ఫౌండేషన్ ఈ నివేదికను రూపొందించింది.
చైనా షిన్‌జియాంగ్ ప్రాంతంలోని వీగర్ ముస్లింలకు ఏర్పాటు చేసిన శిబిరాల్లాగే, టిబెట్‌లోని శిబిరాలు ఉన్నాయని ఈ నివేదిక అభిప్రాయపడింది.
అయితే, ఈ నివేదిక ఫలితాలపై చైనా ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు.
ఈ ఏడాది చివరికల్లా చైనాలో పేదరికాన్ని నిర్మూలిస్తామని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాలనుంచి ఇలా కార్మికులను భారీగా తరలించడం కూడా అందులో భాగమేనని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. హిమాలయ ప్రాంతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని చైనా ప్రభుత్వం చెబుతోంది.
చైనా సరిహద్దు వెంబడి మారుమూల ప్రాంతంగా ఉండే టిబెట్ ప్రధానంగా బౌద్ధ మతస్థుల ప్రాంతం. చైనాకు చెందిన స్వయం ప్రతిపత్తి కలిగిన ప్రాంతంగా టిబెట్ చాలా కాలంగా చైనా ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తోంది. తమ సంస్కృతి, మత స్వేచ్ఛలను అణచివేయాలని చైనా ప్రయత్నిస్తోందని ఆరోపిస్తుంటుంది.
"చదువు" పేరుతో టిబెట్ ప్రజలను బలవంతంగా శ్రామిక శిక్షణ శిబిరాల్లోకి తీసుకుపోతున్నారని ప్రస్తుతం ప్రవాసంలో ఉన్న టిబెట్ అధ్యక్షుడు లోబ్సాంగ్ సాంగే కూడా ఆరోపించారు.
అయితే, తాజా అధ్యయనం ప్రకారం ఈ శిక్షణ శిబిరాల స్థాయి ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
టిబెట్, షిన్‌జియాంగ్‌కు చెందిన పరిశోధకులు ఆడ్రియన్ జెంజ్ ఈ నివేదికను తయారుచేసారు.

ఫొటో సోర్స్, AFP/Getty Images
2020 సంవత్సరం మొదటి ఏడు నెలల్లో 5,00,000 ల మంది రైతులు, పశువుల కాపర్లకు శిక్షణ ఇచ్చారని, వీరందరినీ శిక్షణ అనంతరం టిబెట్, చైనాలలోని పలు ప్రాంతాలకు తరలించనున్నారని ఆడ్రియన్ జెంజ్ ఈ నివేదికలో తెలిపారు.
"క్రమ శిక్షణ, చైనా భాష, పని విలువల" అభివృద్ధికే ఈ శిక్షణా కేంద్రాలను నడుపుతున్నట్లుగా చైనా ప్రభుత్వం పేర్కొందని నివేదకి చెబుతోంది.
కొందరు టిబెటన్లు ఇష్టపూర్వకంగానే ఈ శిక్షణా శిబిరాల్లో చేరారని, కొందరు తమ ఆదాయం మెరుగైందని చెబుతున్నారని కూడా ఈ నివేదిక తెలిపింది.
అయితే, ఈ కార్యక్రమం అంతా ప్రణాళిక బద్ధంగా, వ్యవస్థీకృతం చేసే స్థాయిలో జరుగుతోందని, అది ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని శాశ్వతంగా మార్చేలా ఉండడం తీవ్ర సమస్యలకు దారితీయవచ్చని కూడా ఈ నివేదిక స్పష్టం చేసింది.
'కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవద్దు'.. టర్కీ అధ్యక్షుడికి భారత్ హెచ్చరిక

ఫొటో సోర్స్, EPA / TURKISH PRESIDENT PRESS OFFICE HANDOUT
టర్కీ అధ్యక్షుడు ఎర్దవాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తారు. సమితి సర్వ ప్రతినిధి సభలో మాట్లాడిన ఎర్దవాన్ "దక్షిణ ఆసియాలో శాంతి, సుస్థిరతలో కశ్మీర్ వివాదం కీలకం.
జమ్ముకశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేసినప్పటి నుంచి అక్కడ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది" అన్నారు.
ఆయన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
"జమ్ముకశ్మీర్‌పై టర్కీ అధ్యక్షుడి ప్రకటనను మేం గమనించాం. ఇది భారతదేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే. ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం టర్కీ నేర్చుకోవాలి. ఈ వ్యాఖ్యలు భారత్‌కు ఏ మాత్రం ఆమోదయోగ్యం కావు'' అని ఐక్యరాజ్యసమితిలో భారత ప్రతినిధి టి.ఎస్. త్రిమూర్తి అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
టర్కీ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ప్రదాని ఇమ్రాన్‌ఖాన్ సంతోషం వ్యక్తం చేశారు. "కశ్మీరీ ప్రజల హక్కులకు మద్దతుగా ఐక్య రాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో టర్కీ అధ్యక్షుడు మాట్లాడినందుకు ధన్యవాదాలు. కశ్మీరీ ప్రజల న్యాయమైన పోరాటానికి టర్కీ మద్దతు ఎప్పుడూ ఉంటుందని " అని ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
దీనికి ఒక రోజు ముందు పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి కూడా ఐక్యరాజ్యసమితి 75వ వార్షికోత్సవం సందర్భంగా తన ప్రసంగంలో కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3

ఫొటో సోర్స్, Getty Images
చైనాయే కరోనా వైరస్‌ను ప్రపంచానికి అంటించింది: మళ్లీ ఆరోపించిన ట్రంప్
అమెరికా, చైనాల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్ మంగళవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వార్షిక సమావేశంలో కూడా కనిపించింది. కరోనా వ్యాప్తికి చైనాయే కారణమని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఆరోపించారు. దీనికి చైనా బాధ్యత వహించాల్సిందేనని ట్రంప్ తేల్చి చెప్పారు.
అయితే ప్రపంచంలో ఏ దేశంతోనూ ప్రచ్ఛన్న యుద్ధం (కోల్డ్‌వార్) చేసే ఉద్దేశం తమకు లేదని తన ప్రసంగంలో చైనా అధినేత షి జిన్‌పింగ్ అన్నారు.
గత కొద్దికాలంగా అమెరికా చైనాల మధ్య కరోనా వైరస్, వాణిజ్యం తదితర అంశాలపై మాటల యుద్ధం నడుస్తోంది.
ఏటా న్యూయార్క్‌లో జరిగే ఈ సమావేశం కరోనా వైరస్ నేపథ్యంలో ఈసారి వర్చువల్‌గా జరిగింది. వివిధ దేశాల నేతలు తమ ప్రసంగాలను రికార్డ్ చేసి పంపించారు.
ఈ సమావేశాన్ని తాను సాధించిన విజయాలను, ప్రత్యర్ధుల వైఫల్యాలను ప్రపంచానికి, అమెరికా ప్రజలకు చూపడానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వినియోగించుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images/AFP
వైరస్‌ను వ్యాప్తి చేసింది చైనాయే: ట్రంప్
“ఈ వైరస్‌ను ప్రపంచానికి అంటించిన చైనా కచ్చితంగా దానికి బాధ్యత వహించాలి’’ అన్నారు ట్రంప్.
“వైరస్ వ్యాప్తి మొదలైన కొత్తలో చైనా దేశీయ విమానాలను ఆపేసి, అంతర్జాతీయ విమానాలను నడిపింది. ఆ కారణంగానే వైరస్ ప్రపంచానికి వ్యాపించింది. నేను చైనా విమానాలను అడ్డుకుంటే నాపై విమర్శలు చేసింది. వాళ్ల దేశంలో విమానాలు ఆపేసి, లాక్‌డౌన్‌లు ప్రకటించుకున్నారు’’ అని ట్రంప్ విమర్శించారు.
ఒకవైపు ఎన్నికలు ముంచుకొస్తుండగా, వైరస్‌ను వ్యాప్తి నివారణ విషయంలో అమెరికా అధ్యక్షుడి పనితీరు మీద అమెరికాలో పెద్ద చర్చ జరుగుతోంది. కానీ ట్రంప్ మాత్రం తరచూ చైనాను నిందిస్తూ వస్తున్నారు.
చైనా తలచుకుంటే వైరస్ వ్యాప్తిని ఆపగలిగేదని, కానీ అలా చేయలేదని ఆయన పదే పదే ఆరోపించారు. అయితే ట్రంప్‌వన్నీ నిరాధార ఆరోపణలని చైనా కొట్టి పారేసింది.
కరోనా వైరస్ కారణంగా అమెరికాలో ఇప్పటి వరకు 2 లక్షలమంది ప్రజలు మరణించారు.
వాణిజ్యం, టెక్నాలజీ, హాంకాంగ్ ప్రజాస్వామిక ఆందోళనలు, వీగర్ ముస్లింల అణచివేత, కరోనావైరస్‌వంటి అనేక అంశాలపై చైనా వైఖరిని అమెరికా తప్పుపడుతూ వస్తోంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అమెరికా అధ్యక్షుడి ప్రసంగం విన్న తర్వాత “ఇది నాగరితకల మధ్య యుద్ధానికి దారి తీస్తుంది’’ అని చైనా అధినేత షి జిన్‌పింగ్ హెచ్చరించారు.
“వివిధ దేశాలతో ఉన్న సమస్యలను మేం చర్చల ద్వారా పరిష్కరించుకుంటాం. ప్రపంచంలో మేమొక్కళ్లమే ఎదగాలని, మిగిలిన వారు ఆర్థికంగా దెబ్బతినాలని కోరుకోవడం లేదు’’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.
“ ఏ దేశానికి మరో దేశం మీద పెత్తనం చేసే హక్కు లేదు. ఇతరులను అదుపులో పెట్టాలని, తాము ఒక్కరమే ఎదగాలని చూడటం సరికాదు’’ అని ట్రంప్ ప్రసంగం అనంతరం జిన్‌పింగ్ అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
ట్రంప్ లక్ష్యం ఓట్లేనా ?
బీబీసీ కరస్పాండెంట్ లారా ట్రెవెల్యాన్ విశ్లేషణ
మరో 40 రోజుల్లో ఎన్నికలున్న నేపథ్యంలో ఈ ప్రసంగం ద్వారా లబ్ధి పొందడానికి ట్రంప్ ప్రయత్నించారు. చైనాను టార్గెట్ చేయడం ద్వారా ఈ వైరస్ పాపం ఆ దేశానిదేనని తేల్చారు. దేశంలో లక్షలమంది మరణానికి చైనాయే కారణమని చెప్పే ప్రయత్నం చేశారు.
కరోనా వైరస్ నివారణలో తన వైఫల్యాలు బైటపడకుండా ఉండేందుకు ట్రంప్ చైనాను టార్గెట్ చేసుసుకున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. వైరస్ నుంచి ప్రజలను కాపాడటానికి తాను చాలా ప్రయత్నాలు చేశానని ట్రంప్ చెప్పుకొన్నారు.
వ్యాక్సిన్ ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయని, వైరస్‌ను తరిమికొడతామని ప్రతిజ్జ చేశారు ట్రంప్.
చైనాను విమర్శించే క్రమంలో ప్రపంచ ఆరోగ్య సంస్థను కూడా ఆయన టార్గెట్ చేశారు. ఆ సంస్థ చైనా చేతుల్లో ఉందని, ఈ వైరస్‌కు సంబంధించి సరైన సమాచారం ఇవ్వలేదని డబ్ల్యూహెచ్‌ఓపై ట్రంప్ విమర్శలు చేశారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థకు నిధులను నిలిపేస్తున్నట్లు ఇంతకు ముందే ట్రంప్ ప్రకటించారు.
ఈ సమావేశాన్ని ప్రారంభిస్తూ “మనం ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రచ్ఛన్న యుద్ధాన్ని నివారించాలి’’ అని పరోక్షంగా అమెరికా, చైనాలను ఉద్దేశించి ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ వ్యాఖ్యానించారు.
“మనం ఇప్పుడు ఒక ప్రమాదకరమైన మార్గంలో ఉన్నాం. ప్రపంచంలోని రెండు పెద్ద ఆర్థిక శక్తులు ఘర్షణ పడటం మంచిది కాదు’’ అన్నారు గుటెరస్.
కరోనా వైరస్ విషయంలో స్వార్ధానికి తావులేదన్న గుటెర్రాస్, ప్రజాకర్షణ, జాతీయతావాదాలు ఈ వైరస్ ముందు నిలవలేదని అన్నారు. ఆ మార్గంలో కరోనా వైరస్‌ను అడ్డుకోడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన గుర్తు చేశారు.
అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అందుకు భిన్నమైన వాదన చేశారు. “ మీరు మీ ప్రజలను కాపాడుకోడానికే ప్రాధాన్యం ఇస్తే ఇక పరస్పర సహకారం అనే మాట ఎక్కడుంది’’ అని ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి:
- ఏడాదిలో ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఏం చేయాలి.. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు ఏం చెబుతున్నారు
- జీడీపీ వృద్ధిరేటులో పతనం మొదలైతే ఏం జరుగుతుంది
- ఈ ఆర్థిక సంక్షోభం 'రాజకీయ-సామాజిక సంక్షోభం'గా మారనుందా
- చైనా వెళ్లిన ఇంటర్‌పోల్ చీఫ్ ఏమయ్యారంటే..
- ముస్లిం వీగర్లను వేధించారని 28 చైనా సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టిన అమెరికా
- చైనా దూకుడుకు బ్రేకులు పడ్డట్లేనా? ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలన్న కల నెరవేరేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








