తెలంగాణ ఇంటర్మీడియెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఫొటో సోర్స్, Telangana IPR/FB
తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్మీడియట్ ఫలితాలను గురువారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు కలిపి మొత్తం 9.5 లక్షల మంది పరీక్షలు రాశారు.
ఇంటర్ మొదటి ఏడాది పరీక్షల్లో 2,88,383 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. రెండో సంవత్సర ఫలితాల్ల 2,83,462 మంది విద్యార్థులు పాసయ్యారు. ఉత్తీర్ణత శాతం మొదటి ఏడాదికి 60.01 కాగా, ద్వితీయ సంవత్సరానికి 68.86 శాతంగా ఉందని మంత్రి వెల్లడించారు.
ఇంటర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల శాతాలు:

తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2,549 జూనియర్ కాలేజీలు ఇంటర్ బోర్డు పరిధిలో ఉన్నాయి.
గత సంవత్సరం ఫలితాల విడుదలలో జరిగిన జాప్యం ఈ సారి లేకుండా చూసేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఫలితాల విడుదలలో పొరపాట్లు జరిగాయంటూ గతంలో ఇంటర్ బోర్డుపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో విద్యార్థులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు, ప్రతీ జూనియర్ కళాశాలలో మానసిక నిపుణులను అందుబాటులో ఉంచాలని ఇంటర్ బోర్డు కాలేజీలను ఆదేశించింది. తరువాత మానసిక నిపుణుల స్థానంలో, కౌన్సిలర్లుగా లెక్చరర్లనే గుర్తించడం ప్రారంభించినట్టు బీబీసీకి చెప్పారు ఇంటర్ బోర్డు కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్.

గత ఏడాది ఇంటర్ ఫలితాల్లో తప్పులకు కారణం అని ఆరోపణలు ఎదుర్కొన్న గ్లోబరీనా టెక్నాలజీని పక్కన పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థ సీజీజీ ద్వారా పరీక్షలు, ఇతర పనులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సాంకేతికంగా ఎలాంటి తప్పులు జరగకుండా ముందుగానే సాఫ్ట్‌వేర్‌ను అన్ని విధాలా పరీక్షించినట్టు అధికారులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు 2019: ‘‘సాఫ్ట్‌వేర్‌లో లోపాలు.. కోడింగ్, డీకోడింగ్‌లో సమస్యలు’’
- తెలంగాణ: ఇంటర్ ఆత్మహత్యలు.. బోర్డు రద్దే పరిష్కారమా?
- తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై నివేదిక కోరిన రాష్ట్రపతి కార్యాలయం
- ఎడిటర్స్ కామెంట్: ఇంటర్మీడియట్ పిల్లల చావులకు బాధ్యులెవరు?
- ‘హిందీ-చీనీ భాయీ భాయీ’ విని విని చెవులు పగిలిపోయాయి.. చైనా యుద్ధ బందీ అయిన భారత సైనికుడి కథ
- ‘చైనా సైనికుడి ఎడమ కంటిపై కాల్చాను.. కుళాయి నుంచి నీరు కారినట్లు శరీరం నుంచి రక్తం కారింది’
- 'గాల్వాన్‌లో సైనికులు రాళ్ళు, కర్రలతో కొట్టుకుని చనిపోయారు' - జనరల్ మాలిక్
- కరోనావైరస్ కాలర్ ట్యూన్: ఫోన్లో నిత్యం జాగ్రత్తలు చెప్పే స్వరం ఎవరిదో తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








