కరోనావైరస్: మెదడుపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?

- రచయిత, ఫెర్గుస్ వాల్ష్
- హోదా, బీబీసీ మెడికల్ కరెస్పాండెంట్
గుండెపోటు, మతి భ్రమించడం, ఆందోళన, తికమక, అలసట...ఇలా ఏదైన జరగవచ్చు. కోవిడ్-19 ఊపిరితిత్తులపై మాత్రమే కాదు మెదడుపై కూడా ప్రభావం చూపిస్తుంది.
కరోనావైరస్ సోకితే నాడీ వ్యవస్థకు కూడా అపాయమేనని రాను రాను స్పష్టవవుతోంది.
కరోనావైరస్ సోకినవారు, వ్యాధి తగ్గుముఖం పట్టాక కూడా జ్ఞాపకశక్తి తగ్గిపోవడం, అలసట, దేని మీదా దృష్టి పెట్టలేకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయని రిపోర్ట్ చేసారు.
కొంతమందిలో ఈ లక్షణాలు ముదురుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
64 యేళ్ల పాల్ మిల్రియాకు కరోనావైరస్ సోకి రెండుసార్లు గుండెపోటు వచ్చింది. మిల్రియా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కమ్మ్యూనికేషన్ విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కుడివైపు కొంచం నరాల బలహీనత తప్ప ఆయనకు పెద్ద ఆరోగ్య సమస్యలేమీ లేవు!
రెండుమార్లు గుండెపోటు తరువాత కూడా మిల్రియా పూర్తిగా కోలుకోగలిగారు. ఆయన లండన్‌లోని నేషనల్ హాస్పిటల్ ఫర్ న్యూరాలజీ అండ్ న్యూరోసర్జరీ(ఎన్‌హెచ్‌ఎన్ఎన్)లో చికిత్స పొందారు. మిల్రియా కోలుకోవడం అసాధారణమైన విషయమని అక్కడి డాక్టర్లు అభిప్రాయపడ్డారు.

కరోనావైరస్ సోకిందని తెలిసాక చికిత్సకోసం ఆయన యూనివర్సిటీ కాలేజ్ హాస్పిటల్‌లో చేరారు. అక్కడ ఐసీయూలో ఉండగా మొదటిసారి గుండెపోటు వచ్చింది. దానితోపాటు ఉప్పిరితిత్తుల్లో, కాళ్లల్లో ప్రాణాంతకమైన బ్లడ్ క్లాట్స్ కనిపించాయి. వెంటనే ఆయనకు రక్తాన్ని పలుచబరిచే (ఏంటీకోఆగ్యులెంట్) మందులు ఇచ్చారు. మరికొద్ది రోజుల్లోనే రెండోసారి పోటు వచ్చింది. ఇది భారీ స్ట్రోక్ అవ్వడంతో ఆయన్ని ఎన్‌హెచ్ఎన్ఎన్‌కు తరలించారు.
“మేము చూసింది కొత్తగా, వింతగా, భిన్నంగాఉంది”
“పాల్‌ను ఆస్పత్రికి తీసుకువచ్చినప్పుడు ఆయన పరిస్థితి బాలేదు. ఒకవైపే చూడగలుగుతున్నారు. ఫోన్ ఎలా వాడాలి, పాస్వర్డ్ ఏమిటి లాంటి వివరాలు మర్చిపోయారు. ఏంటీకోఆగ్యులెంట్ మందులవలన మెదడులో బ్లీడింగ్ అయ్యుండొచ్చు అనుకున్నాం. కానీ మేము చూసినది చాలా వింతంగా, భిన్నంగా అనిపించింది" అని కన్సల్టెంట్ న్యూరోలజిస్ట్ డా. అరవింద్ చంద్రదేవ అన్నారు.
మామూలుగా ఇవి 300 ఉంటాయి. గుండెపోటువచ్చినవారిలో 1000 ఉంటాయి. కానీ పాల్ మిల్రియాకి 80,000 లకు పైగా ఉన్నాయి.
“ఇలాంటిది నేనింతకుముందు ఎప్పుడూ చూడలేదు. కరోనావైరస్ సోకడం వలన అతని శరీరంలో రక్తం చాలా ఎక్కువ జిగటగా మారింది.” అని చంద్రదేవ అన్నారు.

ఫొటో సోర్స్, Empics
లాక్‌డౌన్‌లోకరోనావైరస్వలనవచ్చినగుండెపోటుకేసులుపెరిగాయి
రెండువారాల్లో ఆరుగురు కోవిడ్-19 రోగులు గుండెపోటుతో ఎన్‌హెచ్ఎన్ఎన్‌లో చేరారు. కరోనావైరస్ సోకగానే శరీరంలో రోగనిరోధక వ్యవస్థ చెయ్యవలసినదానికన్నా ఎక్కువగా పనిచెయ్యడంవలన శరీరంలోనూ, మెదడులోనూ ఇంఫ్లమేషన్ పెరుగుతోంది.
పాల్ మిల్రియాకు రెండోసారి గుండెపోటు వచ్చాక అతను బతకడం కష్టమని భావించారు.
“నేను బతకడం కష్టమని, వేచి చూడడం తప్ప ఇంకేం చెయ్యలేమని డాక్టర్లు నా భార్యపిల్లలతో చెప్పారు. కాని ఊహించని విధంగా నేను కోలుకున్నాను." అని పాల్ అన్నారు.
పాల్ క్రమంగా కోలుకుంటున్నారు. అతని జ్ఞాపకశక్తి మెరుగవుతోంది. శారీరక దృఢత్వం కూడా పెరుగుతోంది.

కరోనావైరస్మెదడునిప్రభావితంచేస్తుందనిస్పష్టమయ్యింది
“ప్రారంభంలో ఊపిరితిత్తులపై మాత్రమే ప్రభావం ఉంటుంది అనుకున్నాం. రాను రాను ఈ వైరస్ వలన మెదడుకి కూడా ప్రమాదమేనని స్పష్టమవుతోంది. మెదడుకు ఆక్సిజన్ అందకపోవడం ఇక ముఖ్య కారణం. కానీ బ్లడ్ క్లాట్ అవ్వడం, హైపర్-ఇంఫ్లమేటరీ రెస్పాన్స్ లాంటి కారణాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలా కాకుండా ఈ వైరస్ నేరుగా మెదడుపై ప్రభావం చూపిస్తోందా అనేది పరిశీలించవలసిన విషయం.” అని యూనివర్సిటీ ఆఫ్ లివర్‌పూల్ ప్రొఫెసర్ టామ్ సాల్మన్ అన్నారు.
కన్సల్టంట్ న్యూరోలజిస్ట్ మేఖేల్ జాండి ఏమన్నారంటే "గతంలో సార్స్, మెర్స్ లాంటి వ్యాధులు కూడా నాడీ వ్యవస్థపై ప్రభావం చూపించిన కేసులున్నాయిగానీ ఇలాంటిది ఇంతవరకూ మేమెప్పుడూ చూడలేదు. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూతో కొంతవరకు పోల్చవచ్చు. అప్పట్లో ఆ ఫ్లూ సోకినవారిలో మరో 10-20 యేళ్లవరకు మెదడు, నాడీ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు రావడం చూసాం."
అయితే 1918 లో వచ్చిన ఫ్లూతో, కోవిడ్-19 పోల్చినప్పుడు కాస్త జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. కానీ రాను రానూ పెరుగుతున్న కేసులవలన కోవిడ్-19 రోగులలో మెదడు, నాడీ వ్యవస్థమీద పడే దీర్ఘకాలిక ప్రభావాలను అధ్యయనం చెయ్యల్సిన అవసరం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- రైతుబంధు సాయంలో సగం పెద్ద రైతులకేనా
- సెల్ఫీలతో ఇబ్బంది పెడతారు, నంబర్ అడిగి.. ఫ్రెండ్షిప్ చేస్తావా అంటారు: తేజస్ ఎక్స్‌ప్రెస్ 'ట్రెయిన్ హోస్టెస్'
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- చైనాలో మరో కొత్త వైరస్, మహమ్మారిగా మారనుందా
- భారత్ బయోటెక్: జులై నుంచి మనుషులపై కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు
- చైనా ప్రభుత్వానికి మేం భారతీయ యూజర్ల డాటా ఇవ్వలేదు: టిక్ టాక్
- ‘నా దగ్గర వేరే దారి లేదు, నేనెలాగూ చనిపోతా’ - సోనియాతో రాజీవ్ గాంధీ
- రెండు నెలలకు సరిపడా గ్యాస్ సిలెండర్లను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశం.. యుద్ధానికి సూచనా?
- నిజంగానే భారత్ మహిళలకు అత్యంత ప్రమాదకర దేశమా? రాయిటర్స్ నివేదికలో వాస్తవమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








