నాసా - స్పేస్ ఎక్స్ డ్రాగన్ ఎండీవర్: భూమికి చేరుకున్న వ్యోమగాములు

కిందికి దిగుతున్న నాసా వ్యోమగాములు

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, సముద్ర జలాలపై దిగుతున్న నాసా వ్యోమగాములు
    • రచయిత, జొనాధన్ ఆమోస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

స్పేస్ స్టేషన్ నుంచి విడిపోయిన డ్రాగన్ ఎండీవర్ కాప్స్యూల్‌ ద్వారా అమెరికా వ్యోమగాములు డగ్ హార్లీ, బాబ్ బెంకెన్ తిరిగి సురక్షితంగా భూమిని చేరుకున్నారు.

ఈ ఇద్దరు ఉన్న కాప్స్యూల్ అమెరికా ఈస్టర్న్ డేలైట్ టైమ్ ప్రకారం మధ్యాహ్నం 2.48 (భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్థరాత్రి 12:18)కి ఫ్లోరిడా తీరంలో సముద్రంలో దిగింది.

వారికి స్వాగతం పలికి, తీసుకురావడానికి రికవరీ వాహనం సముద్ర జలాల్లోకి వెళ్లింది. 45 ఏళ్ల క్రితం అపోలో కమాండ్ మాడ్యూల్ ల్యాండింగ్ తర్వాత అమెరికా ఇప్పుడు మళ్లీ ఇలా నీటిలో వ్యోమగాములను దింపగలిగింది.

ఇది తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని హార్లీ వ్యాఖ్యానించారు.

"స్పేస్ ఎక్స్, నాసా తరపున మీ ఇద్దరికీ భూమిపైకి స్వాగతం. స్పేస్ ఎక్స్‌లో ప్రయాణించినందుకు ధన్యవాదాలు" అని స్పేస్ ఎక్స్ మిషన్ కంట్రోల్ వ్యాఖ్యానించింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

వీరిద్దరూ సురక్షితంగా భూమికి చేరడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు.

"45 ఏళ్ల తరువాత వ్యోమగాములు తొలిసారిగా నీటిపై దిగారు. చాలా సంతోషంగా ఉంది" అని ట్రంప్ ట్వీట్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

"అంతరిక్షయానం కూడా సాధారణ విమాన ప్రయాణంలాగా మారిపోయినప్పుడు భవిష్యత్‌లో కూడా మానవాళి మనుగడకు భద్రత ఉన్నట్లే" అని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు.

డ్రాగన్ ఎండీవర్

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, డ్రాగన్ ఎండీవర్

ఈ వ్యోమగాములిద్దరూ సురక్షితంగా భూమిని చేరడం అమెరికన్ స్పేస్ ఏజెన్సీ చరిత్రలో ఇదో కొత్త అధ్యాయం కావచ్చు.

భవిష్యత్‌లో అంతరిక్ష ప్రయోగాలకు అవసరమైన రవాణా సౌకర్యాలను స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ కంపెనీల నుంచి కొనుగోలు చేసేందుకు ఇవి వెసులుబాటు కల్పించింది.

ఇలా ప్రైవేట్ ఏజెన్సీలకు కాంట్రాక్టులను అప్పగించడం ద్వారా బిలియన్ల డాలర్లను ఆదా చేయవచ్చని ప్రభుత్వ ఏజెన్సీ చెబుతోంది. ఆ నిధులతో తమ ఆర్టెమిస్ ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపైకి వ్యోమగాములను పంపించే ప్రయత్నాలు చేయవచ్చు, తర్వాత తర్వాత అంగారకుడిపై దృష్టి సారించవచ్చు.

ఇద్దరూ విజయవంతంగా భూమిపైకి చేరుకోవడం అంటే, తమ దేశస్థులను కక్ష్యలోకి పంపి మళ్లీ తిరిగి సురక్షితంగా తీసుకురాగల పూర్తి సేవలు అందించగలగడమేనని అమెరికా మరోసారి ధ్రువీకరించుకుంది.

2011లో అమెరికా షటిళ్లను సేవల నుంచి తొలగించిన తర్వాత, ఆ దేశం ఆ సామర్థ్యాన్ని కోల్పోయింది.

ఇప్పుడు వీరిద్దరూ దిగేందుకు అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా, దాని వాణిజ్య భాగస్వామి స్పేస్ ఎక్స్ హరికేన్ ఇసాఇయాస్‌కు చాలా దూరంగా ఉన్న ఒక ప్రాంతాన్ని ఎంచుకుంది.

వ్యోమగాములను తిరిగి తీసుకువచ్చే నౌకలకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి పశ్చిమ ఫ్లోరిడా దగ్గర పెన్సకోలా జలాల్లోకి వెళ్లాలని ఆదేశించారు.

అక్కడ వారు ఏ వాతావరణ పరిస్థితుల్లో దిగాలి అనేదానిపై మిషన్ కంట్రోలర్స్ కఠిన మార్గదర్శకాలు జారీ చేశారు. వ్యోమగాములను తిరిగి భూమిపైకి రావడానికి అనుమతించే ముందు వారు తాజా వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేశారు.

ఆ తర్వాత, హర్లీ, బెంకెన్ ఉన్న కాప్స్యూల్ తన థ్రస్టర్లను మండించి కక్ష్యలోంచి కిందికి పడింది.

డగ్ హార్లీ, బెంకెన్

ఫొటో సోర్స్, NASA

సముద్రంలో మెల్లగా ల్యాండింగ్

అసలు ఈ క్యాప్స్యూల్ ఎలా దిగింది?

అంటే, కాప్స్యూల్ అత్యధిక వేగంతో అంటే, మొదట్లో అది సెకనుకు వందల కిలోమీటర్ల వేగంతో దిగింది. అది వాతావరణంలోంచి కిందికి దిగుతున్న సమయంలో, ఎండీవర్ కింద ఉండే కవచం 2 వేల డిగ్రీల సెల్సియస్ వరకూ వేడెక్కింది.

అది, దాదాపు 18 వేల అడుగుల ఎత్తులోకి చేరుకోగానే, దానిని తేలేలా చేసే ఒక వ్యవస్థ రెండు పారాచూట్లు విచ్చుకునేలా చేసింది. ఆ సమయంలో కాప్స్యూల్ గంటకు దాదాపు 560 కిలోమీటర్ల వేగంతో కిందికి దిగుతోంది. అది 1800 మీటర్ల ఎత్తులోకి వచ్చాక, మరో నాలుగు ప్రధాన పారాచూట్లు తెరుచుకున్నాయి. అవి కాప్స్యూల్‌ను‌ సముద్ర ఉపరితలంపై మెల్లగా దిగేలా చేశాయి.

కాప్స్యూల్ భూమికి తిరిగివచ్చిన ప్రతిసారీ ఇలాగే జరుగుతుంది. ఆ సమయంలో దాని చుట్టూ వేడి వాయువులు ఉంటాయి కాబట్టి, కొన్ని నిమిషాలపాటు రేడియో సిగ్నల్స్ పనిచేయవు.

ఇంతకు ముందు 45 ఏళ్ల క్రితం అమెరికా సిబ్బందితో ఉన్న చివరి కాప్స్యూల్ సముద్రంలో పడింది. అంతరిక్షంలోని సోవియట్ సూయజ్ నౌక దగ్గరికి వెళ్లిన అపోలో వ్యోమనౌక తర్వాత తిరిగి భూమిని చేరినప్పుడు, పసిఫిక్‌ మహాసముద్రంలో దిగింది.

డగ్ హార్లీ, బెంకెన్ ఇద్దరూ మే చివర్లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. స్పేస్ ఎక్స్ రూపొందించిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వారిని అంతరిక్షంలోకి పంపించారు. ఈ ప్రయోగం అమెరికా అంతరిక్ష ప్రయాణంలో కొత్త శకానికి నాంది పలికింది.

తక్కువ భూ-కక్ష్యలోకి తమ సిబ్బందిని పంపించడానికి ఇకమీదట సొంత రవాణా హార్డ్ వేర్‌ను ఉపయోగించకూడదని నిర్ణయించిన నాసా, బదులుగా వాణిజ్య భాగస్వాముల నుంచి ఆ సేవలు కొనుగోలు చేయాలనుకుంది.

గత ఏడాది నాసా స్పేస్ ఎక్స్ అభ్యాసాలు

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, గత ఏడాది నాసా స్పేస్ ఎక్స్ అభ్యాసాలు

నాసా, స్పేస్ ఎక్స్ బంధం

కాలిఫోర్నియాకు చెందిన స్పేస్ ఎక్స్ ఈ సేవలను అందించిన తొలి సంస్థగా నిలిచింది. అది నాసాకు ఫాల్కన్ రాకెట్‌లో మళ్లీ ఉపయోగించగలిగే భాగాలను కూడా అందించింది.

స్పేస్ ఎక్స్ తో భాగస్వామ్యం వల్ల ఈ ప్రయోగానికి అయ్యే వ్యయాన్ని తగ్గించినట్లు నాసా నిర్వాహకుడు జిమ్ బ్రిడెన్‌స్టైన్ తెలిపారు.

బోయింగ్ కంపెనీ కూడా అంతరిక్ష కేంద్రానికి వెళ్లడానికి ‘టాక్సీ సర్వీసుల’ను రూపొందిస్తోంది. కానీ ‘స్టార్‌లైనర్’ కాప్స్యూల్‌లో సాఫ్ట్ వేర్ సమస్యలు తలెత్తడంతో అది ఆ సేవలను పరిచయం చేయడం ఆలస్యం అవుతోంది.

స్పేస్ ఎక్స్

కాప్స్యూల్ అనుకున్నట్లే సముద్రంలోకి దిగి, ఈ మిషన్ విజయవంతంగా పూర్తి కావడంతో, నాసా ‘ఆపరేషనల్’ స్పేస్ ఎక్స్ వాహనాలతో ముందుకు వెళ్లే అవకాశం ఉంది. బహుశా సెప్టెంబర్ చివరికి ఇది జరగవచ్చు.

స్పేస్ ఎక్స్

వచ్చే ఏడాది ఎండీవర్‌ను మళ్లీ రాకెట్‌ ద్వారా ప్రయోగించవచ్చని ఆశిస్తున్న నాసా దానిని ఆధునికీకరణ కోసం పంపించనుంది. ఈసారి అందులో వెళ్లే సిబ్బందిలో వ్యోమగామి, బాబ్ బెంకెన్ భార్య మెగాన్ మెస్ఆర్థర్ కూడా ఉండే అవకాశం ఉంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 3
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 3

ఇంతకు ముందు షటిల్ మిషన్ జరిగినప్పుడు (అందులో డగ్ హార్లీ వెళ్లారు) అంతరిక్ష కేంద్రంలో స్మారకంగా ఉంచిన అమెరికా జెండాను హర్లీ, బెంకెన్ ఇప్పుడు తిరిగి భూమికి తీసుకొచ్చారు.

1981లో జరిగిన తొలి షటిల్ మిషన్‌లో కూడా అమెరికా జెండాను అంతరిక్షంలోకి తీసుకెళ్లారు. ఈ దశాబ్దం తర్వాత అమెరికా తన వ్యోమగాములను మళ్లీ చంద్రుడిపైకి పంపిస్తుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)