థాయ్ మసాజ్‌కు ప్రతిష్ఠాత్మక యునెస్కో జాబితాలో చోటు.. ఇంతకూ ఈ మసాజ్ మూలాలు ఎక్కడివి?

ఫొటో సోర్స్, Getty Images
థాయ్ మసాజ్‌కు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. దీనికి ప్రతిష్ఠాత్మక 'ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో)' సాంస్కృతిక జాబితాలో చోటు దక్కింది.
'ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ' అనే జాబితాలో స్థానం కల్పించడం ద్వారా నువాడ్ థాయ్‌ను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అంశంగా యునెస్కో గుర్తించింది.
ప్రఖ్యాత నిర్మాణాలకు ప్రత్యేక గుర్తింపునిచ్చే ప్రపంచ వారసత్వ సంపద జాబితా, ఈ సాంస్కృతిక జాబితా వేర్వేరు.
సాంస్కృతిక జాబితాలో మూడు విభాగాల్లో మొత్తం 550 అంశాలు ఉన్నాయి. ఇవి 127 దేశాలకు చెందినవి.
ఇందులో ఏటా కొత్త అంశాలు చేరుతుంటాయి. ఈ ఏడాది సంబంధిత కమిటీ సమావేశం దక్షిణ అమెరికాలోని కొలంబియా దేశ రాజధాని బొగోటాలో జరుగుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇతర సంప్రదాయ మసాజ్‌లతో పోలిస్తే థాయ్ మసాజ్ భిన్నమైనది. ఈ మసాజ్‌లో శరీర కదలికలు ఎక్కువగా ఉంటాయి. థెరపిస్టులు కొన్నిసార్లు చేతులతోనే కాకుండా ముంజేయి, మోకాలుతోనూ శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తారు.
థాయ్ మసాజ్ మూలాల గురించి యునెస్కో వివరిస్తూ- పూర్వం థాయ్ రైతు సమాజంలో ఆరోగ్య పరిరక్షణకు ఈ మసాజ్ చేయించుకోవడం అలవాటుగా ఉండేదని తెలిపింది. ప్రతి గ్రామంలో మసాజ్ చేసేవారు ఉండేవారని, పొలంలో పనిచేయడం వల్ల కండరాల నొప్పులు వస్తే వీరి దగ్గరకు వెళ్లి మసాజ్ చేయించుకొనేవారని చెప్పింది.
సాంస్కృతిక జాబితాలో చేర్చడం ద్వారా భవిష్యత్తు తరాల కోసం పరిరక్షించాల్సిన ఆవశ్యకత ఉన్న పాటలు, కథలు, ఇతర అంశాలకు గుర్తింపు ఇస్తామని యునెస్కో చెప్పింది.
ఈ అంశాలు వారసత్వ సంపదలో భాగమని, వీటిని కాపాడుకోవడానికి క్రియాశీల ప్రయత్నాలు చేయాలని యునెస్కో చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- బోరిస్ జాన్సన్: మళ్లీ ప్రధానిగా కన్జర్వేటివ్ నేత.. బ్రిటన్ ఎన్నికల్లో టోరీల ఘన విజయం
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- తెలుగు భాష ఎప్పటిది? ద్రవిడ భాషలు ఎన్నాళ్ల నాటివి?
- ఏనుగుల దెబ్బకు భయపడి చెట్లపై బతుకుతున్నారు
- ఉదారవాదానికి కాలం చెల్లిందా? పుతిన్ మాట నిజమేనా?
- ఎల్ నినో సరే, మరి 'ఇండియన్ నినో' అంటే ఏమిటో తెలుసా...
- సనా మారిన్: పదిహేనేళ్లప్పుడు బేకరీలో ఉద్యోగి.. 34 ఏళ్లకు దేశ ప్రధాని
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








