‘సెల్ఫిష్’ మాస్క్‌లు: ఇవి వాడుతున్న వాళ్లు మీ పక్కన ఉంటే జాగ్రత్త..

ఫొటో సోర్స్, GETTY IMAGES
కరోనావైరస్ సంక్షోభం ఆరంభంలో వైరస్ వ్యాప్తికి మాస్క్‌లు అడ్డుకట్ట వేయగలవా? లేదా? అని చాలా రోజుల పాటు చర్చ జరిగింది.
చివరికి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) దీనిపై ఓ స్పష్టతను ఇచ్చింది.
వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న చోట్ల, భౌతిక దూరం పాటించడం వీలుపడని చోట్ల మాస్క్‌ల వాడకాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వాలకు సూచించింది. మాస్క్‌ల వినియోగంతోపాటు చేతులు కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం కూడా అవసరమని పేర్కొంది.
అయితే, మాస్క్‌ల్లో ఓ ప్రత్యేక రకం మాస్క్‌ల గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. వీటిని ‘సెల్ఫిష్’ మాస్క్‌లని కొందరు పిలుస్తున్నారు.
అసలేంటీ ‘సెల్ఫిష్’ మాస్క్‌లు? వీటి వాడకంపై అభ్యంతరాలు ఎందుకు వస్తున్నాయి?

ఫొటో సోర్స్, GETTY IMAGES
కొన్ని మాస్క్‌లు ముందు వైపు మధ్యలో ఒక ప్రత్యేకమైన వాల్వుతో ఉంటాయి. (ఎన్95, ఎఫ్‌పీపీ2, ఎఫ్‌పీపీ3 తదితర మాస్క్‌లు ఇలా ఉంటాయి)
ఇలా వాల్వుతో ఉండే మాస్క్‌లు కరోనావైరస్ వ్యాప్తిని ఆపేందుకు ఉపయోగపడవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ మాస్క్‌లతో తొడుక్కునేవారికి మాత్రమే ప్రయోజనం. వారి పక్కనుండే వారికి ప్రమాదం.
సాధారణ మాస్క్‌లు వాటిని ధరించినవారికి మిగతావారి నుంచి ఇన్ఫెక్షన్ రాకుండా... ఒకవేళ ధరించినవారికి ఇన్ఫెక్షన్ ఉంటే, అది మిగతావారికి సోకకుండా ఉపయోగపడతాయి.
కానీ, వాల్వుతో ఉండే మాస్క్‌లు అలా కాదు.
మాస్క్ వేసుకున్న వ్యక్తి ఉపిరి పీల్చుకున్నప్పుడు హానికారకాలను ఆపేలా, దానికి ఉన్న వాల్వు మూసుకుంటుంది. కానీ, అదే వ్యక్తి ఊపిరి వదిలినప్పుడు మాత్రం ఆ వాల్వు తెరుచుకుంటుంది.
ఒకవేళ ఆ వ్యక్తికి ఇన్ఫెక్షన్ ఉంటే, ఆ వ్యక్తి తుంపర మాస్క్ ద్వారా బయటకు వచ్చి, పక్క వ్యక్తికి సోకే ప్రమాదం ఉంటుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ధరించినవారికే రక్షణ కల్పిస్తాయన్న కారణంతో, వాటిని ‘సెల్ఫిష్’ మాస్క్‌లు అని స్పెయిన్ ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి ఫెర్నాండో సిమోన్ అన్నారు.
‘‘వేసుకున్నవారికి, వారి పక్కనున్నవారికి కూడా ఉపయోగపడేలా సాధారణంగా మాస్క్‌లు ఉంటాయి. ఇన్ఫెక్షన్ సోకినవారి నుంచి ఇతరులకు అది వ్యాపించకుండా ఆపడం కూడా ముఖ్యం’’ అని బ్రిటన్‌లోని యూనివర్సిటీ కాలేజ్ హాస్పిటల్‌కు చెందిన నిపుణుడు బెన్ కిల్లింగ్లీ అభిప్రాయపడ్డారు.
‘‘రెస్పిరేటర్లకు మాత్రమే ఇలాంటి వాల్వులు ఉండేవి. అవి వైద్య నిపుణుల కోసం ఉద్దేశించినవి. కానీ, ఇప్పుడు మామూలు ప్రజలకు కూడా వాల్వులతో ఉండే మాస్క్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఇంకొకరికి నష్టం కలిగించే ప్రమాదం తప్ప, వీటి వల్ల వేసుకునేవారికి అదనపు ప్రయోజనం ఏమీ ఉండదు. సాధారణ ప్రజలు మామూలు సర్జికల్ మాస్క్‌లను ధరించాలి’’ అని కిల్లింగ్లీ చెప్పారు.
వాల్వులతో ఉండే మాస్క్‌లను ఉపయోగించవద్దని అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) సూచించింది.
స్పెయిన్‌లో కొన్ని ప్రాంతాల్లో వీటి వాడకంపై నిషేధం విధించారు.
చాలా దేశాల్లో విమానాల్లో ఇలాంటి మాస్క్‌లను అనుమతించడం లేదు.

ఫొటో సోర్స్, Getty Images
మరి వీటిని ఎందుకు తయారుచేశారు?
‘‘వైద్య నిపుణులకు సౌకర్యవంతంగా ఉండటం కోసం ఈ వాల్వు ఉండే మాస్క్‌లు తయారుచేశారు. వీటిలో గాలి బాగా ఆడుతుంది. ఎక్కువ ఇబ్బంది ఉండదు. గాలి బయటకు పూర్తిగా వెళ్లిపోతుంది కాబట్టి మాస్క్ పొడిగానే ఉంటుంది. వేడెక్కదు’’ అని కిల్లింగ్లీ చెప్పారు.
ఇన్ఫెక్షన్ సోకినవారి మధ్యే ఉంటూ పనిచేస్తారు కాబట్టి, వైద్య నిపుణులు వీటిని వాడుతుంటారు.
సీడీసీ మాత్రం వైద్య సిబ్బంది కూడా వీటిని ఉపయోగించవద్దని సూచిస్తోంది.
దుమ్ము, దూళి ఎక్కువగా వెలువడే చోట్ల పనిచేసేవారికి, కాలుష్యం ఎక్కువగా ఉన్న చోట్ల ఉండేవారికి కూడా ఈ మాస్క్‌లు బాగా ఉపయోగపడతాయి.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?
- లక్షణాలు: కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- ప్రభావం: కరోనావైరస్ మీ శరీరాన్ని ఏం చేస్తుంది?
- మందు, చికిత్స: కరోనావైరస్: కోవిడ్-19కు చికిత్స చేసే మందు ఎప్పుడు వస్తుంది? ప్రత్యామ్నాయంగా ఏం చేస్తున్నారు?
- టిప్స్: కరోనావైరస్ చిట్కాలు: మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి? వైరస్ వ్యాప్తిని ఎలా అడ్డుకోవాలి?
- కోలుకోవడం: కరోనావైరస్ బారిన పడితే తిరిగి కోలుకోవడానికి ఎంత కాలం పడుతుంది?
- వ్యాక్సిన్: కరోనావైరస్ వ్యాక్సిన్ పరిశోధనలు ఎంత వరకూ వచ్చాయి? వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది?
- లాక్డౌన్: తిరిగి సాధారణ జీవితం ఎప్పుడు, ఎలా మొదలవుతుంది?
- ఎండ్‌గేమ్: కరోనావైరస్ మహమ్మారి నుంచి బయటపడటం ఎలా?

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్: హంతక మహమ్మారిపై శాస్త్రవేత్తల వేటలో వెలుగు చూసిన నిజాలేమిటి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్: ప్రపంచ మహమ్మారి మీద యుద్ధంలో మానవాళి గెలుస్తోందా?
- చలికాలంలో కరోనా మరింత విజృంభిస్తుందా.. ప్రాణనష్టం పెరుగుతుందా
- రాగి వస్తువులపై బ్యాక్టీరియా బతకలేదు.. మరి అన్నిచోట్లా రాగి పూత పూస్తే వైరస్‌లను ఎదుర్కోవచ్చా?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- సరకులు కొనేటప్పుడు ఆ ప్యాకెట్లను పట్టుకుంటే కరోనావైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకినవారు మీ వీధిలో ఉంటే ఏం చేయాలి... ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కోవిడ్-19 నుంచి కోలుకున్నా అనారోగ్యం ఎందుకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- హస్త ప్రయోగం, మల్టీ విటమిన్లు, ప్రో బయోటిక్స్.. ఇవి రోగ నిరోధక శక్తి బూస్టర్‌లా?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
- కరోనా వ్యాప్తిలో పిల్లల పాత్ర ఎంత? తాజా అధ్యయనం ఏం చెప్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








